Devotional

నేటి మీ రాశి ఫలాలు

నేటి మీ రాశి ఫలాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
*✍🏻 *29.01.2023 ✍🏻**
*🗓 *నేటి రాశి ఫలాలు 🗓**

🐐 మేషం
ఈరోజు (29-01-2023)

ప్రారంభించిన పనుల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. దైవబలం సంపూర్ణంగా ఉంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (29-01-2023)

మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఖర్చులు
పెరుగుతాయి. రక్తసంబంధీకులతో ఆచితూచి వ్యవహరించాలి. శ్రమ అధికం అవుతుంది. ప్రయాణాల్లో. అజాగ్రత్త వద్దు. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (29-01-2023)

ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. మీ పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. అపరిచితులను అతిగా నమ్మకండి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (29-01-2023)

మంచి సమయం. మనఃస్సౌఖ్యం ఉంది. నూతన వస్తుప్రాప్తి కలదు. అవసరానికి సహాయం చేసేవారున్నారు. బంధుప్రీతి కలదు. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. ఇష్టదైవనామస్మరణ ఉత్తమం.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
.ఈరోజు (29-01-2023)

చేపట్టే పనిలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కలహాలకు తావివ్వకండి. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం మేలు చేస్తుంది.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (29-01-2023)

పనులకు ఆటంకాలు పెరుగుతాయి. ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉండటం మంచిది. చంచల స్వభావంతో ఇబ్బందులు పడతారు. బంధు, మిత్రులతో విబేధాలు రావచ్చు. చంద్రు శ్లోకం చదవాలి.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (29-01-2023)

శ్రమ అధికం అవుతుంది. అనవసర ఖర్చులు సూచితం. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (29-01-2023)

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (29-01-2023)

బాధ్యతలను గుర్తించి పనిచేయాలి. తోటి వారి సహకారంతో ఒక ఇబ్బంది నుంచి బయటపడతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. అనవసర విషయాల్లో
కలుగచేసుకోకుండా ఉండడం మంచిది. హనుమాన్ చాలీసా చదివితే సత్ఫలితాలు వస్తాయి.

🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (29-01-2023)

కొందరి వల్ల ఆటంకాలు ఎదురవుతాయి. చెడు తలంపులు వద్దు. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. అప్పుల విషయంలో జాగ్రత్త. కలహాలకు తావివ్వరాదు. శివారాధన ఉత్తమం.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (29-01-2023)

శుభకాలం. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. నిర్ణీత కాలంలో పనులను పూర్తిచేస్తారు. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. తోటివారి సహాయ సహకారాలు ఉంటాయి. శ్రీలక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (29-01-2023)

ఉద్యోగం విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. చక్కటి ఆలోచనా విధానంతో ముందుకు సాగి మంచిపేరు
సంపాదిస్తారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. శివ నామస్మరణతో ఆపదలు తొలగిపోతాయి. ఉత్తమ ఫలితాలు వస్తాయి.
🦈🦈🦈🦈🦈🦈🦈