న్యూఢిల్లీ: ఏపీ రాజధాని అంశం (AP Capital Issue)పై సుప్రీంకోర్టు (Supreme Court) లో మరో పిటిషన్ దాఖలైంది. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయాలంటూ ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ పిటిషన్ దాఖలు చేశారు. ఒకే చోట అభివృద్ధి కాకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని శివ రామకృష్ణ కమిటీ సూచించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. అమరావతి రాజధాని అంశంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం, రైతులు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అమరావతి రాజధాని విచారణ జనవరి 31న జరగనుంది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు రెండు పిటిషన్లను కలిపి విచారించే అవకాశం ఉంది
ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది
