Devotional

అహోబిలం మఠం కేసు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో ఎదురుదెబ్బ..

అహోబిలం మఠం కేసు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో ఎదురుదెబ్బ..

దిల్లీ: అహోబిలం మఠం కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మఠం సాధారణ కార్యకలాపాలతో ప్రభుత్వానికి ఏం సంబంధమని..
మఠాన్ని ఎందుకు చేజిక్కించుకోవాలనుకుంటున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఆలయాలు, ధార్మిక క్షేత్రాలను ధర్మకర్తలకే వదిలేయాలని.. అందులో జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. ఈ కేసు వ్యవహారంలో గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది.

అహోబిలం మఠంలో ఈవో నియామకాన్ని తప్పుబడుతూ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. హైకోర్టు తీర్పును సమర్థించింది