Politics

రాష్ట్రంలో వైకాపా పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది

రాష్ట్రంలో వైకాపా పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది

null
రాష్ట్రంలో వైకాపా పరిస్థితి రోజుకింత దిగజారే ప్రమాదం

లోకేష్ యువగళం, పవన్ వారాహి యాత్ర, చంద్రబాబు పర్యటనల ప్రభావం ప్రజలపై
తీవ్రంగా ఉండే ఛాన్స్

ఐదు నెలల క్రితం తాను వెల్లడించిన సర్వే ఫలితాలు… ప్రస్తుత ఐప్యాక్ సర్వే ఫలితాలు యధాతధం

సాక్షి దరిద్రపురాతలను ప్రజలు హర్షించరు

యువ గళా నికి వెల్లువెత్తిన అభిమాన జనం

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

రాష్ట్రంలో వైకాపా పరిస్థితి రోజుకింత దిగజారి పోనుందని నరసాపురం ఎంపీ, ఆ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తెలిపారు . తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తోన్న యువ గళం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న వారాహి యాత్ర, ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా నెలలో మూడు పర్యటనలు నిర్వహించడం ఖాయమన్నారు. యువ గళం, వారాహి యాత్ర, చంద్రబాబు పర్యటనల ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉండనుందని, దీనితో వైకాపా పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… గత నాలుగైదు నెలల క్రితం తాను ఒక సర్వే నిర్వహించి ఫలితాలను వెల్లడించడం జరిగిందని గుర్తు చేశారు. తాజాగా ఐప్యాక్ నిర్వహించిన సర్వే నివేదిక ఆ సంస్థ ముగ్గురి డైరెక్టర్లలో ఒకరైన విశాల్ సంతకంతో వెలుగులోకి వచ్చిందన్నారు. మాజీ మంత్రులు, మంత్రుల పోటీ చేయనున్న అసెంబ్లీ స్థానాలలో వెలువడనున్న ఫలితాల గురించి ఐప్యాక్ సర్వే నివేదికలో వెల్లడించడం జరిగిందన్నారు. గత నాలుగైదు నెలల క్రితం తన సర్వే నివేదికలో వెల్లడించిన ఫలితాలే, ఐప్యాక్ సర్వే నివేదికలోనూ పునరావృత్తమయ్యాయని పేర్కొన్నారు.

మంత్రుల గెలుపోటములపై తాను చెప్పింది… ఐప్యాక్ వెల్లడించింది

రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల గెలుపోటములపై తాను గత ఐదు నెలల క్రితం నిర్వహించిన సర్వే లో వెల్లడైన ఫలితాలే, ఐప్యాక్ సర్వేలోనూ పునరావృత్తమయ్యాయని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో పర్యాటక శాఖ మంత్రి రోజా 36% ప్రజా ధరణ ఉండగా, టిడిపికి 50 శాతం ప్రజాధరణ కలిగి ఉన్నట్లు తాను గతంలో వెల్లడించానని గుర్తు చేశారు. రోజా గత ఎన్నికల్లో 2,700 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం 12 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యే అవకాశం ఉన్నది. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్వల్ప విజయావకాశాలు ఉన్నాయని గతంలో తన సర్వే నివేదిక ఆధారంగా పేర్కొన్నాను. ఐప్యాక్ సర్వేలోనూ మూడు నుంచి నాలుగు వేల ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించే అవకాశం ఉందని చెప్పారు. నెల్లూరులో 600 ఓట్ల తేడాతో విజయం సాధించే అవకాశం ఉందని ఐప్యాక్ సర్వేలో వెల్లడించారు. తాను గతంలో ఒక్క శాతం మైనస్ ఉన్నట్లుగా పేర్కొనడం జరిగింది. ఒక్క శాతం అటు ఇటు ఉండడం సర్వే ఫలితాలలో సహజమే. మంత్రి దాడిశెట్టి రాజా గెలుస్తారని గతంలో తాను చెప్పాను. ఐ ప్యాక్ సర్వేలోనూ 1000 ఓట్ల తేడాతో విజయం సాధిస్తారని చెప్పారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైకాపాకు 38% ప్రజా ధరణ ఉన్నట్టు, టిడిపికి 50 శాతం ప్రజాధరణ ఉన్నట్లు తాను గతంలో పేర్కొనడం జరిగింది. ఐప్యాక్ సర్వేలోనూ 2000 ఓట్ల తేడాతో కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఓడిపోతారని నివేదికలో పేర్కొన్నారు. సర్వేపల్లి లో పోటాపోటీ ఉంటుందని గతంలో తాను చెప్పానని, ఐప్యాక్ సర్వే నివేదికలో అదే ఫలితం పునరావృత్తం అయ్యింది. మంత్రి ఆదిమూలపు సురేష్ గత ఎన్నికలలో 30 వేల మెజారిటీతో గెలిచారు. ఈసారి 3000 ఓట్లతో ఓటమిపాలవుతారని ఐప్యాక్ సర్వే వెల్లడించింది. పెడనలో మరో మంత్రి జోగి రమేష్ ఓటమిపాలవుతారని తాను పేర్కొన్నానని, ఐప్యాడ్ సర్వే లోను అదే విషయం వెళ్లడయింది. మంత్రి విశ్వరూప్ గతంలో 30 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, ఈసారి 2000 ఓట్ల తేడాతో గెలిచే అవకాశం ఉందని ఐపాక్ సర్వే పేర్కొంది. తాను కూడా గతంలో విశ్వరూప్ విజయం సాధిస్తారని చెప్పాను. చీపురుపల్లి లో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తాను వెల్లడించడం జరిగింది. ఇప్పుడు ఐప్యాక్ సర్వేలోనూ ఆయన ఓడిపోనున్నట్లు పేర్కొన్నారు. కడపలో మంత్రి అంజాద్ భాష విజయం సాధిస్తారని గతంలో తాను వెల్లడించానని, ఐప్యాక్ సర్వేలోనూ అదే తేలింది. డోన్ లో మరో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని గతంలో తాను పేర్కొన్న విషయాన్ని ఐప్యాక్ సర్వేలోను వెళ్లడయ్యింది. ఐప్యాక్ సర్వే నివేదిక ప్రకారం ఐదు మంది మంత్రులు పేర్కొనగా, గతంలో తాను తన సర్వే నివేదిక ప్రకారం నలుగురు విజయం సాధిస్తారని, ఒకచోట హోరా హోరి పోటీ ఉంటుందని పేర్కొనడం జరిగింది. గతంలో తన సర్వే నివేదిక ఆధారంగా వైకాపా ఓడిపోతుందని పేర్కొన్న స్థానాలన్నీ, ఐప్యాక్ సర్వే నివేదిక లోను ఓటమిపాలవుతున్నట్లుగానే పేర్కొనడం జరిగింది. రెండు సర్వే నివేదికలలో ప్రజానాడి ( ట్రెండ్ ) స్పష్టం అయ్యింది.

టిడిపి, జనసేన కలయికతో హోరా హోరి స్థానాలు కూటమి ఖాతాలోకి…

రాష్ట్ర ప్రజలను రక్షించాలనుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి తో జతకట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారని రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. టిడిపి, జనసేన జత కట్టడం వల్ల హోరా హోరి స్థానాలు కూటమి ఖాతాలోకే వెళ్తాయి. గత నాలుగైదు నెలల క్రితం సర్వే నిర్వహించినప్పుడు, హోరా, హోరి స్థానాలు దాదాపు 48 ఉండగా, అవన్నీ వైకాపా ఖాతాలోకే వెళ్తాయని భావించాను. టిడిపి పక్కాగా 92 స్థానాలలో విజయం సాధిస్తుండగా, వైకాపా 29 స్థానాలలో పక్కాగా గెలుపొందనుంది. హోరా హోరి గా పోటీ జరిగే 48 స్థానాలు వైకాపా ఖాతాలోకి వెళ్లిన ఆ పార్టీ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు ఎంత మాత్రం లేవని స్పష్టం చేయడం జరిగింది. 175 స్థానాలకుగాను, 30 అసెంబ్లీ స్థానాలలో ఐ ప్యాక్ నిర్వహించిన సర్వే ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. 30 స్థానాలలో కేవలం 5 స్థానాలలో మాత్రమే ఆ పార్టీ విజయం సాధిస్తుందని సర్వే ఫలితాల ద్వారా వెళ్లడయ్యింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఇదే ట్రెండు కొనసాగితే, వైకాపా 30 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మారుతున్న రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో, 30 స్థానాలు గెలుపొందడం కూడా కష్టమేనని రఘురామకృష్ణం రాజు అన్నారు.

శరీరంపై గొడ్డలి పోట్లు ఉన్నప్పటికీ, గుండెపోటు అని ఎలా చెప్పారు?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం ఆయన శరీరంపై గొడ్డలి పోట్లు స్పష్టంగా కనిపించినప్పటికీ, గుండెపోటుని ఎలా చెప్పగలిగారన్నది అంతు చిక్కడం లేదని రఘురామకృష్ణం రాజు విస్మయం వ్యక్తం చేశారు. శనివారం ఈ నెల 28వ తేదీన సిబిఐ అధికారులు, విచారణ నిమిత్తం కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పిలిచిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా, వారు ఇదే ప్రశ్న అడిగే అవకాశం ఉంది. వైయస్ వివేకా హత్యతో ఆయనకు సంబంధం లేకపోవచ్చు కానీ హత్యకు గురైన వివేకాను చూసిన తరువాత కూడా గుండెపోటు అని ఎలా చెప్పగలిగారన్నది ప్రశ్నార్థకమే. ప్రత్యేక హోదా సాధన కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, శనివారం ఢిల్లీ యాత్ర చేయనున్నట్లు తెలిసింది. కానీ ఢిల్లీ పెద్దలు ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. యువగళం యాత్ర ఇప్పటికే విజయవంతం కాగా, వైఎస్ అవినాష్ రెడ్డి హైదరాబాద్ యాత్ర, ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్ర లు ఏమవుతాయన్నది చూడాలని రఘురామకృష్ణం రాజు అన్నారు.

భగవంతుడితో ఆటలు వద్దు

అహోబిలం మఠం లో వేలు పెట్టాలని చూడడం తగదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణంరాజు హితవు పలికారు. అహోబిలం మఠానికి ఎగ్జిక్యూటివ్ అధికారిని నియమించాలనుకోవడం సరికాదన్నారు. వందల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి చర్చిలను ప్రభుత్వమే నిర్మించాలని చూస్తోందని, అటువంటప్పుడు అహోబిలం మఠానికి ఎగ్జిక్యూటివ్ అధికారిని నియమించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. గత ప్రభుత్వాల హయాంలో ఎవరు కూడా ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదని గుర్తు చేశారు. ఎగ్జిక్యూటివ్ అధికారిని నియమించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి, సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పును వెల్లడించిందని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. దర్శి లో చోటు చేసుకున్న సంఘటనను చూసి, పశువుల ద్వారా స్ఫూర్తి పొంది అయిన ప్రజలు పాలకులను ప్రశ్నించడం నేర్చుకోవాలన్నారు.

ఇద్దరి ఆశయం ఒక్కటే… ఈ దుష్ట ప్రభుత్వాన్ని గద్దె దించడమే

యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, వారాహి బస్సుయాత్ర చేపట్టనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల ఆశయం ఒక్కటేనని, ఈ దుష్ట ప్రభుత్వాన్ని గద్దె దించడమేనని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. దక్షిణ ఆంధ్ర నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కాగా, పవన్ కళ్యాణ్ వారాహి బస్సు యాత్ర ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది. త్వరలోనే వారాహి బస్సు యాత్ర ప్రారంభ తేదీని, వేదికను పవన్ కళ్యాణ్ ప్రకటిస్తామని చెప్పారు. యువ గళం పాదయాత్రకు విపరీతమైన అభిమాన జనం హాజరయ్యారు. అంచనాలకు మించి అద్వితీయంగా యువ గళం పాదయాత్ర కొనసాగుతోందని రఘు రామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

జూలై ఆగస్టు మాసాలలో ముందస్తు ఎన్నికలు

తాను గతంలో చెప్పినట్లుగానే ఈ ఏడాది జులై, ఆగస్టు మాసాలలో రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రఘు రామ కృష్ణంరాజు పునరుద్ఘాటించారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న విశ్వాసమే కాదు, తనకున్న పక్కా సమాచారం. నియంతృత్వ పోకడలు పోతున్న ఈ ప్రభుత్వాన్ని దించి, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే… డబుల్ ఇంజిన్ గా ప్రజల్లోకి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లు వెళ్లాలి. పార్టీలు వేరైనా, ఇద్దరి ఆశయం ఒక్కటే… ఆశయం ఒక్కటైనప్పుడు, ఇద్దరి అనుచరులు కూడా ఒక్కటవుతారు. మనందరి ఆశయం రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు. యువ గళం పాదయాత్ర అంచనాలకు మించి విజయవంతం కావాలి. ఒక ప్రజాస్వామిక వాదిగా తాను అదే కోరుకుంటున్నాను. సాక్షి దినపత్రికలో యువగళం పాదయాత్ర గురించి కారు కూతలు రాశారు. కనీస జ్ఞానం లేకుండా దరిద్రమైన రాతలను రాస్తే ప్రజలు హర్షించరు. సాధారణ వెబ్ సైట్ల కంటే, సాక్షి వెబ్ ఛానల్ రేటింగ్ పడిపోయింది. ఉన్నది ఉన్నట్లు రాయాలి. లేకపోతే మన అనుకుంటున్నా వారు కూడా మన రాతలను చదవరు. రేపు పొద్దున్న మనమే గొడవలు చేసి, వారే గొడవలు చేశారని చెప్పడానికన్నట్లు గా సాక్షి దినపత్రికలో వార్తా కథనాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక వ్యక్తి ప్రజలని కలుసుకొని సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లడాన్ని రాజకీయాలలో ఉన్న వ్యక్తులంతా అభినందించాలి… ఆహ్వానించాలి. రాష్ట్రంలో నడవడంపై తండ్రి, కొడుకులకే పేటెంట్ హక్కులు ఉన్నట్లుగా, ఇంకెవరు నడవ వద్దని, నడిస్తే అనుమతి ఇచ్చేది లేదన్నట్లుగా వ్యవహరించడం సరికాదు. ఇప్పటికైనా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించాలని రఘురామకృష్ణం రాజు సూచించారు.

రెండు దశాబ్దాల పాటు హీరోయిన్ గా కొనసాగిన జమున

రెండు దశాబ్దాల పాటు తెలుగు సినీ హీరోయిన్ గా కొనసాగిన జమున మృతి పట్ల రఘురామకృష్ణం రాజు అశ్రునివాళి అర్పించారు. గోదావరి జిల్లాలతో జమునకు ప్రత్యేక అనుబంధం ఉండేదని, ఆ అనుబంధం తోనే రాజమండ్రి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆమెను స్థానిక ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని గుర్తు చేశారు.