Devotional

నేటి రాశి ఫలితాలు28-1-2023

నేటి రాశి ఫలితాలు28-1-2023

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
*✍🏻 *28.01.2023 ✍🏻**
*🗓 *నేటి రాశి ఫలాలు 🗓**

🐐 మేషం
ఈరోజు (28-01-2023)

మంచి ఫలితాలను అందుకుంటారు. మీ చిత్తశుద్ధే మిమ్మల్ని రక్షిస్తుంది. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (28-01-2023)

మిశ్రమ కాలం. పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచిది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (28-01-2023)

మంచి కాలం. ఏ పని ప్రారంభించినా సులువుగా పూర్తవుతుంది. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. చంద్ర బలం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ
సౌఖ్యం కలదు. ఇష్టదైవ ప్రార్ధన మరింత మేలు చేస్తుంది.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (28-01-2023)

శుభకాలం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (28-01-2023)

బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధిబలంతో ఆపదల నుంచి బయటపడతారు. మీ శ్రమ వృథా కాదు. మిత్రులు సహకారం ఉంటుంది. సమయానికి నిద్రాహారాలు
తప్పనిసరి. సూర్య ఆరాధన శుభదాయకం.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (28-01-2023)

చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధు, మిత్రులతో విబేధాలు రావచ్చు. ఆరోగ్య పరిరక్షణ అవసరం. చంద్ర శ్లోకం చదవాలి.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (28-01-2023)

మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనిని విశేషమైన కృషితో పూర్తిచేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి.
వ్యాపారంలో ఆర్ధికంగా ఎదుగుతారు. ఈశ్వర శ్లోకాలు చదవాలి.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (28-01-2023)

ప్రయత్న కార్యసిద్ధి ఉంది. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. షష్ఠమ స్థానంలో చంద్ర సంచారం అనుకూలంగా ఉంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (28-01-2023)

ప్రారంభించిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. వివాదాల్లో తలదూర్చకండి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం శ్రేయోదాయకం.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (28-01-2023)

సంపూర్ణ అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. చతుర్ధ స్థానంలో చంద్రబలం అనుకూలంగా లేదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. దుర్గారాధన మంచి ఫలితాలను ఇస్తుంది
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (28-01-2023)

ప్రారంభించిన పనుల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. భోజన నియమాలను పాటించడం ఉత్తమం. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి దర్శనం శుభప్రదం,
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (28-01-2023)

ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు అప్పగించినలను బాధ్యత
సమర్ధంగా నిర్వర్తిస్తారు. ఒకటీ రెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో
జాగ్రత్త. చంద్ర ధ్యానం శుభప్రదం.