Movies

సినీ నటుడు రవితేజ జన్మదినం సందర్భంగా

సినీ నటుడు రవితేజ జన్మదిన సందర్భంగా

హీరోయిజమే రవితేజం..!

#################

హ్యాపీ బర్త్ డే బాస్

గడ్డం మాపు..రఫ్ఫు రూపు..
పిడికిలి బిగించి కొడితే..
ఆడు భద్ర..!

తెలుగు కొంచెం వచ్చు..
సిగరెట్టు కాల్చడం మాత్రం పూర్తిగా వచ్చు..
సారీ చెప్పడమంటే
హగ్ చేసుకునే చెప్పాలంటూ
తమిళమ్మాయి
అసిన్ తో సీనేసుకున్న
కిక్ బాక్సర్..!

ఒకే గదిలో ఆడపిల్లతో
కలిసి ఉంటూ..
శ్రావణితో మర్యాదాట
ఆడుకున్న సుబ్రమణ్యం..!

హాయిరే హాయ్..
జాంపండురోయ్..
నాయికను మెప్పించేందుకు
పడవెక్కి పాడితే..
అబ్బో..సింధూరం..
మొదలైంది దుమారం..!

రవితేజ..మాస్ మహారాజా..

మాసే అతడి క్లాసు..
కాని క్లాసు చేసినా
అది హై కలాసు..
నిర్మాతకు ఉండని లాసు..
మగధీర కంటే..
బాహుబలికి ముందే..
జక్కన్న కనుగొన్న
విక్ర”మార్కు”డు..
సుత్తి కొట్టకుండా
పెద్ద హిట్టు కొట్టేసిన
అత్తిలి సత్తి..!
నేను పోయేటప్పుడు
నా చెయ్యి మీసంపై
ఉండాలంటూ
అలాగే కన్ను మూసిన
విక్రమ్ రాథోడ్..
మాస్ జనాల డూడ్…!

అమితాబు ఫేను..
ఈ డాన్ శీను..
ఉంటే చాలు పండుతుంది
ప్రతి సీను..
చెబుతూ స్టోరీస్..
పోగేసాడు ‘స్వీట్ మెమొరీస్’

అల్లరిప్రియడు ఎనక తిరిగి..
అన్నయ్య ని ఇబ్బంది పెట్టి..
కాస్త..కూస్త..చేస్తా..చేస్తా..
నేనింతే…
అనుకునేవేళ..
లేచాడు మాస్ ప్రేమికుడు..
ఇడియట్ రూపంలో..
హీరో ఇలా కూడా ఉంటాడా
అనిపిస్తూ..కొత్తగా కనిపిస్తూ!
మొదలైంది రవితేజ జమానా
చంటి గాడి నమూనా..!!
తేజమే ఇజమైంది..
క్రాక్ గా ఉంటూ కూడా
షేక్ చేశాడు..
ఒక రకం సినిమా
రవితేజ ఇలాకా..
అది ధమాకా..!

వాల్తేరు వీరయ్య
అదిరిపోయే స్టెప్పులేస్తే
పక్కన చేరిన విక్రమ్ సాగర్
అన్నయ్యతో జతకట్టి
పైకప్పులెగరేసాడు..
మెగాస్టారుకు పోటీ కాకపోయినా..
ఆయనంత ధాటీగా..!

🥁🥁🥁🥁🥁🥁🥁