Devotional

TNI. ఆధ్యాత్మిక వార్తలు. అమ్మవారికి ఏ రోజున ఏ నైవేద్యం పెట్టాలి

TNI. ఆధ్యాత్మిక వార్తలు. అమ్మవారికి ఏ రోజున ఏ నైవేద్యం పెట్టాలి

🙏🌹అమ్మవారికి ఏ తిథి రోజున..ఏ అభిషేకం..ఏ నైవేద్యం.. పెట్టాలి🌹🙏

🙏పాడ్యమి రోజు..
ఆవు నేయి తో అభిషేకం చేస్తే సకల రోగాలు నివారణ అవుతాయి.

🙏విదియ రోజు..
చక్కర తో అభిషేకమ చేస్తే దీర్గాయువు కలుగుతుంది.

🙏తదియ రోజు..
ఆవు పాలు తో అభిషేకం చేస్తే ఎలాంటి అకాల మృత్యు దోషాలు తొలిగిపోతాయి.

🙏చవితి రోజున..
పిండివంటలు నైవేద్యం పెట్టడం వలన సకల విద్యలు లబిస్తాయి.

🙏పంచమి రోజు..
అరటి పళ్ళు నైవేద్యం పెట్టడం వలన మేధస్సు, బుద్ది శక్తి పెరుగుతుంది.

🙏షష్టి రోజున..
తేనే తో అమ్మవారిని అభిషేకించి, బ్రహ్మణునికి దానం ఇవటం వలన కాంతి పెరుగుతుంది, యషస్సు పెరుగుతుంది.

🙏అష్టమి రోజున..
బెల్లం నీటి తో అభిషేకించి, మంచి బెల్లం ఎవరికయినా దానం ఇవటం వలన అష్ట కష్టాలు అంటారు కదా అలాంటివి అన్నీ తీరిపొతాయి అంటారు.

🙏నవమి రోజున..
నైవేద్యం పెట్టడం వలన సకల సౌభాగ్యలు కలుగుతాయి.

🙏దశమి రోజున..
నల్ల నువ్వులు తో చేసిన పదార్ధాలు నైవేద్యం పెట్టడం వలన సకల రోగలు పోతాయి అని , దీర్గాయుషు పెరుగుతుంది.

👉వారాలలో ఏ నైవేద్యం..!

ఆదివారం రోజు – పాలు
సోమవారం – పాయసం
మంగళవారం – అరటిపళ్ళు
బుధవారం – వెన్న
గురువారం – పటికబెల్లం
శుక్రవారం – తీపి పదార్ధాలు
శనివారం – ఆవు నేయి

🙏అమ్మవారికి ఇష్టమయిన అన్నం.🌹🙏
👉పులగం – అన్నం + పెసరపప్పు
పాయసన్నం
పెరుగు అన్నం
బెల్లం అన్నం
నైవేద్యం పెట్టకుండా మనం తింటే అది దొంగతనం చేసి తిన్నట్టు, అందుకని దేవునికి నివేదన చేయకుండా తినకూడదు.

🙏అమ్మవారిని పూజ ఎలా చేయాలి.!🌹

👉ఆచమనం ముందు చేయాలి..
కాల స్మరణ చేయాలి (సంకల్పం )..
అబిషేకం చేయాలి..
మామిడి రసం(చూత పళ్ళు ) తో అబిషేకం చేయటం వలన సరస్వతి ఆఇంటి ని విడిచి వెళ్ళదు, అ ఇంట్లో వుండే వారికీ సరస్వతి కటాక్షం ఉంటుంది.
ఆవు నేయి తో అబిషేకం చేయటం వలన సకల రోగాలు పోతాయి,
పెరుగు తో అబిషేకం వలన సంపదలు కలుగుతాయి అమ్మవారికి చాలా ప్రీతిగా ఉంటారు, సకల రోగాలు పోతాయి,
తేనే తో అబిషేకం చేయటం వలన యశస్సు పెరుగుతుంది, మేదస్సు పెరుగుతుంది,
ఆవు పాల తో అబిషేకం చేయటం వలన సకల దోషాలు పోయి, సకల శుభాలు కలుగుతాయి.
గంధం తో అబిషేకం చేయటం వలన మనలో తామస గుణం పోతుంది,
పసుపు తో అబిషేకం చేయటం వలన సౌభగ్యమ్ పెరుగుతుంది.

👉అమ్మవారిని 108 పువ్వులు తో పూజ చేయడం విశేషం. కమలాలు, జాజిపువులు, లేత బిల్వాలు – సకల సంపదలు కలుగుతాయి,
దాడిమి పువ్వులు (దానిమ్మ చెట్టుకు పూసే పువ్వులు అంటే కాయకి ముందు వచ్చే పువ్వులు కాకుండా దానిమ్మ పువ్వు చెట్లు చిన్న చిన్న గులాబిలా వేరుగా ఉంటాయి) వాటితో,
మల్లెలు కూడా అమ్మవారికి ఇష్టం..

👉 ఇవన్నీ భక్తి భావంతో మనము ఏర్పరచుకున్నవే ఆ తల్లికి భక్తిగా ఎలా పూజించిన లోటు ఎంచదు చదన్నం నాకు ప్రీతి అని పేదవారు ఇంట్లో చద్దిబువ్వ తిని వారిని కరుణించే తల్లి ఆడంబరాలు తిది ప్రకారం లెక్కపెట్టుకుని చేసే పూజలకు కాదు ప్రసన్నం కాదు మనసుతో చేసే నిత్య ఆరాధన అర్చనకు ప్రసన్నం అవుతుంది ,మరి ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే మన తృప్తి కోసం మనకు ఆ తల్లి పట్ల ఉన్న శ్రద్ధ ఆప్యాయత ఆశ ఆ తల్లి సన్నిధిలో సేవ చేస్తూ సమయం గడపటం కోసం మానసికంగా బాహ్యంగా కూడా ఆమె సన్నిధిలో కాసేపైన ప్రపంచిన విషయాలు మరచి నివశించడం కోసం ఇవన్నీ ఆచరిస్తూ ఆ తల్లిని పూజిస్తున్నాము కానీ ఆమె మననుండి మనస్ఫూర్తిగా పెట్టె నమస్కారానికి ప్రసన్నం అయిపోతుంది. ఉదాహరణకు మీ ఇంట్లో చంటి బిడ్డ ఇది కావాలి అని అడగలేడు కానీ మీరు ఎన్నో రకాలుగా అలంకారం చేసి మురిసిపోతారు మీరు చేయకపోయినా వాడు నోరు తెరచి అడగలేడు, అలంకారం దిష్టి చుక్క పెట్టుకుని పదే పదే చూసుకుని మురిసిపోతారు ఆ బిడ్డ నుండి ఏది ఆశించారు అది మీ స్వచ్ఛమైన ప్రేమ ,భక్తుడికి భగవంతుడు పైన కూడా అటువంటి ప్రేమే ఉంటుంది ఉండాలి అదే నిజమైన భక్తి.

🕉శుభమస్తు 🕉
🙏🌹సర్వే జనా సుఖినోభవంతు🙏

*🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
*✍🏻 *27.01.2023 ✍🏻**
*🗓 *నేటి రాశి ఫలాలు 🗓**

🐐 మేషం
ఈరోజు (27-01-2023)

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దుర్గాదేవిని ఆరాధన శుభప్రదం.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (27-01-2023)

తలచిన కార్యక్రమాలు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు సంపాదిస్తారు. ధన, వస్త్రలాభాలు కలవు. సూర్య నమస్కారం వల్ల మంచి జరుగుతుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
.ఈరోజు (27-01-2023)

పట్టుదలే ఆయుధంగా ముందుకు సాగండి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (27-01-2023)

ప్రారంభించిన కార్యక్రమాలు పూర్తవుతాయి. విందు, వినోద సుఖాలు కలుగుతాయి. ఆర్థిక విషయాలలో ఆచితూచి
వ్యవహరించండి. శాంతంగా వ్యవహరించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (27-01-2023)

బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. మీ రంగాల్లో ఒత్తిడిని దరిచేరనీయకండి. ముఖ్య వ్యవహారాలలో ఓర్పు చాలా అవసరం. ఖర్చులు లేకుండా పెరగకుండా జాగ్రత్తపడాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (27-01-2023)

కార్యసిద్ధి ఉంది. మంచి పనులను ప్రారంభిస్తారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు.
లక్ష్యసాధనలో ఆత్మీయుల సహకారం ఉంటుంది. గురు ధ్యానం మంచిది.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (27-01-2023)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే ఇంకా బాగుంటుంది.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (27-01-2023)

మీ రంగాల్లో లాభదాయక ఫలితాలు సొంతం అవుతాయి. దైవబలం అనుకూలిస్తోంది. ఆశయాలు సిద్ధిస్తాయి. కాలం సహకరిస్తోంది. శ్రీలక్ష్మీదేవి సందర్శనం
ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (27-01-2023)

కష్టపడి పనిచేస్తే తప్ప పనులు పూర్తికావు. కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం మంచిది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (27-01-2023)

మీ రంగాల్లో విశేషమైన ఫలితాలు సాధిస్తారు. మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. శ్రీఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (27-01-2023)

మీ మీ రంగాల్లో విజయం సాధిస్తారు. సంపూర్ణకార్యసిద్ధి ఉంది. సంపూర్ణ మనోబలం కలిగి ఉంటారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (27-01-2023)

మీ మీ రంగాల్లో ప్రణాళికాబద్దంగా ముందుకు సాగకపోతే సమస్యలు తప్పవు. అవసరానికి సహాయం చేసేవారున్నారు. బంధుప్రీతి కలదు. స్థిరాస్తి కి సంబంధించిన వ్యవహారాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. ఇష్టదైవనామస్మరణ ఉత్తమం.