DailyDose

జీవో నెం.1 రద్దయ్యేటంతవరకు పోరాటం ఆగదు..

జీవో నెం.1 రద్దయ్యేటంతవరకు పోరాటం ఆగదు..

రాజ్యాంగం మౌలిక సూత్రాలను కాపాడుకుందాం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలను తిప్పికొడదాం

ప్రజాస్వామ్య వ్యతిరేక జీవో 1 రద్దయ్యే వరకు నిరంతర పోరు సాగిద్దాం

విజయవాడలో జీవో 1 రద్దుకై అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాలు, వామపక్షాల నేతల ప్రతిజ్ఞ

కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు, ప్రముఖ న్యాయవాది, జీవో 1వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ సుంకర రాజేంద్రప్రసాద్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర నాయకురాలు ఏ.వనజ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబురావు, సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సిపిఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి బి.రమణారావు తదితరులు

జీవో 1 వ్యతిరేక పోరాట కమిటీ పిలుపుమేరకు నేడు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం, సిపిఐ మరియు పలు ప్రజా సంఘాల నేతలు, ప్రముఖులు జీవో1 రద్దు అయ్యే వరకు పోరాటం సాగిస్తామని ప్రతిజ్ఞ పూనారు.

రాజేంద్రప్రసాద్ ప్రతిజ్ఞ చేయించారు

#ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు, సుంకర రాజేంద్రప్రసాద్, అక్కినేని వనజ, సిహెచ్.బాబురావు తదితరులు మాట్లాడుతూ………..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలిస్తున్నాయి. నిరంకుశ పాలన సాగిస్తున్నాయి. ప్రజాస్వామ్య విలువలను మంట కలుపుతున్నాయి

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 1 రాజ్యాంగ విరుద్ధమైనది. ప్రజల నిరసనలు అణిచివేసే దురుద్దేశంతో విడుదల చేశారు

ఇప్పటికే ప్రజా ఉద్యమాలను అణిచివేస్తున్నారు. నిరంకుశ విధానాలకు చట్టబద్ధత కల్పించేందుకే జీవో 1 విడుదల చేశారు

కేంద్ర ప్రభుత్వం మోడీ ముఖ్యమంత్రిగా గుజరాత్ లో సాగిన మారణకాండను బట్టబయలు చేసే బిబిసి డాక్యుమెంటరీని నిషేధించడం అప్రజాస్వామికం

మోడీ బాటలోనే జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నారు

కేంద్రం రాజ్యాంగ విరుద్ధ చర్యలను వైయస్సార్ ప్రభుత్వం గుడ్డిగా బలపరుస్తున్నది

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన చీకటి జీవోను బిజెపి అగ్ర నేతలు బలపరచడం సిగ్గుచేటు

బిజెపి, వైసిపి ప్రభుత్వాల కుమ్మక్కు అయ్యి ప్రజల గొంతు నులిమేస్తున్నాయి

కోర్టు తీర్పులతో నిమిత్తం లేకుండా పోరు సాగుతుంది

ప్రజా కోర్టులో రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఎండగడతాం, జీవో 1 రద్దు అయ్యే వరకు పోరాటం సాగిస్తాం

అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు, జీవోకు వ్యతిరేకంగా నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. జీవో రద్దయ్యే వరకు పోరాటం సాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ .కోటేశ్వరరావు, బెజవాడ బార్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి బొమ్మసాని రవి, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నేత ఎస్.రమేష్ బాబు పలువురు సిపిఎం, సిపిఐ మరియు ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.