Business

కుప్ప కూలిన అదానీ సామ్రాజ్యం

కుప్ప కూలిన అదానీ సామ్రాజ్యం

38 ఏళ్ల ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌.. అతని సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత స్టాక్‌ మార్కెట్లు వణికిపోతున్నాయి. కేవలం రెండు ట్రేడింగ్‌ సెషన్లలో 10లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ప్రపంచంలోనే అతి పెద్ద కుబేరుడైన గౌతమ్ అదానీ సామ్రాజ్యం.. ఆ రిపోర్ట్‌ దెబ్బకు కుప్పకూలిపోతోంది.
భారత స్టాక్‌ మార్కెట్లు కుదేలవుతున్నాయి. గత రెండు సెషన్లలో భారీగా కుప్పకూలిపోయాయి. రూ.10 లక్షల కోట్లకుపైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్‌లో ఉన్న అదానీ గ్రూప్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. అమెరికా షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌తో..అదానీ గ్రూప్‌ షేర్లు రెండ్రోజుల్లోనే 5-నుంచి 20శాతం పతనమయ్యాయి. దీంతో సుమారు 4 లక్షల కోట్లకు పైగా మార్కెట్‌ విలువ పడిపోయింది. ప్రపంచ కుబేరుల లిస్ట్‌లో మూడో స్థానం నుంచి ఏడుకు పడిపోయారు అదానీ.

అదానీ గ్రూప్ లో ఏ లెక్క స‌రిగా లేదంటూ ఆరోపించింది హిండెన్ బ‌ర్గ్ రీసెర్చ్‌ సంస్థ. దశాబ్దాలుగా భారత స్టాక్ మార్కెట్లో అకౌంటింగ్ మోసాలు చేస్తోందని, స్టాక్ మానిపులేషన్‌కు పాల్పడుతోందని, అడ్డగోలుగా షేర్లను పెంచుకుంటోందని సంచలన ప్రకటన చేసింది.

హిండెన్‌ బర్గ్‌ రిపోర్ట్‌తో అదానీ మాత్రమే కాదు.. ఆ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన రిటైల్‌ ఇన్వెస్టర్లకు కూడా భారీ నష్టం వాటిల్లింది. ఆయనకు అప్పులిచ్చిన ఎస్‌బిఐ, పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ కూడా ఇప్పుడు వణికిపోతున్నాయి. వరుసగా 2 రోజులు ఆ షేర్లు పడిపోవడంతో ఎల్ఐసీ కి సుమారు రూ.16 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. మరోవైపు అదానీ గ్రూప్‌ షేర్ల నష్టాలతో ఎస్‌బిఐ స్టాక్ కూడా రెండు రోజులుగా భారీగా పతనమైంది. దీంతో ఈ ప్రభుత్వ సంస్థల్లో డిపాజిట్లు చేసిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇంతటి ఆర్థిక ప్రకంపనలకు కారణం హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ ఇచ్చిన నివేదిక. అమెరికాలో షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తోన్న ఈ సంస్థ..ఆయా కంపెనీలపై రీసెర్చ్‌ చేస్తుంది. నాథన్‌ అండర్సన్‌ 2017లో ఈ సంస్థను స్థాపించాడు. అప్పటి నుంచి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది హిండెన్‌బర్గ్‌.

నాథ‌న్ ఆండ‌ర్సన్‌ క‌నెక్టిక‌ట్ విశ్వ విద్యాల‌యం నుండి ఇంట‌ర్నేష‌న‌ల్ బిజినెస్‌లో చ‌దివాడు. ఆ తర్వాత ఇజ్రాయెల్ లో అంబులెన్స్ డ్రైవ‌ర్ గా ప‌ని చేశాడు. తిరిగి అమెరికా వచ్చి ఫాక్ట్ సెట్ రీసెర్చ్ సంస్థలో ప‌ని చేశాడు. హారీ మార్కోపోలోస్‌తో కలిసి ప్లాటినం పార్ట్‌నర్స్‌ అనే సంస్థపై దర్యాప్తు కోసం పనిచేశాడు. 2017 నుంచి హిండెన్ బర్గ్ నివేదిక.. ప్రస్తుతం భారత మార్కెట్లను వణికిస్తుంది. ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా భారత మార్కెట్లు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టుతో దాదాపు 10లక్షల కోట్లు ఆవిరై పోయాయి. అసలు హెండెన్ బర్డ్ రీసెర్చ్ అంటే ఏంటి.. ఇది ఎలా పని చేహిండెన్ బర్గ్ నివేదిక.. ప్రస్తుతం భారత మార్కెట్లను వణికిస్తుంది. ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా భారత మార్కెట్లు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టుతో దాదాపు 10లక్షల కోట్లు ఆవిరై పోయాయి. అసలు హెండెన్ బర్డ్ రీసెర్చ్ అంటే ఏంటి.. ఇది ఎలా పని చేస్తుందో…
మార్కెట్లను వణికిస్తున్న అంబులెన్స్‌ డ్రైవర్‌..!
ఓ ఏళ్ల వ్యక్తి.. భారత్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించాడు. అతడు ఇచ్చిన నివేదికతో.. భారత స్టాక్ మార్కెట్లు వణికిపోతున్నాయి.

ఈ నివేదిక ఆధారంగా.. రూ.10 లక్షల కోట్లు ఆవిరై పోయాయి అంటే దీని ప్రభావం ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

ఈ నివేదిక ప్రభావంతో.. ప్రపంచ సంపన్నుల్లో మూడో స్థానం ఉన్న వ్యక్తి.. ఏకంగా 7 వ స్థానానికి పడిపోయాడంటే దీని ఎఫెక్ట్ ఎలా ఉందో చెప్పొచ్చు.
దీని దెబ్బకు అదానీ గ్రూప్‌ విలువ భారీగా పడిపోయింది. అక్షరాలా రూ. 4 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీనికి కారణం న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థనే కారణం.

ఏమిటీ హెండెన్‌బర్గ్‌ రీసెర్చి..?
భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిన హిండెన్ బర్గ్ రిపోర్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకుంది.
ఇది న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తుంది. 2017లో నాథన్‌ అండర్సన్‌ అనే వ్యక్తి దీనిని స్థాపించాడు.

దీని ముఖ్య ఉద్దేశం.. ఆర్థిక రంగంలో విపత్తులను గుర్తిస్తుంది. పెట్టుబడులు, రుణాలను విశ్లేషిస్తుంది.

వీటితో పాటు.. ఫైనాన్షియల్‌ ఫోరెన్సిక్‌ రీసెర్చ్ సేవలను కూడా అందిస్తుంది. పెద్ద కంపెనీల్లో అవకతవకలు, దుర్వినియోగం వంటి వాటిని పసిగడుతుంది. అలాగే షార్ట్‌సెల్లింగ్‌లో పెట్టుబడులు పెడుతుంది.

ఎవరీ నాథన్‌ అండర్సన్‌..?
నాథన్‌ అండర్సన్‌ గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు.

అంతర్జాతీయ వాణిజ్యంపై డిగ్రీ చేసిన నాథన్.. ఆ తర్వాత ఇజ్రాయెల్‌లోని అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేశాడు.

అనంతరం అమెరికా వచ్చి.. సాఫ్ట్‌వేర్‌ గా పనిచేశాడు. హిండెన్‌ ప్రారంభానికి ముందు.. రీ మార్కోపోలోస్‌ తో కలిసి ఓ సంస్థపై దర్యాప్తు చేశాడు.

ఇక హిండెన్ బర్గ్.. ఒక కంపెనీ గురించి వివరాలు సేకరించాలంటే.. ముందు ఆ కంపెనీకి సంబంధించిన రికార్డులను సేకరిస్తుంది.

కంపెనీ ఉద్యోగులతో సమాచారం సేకరించి.. హిండెన్‌బర్గ్‌తో సంస్థకు చేరవేస్తుంది. ఆ తర్వాత కంపెనీ షేర్లలో షార్ట్‌ పొజిషన్లను తీసుకుంటాయి.

ఆ కంపెనీ విలువ పతనమైనపుడు హిండెన్‌బర్గ్‌కు ఆదాయం సమకూరుతుంది.

2020లో ఇలానే ఈ సంస్థ రీసెర్చ్ చేసింది. దీంతో నికోలా కార్పొరేషన్‌ కంపెనీ విలువ 40 శాతానికి పడిపోయింది.

2017 నుంచి పలు కంపెనీలపై ఈ సంస్థ రీసెర్చ్ చేసింది.

హిండెన్‌బర్గ్‌ పేరు పెట్టడానికి గల కారణాలను ఆ సంస్థ వెల్లడించింది. హిండెన్‌బర్గ్‌ అనేది మానవుడు సృష్టించిన ఓ విపత్తు.

హైడ్రోజన్‌ నింపిన బెలూన్‌ ప్రమాదానికి కారణమైంది. ఈ ప్రమాదంలో చాలా మంది చనిపోయినట్లు తెలుస్తుంది. అందుకే ఈ పేరు పెట్టినట్లు సమాచారం.
హర్షద్ మెహతా 1991 మరియు 1992 మధ్య సెన్సెక్స్ స్కామ్‌ను ఒంటరిగా నిర్వహించాడు. ఈ స్కామ్ ఫలితంగా రూ. 4500 కోట్ల మోసం జరిగింది. తనను కుంభకోణం కేసు నుంచి తప్పించేందుకు అప్పటి ప్రధాని పివి నరసింహారావుకు కోటి రూపాయల లంచం ఇచ్చానని హర్షద్ మెహతా బహిరంగంగా ప్రకటించాడు.
హర్షద్ మెహతా అనగానే గుర్తుచ్చేది భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోని (1992 సెక్యూర్టీస్) అతిపెద్ద కుంభకోణం. ఈ కుంభకోణానికి సూత్రధారి అయిన హర్షత్ మెహతా మరణానంతరం, ఆయన కుటుంబానికి 27 ఏళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ వచ్చింది. మెహతా కుటుంబంపై ఉన్న ట్యాక్స్ డిమాండ్ ను ఇన్ కం ట్యాక్స్ ట్రిబ్యునల్ తిరస్కరించింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ట్యాక్స్ ఊబిలో కూరుకుపోయిన మెహతా భార్య జ్యోతి, సోదరుడు అశ్విన్ కు భారీ ఊరట కలిగింది. 1992లో ఆదాయ పన్ను శాఖ మెహతా కుటుంబానికి రూ.2వేల కోట్లు పన్ను విధించింది. దీనిపై దశాబ్దాలుగా హర్షద్ మెహతా కుటుంబం కోర్టులు చుట్టూ తిరిగింది. బ్యాంకుల పిటిషన్లకు ఎన్నో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేసింది. సుదీర్ఘ కాలం క్లయిమ్స్ పర్వం కొనసాగింది. ఎట్టకేలకు మెహతా కుటుంబానికి అనుకూలంగా తీర్పు వెలువడింది. కోట్ల ట్యాక్స్ నుంచి ఉపశమనం దొరికింది.

హర్షద్ మెహతా ఎవరంటే..
ఇండియాలో ఫస్ట్ టైం జరిగిన అతిపెద్ద స్కాం.. హర్షద్ మెహతా కుంభకోణం (1992 సెక్యూర్టీస్ స్కాం). చాలా తక్కువ మందికి మాత్రమే ఈ కుంభకోణం గురించి తెలుసు. ఇండియాలో బిగ్ బుల్ మార్కెట్ అయిన దలాల్ స్ట్రీట్ లో ‘హర్షద్ మెహతా’ అనే వ్యక్తి స్టాక్ షేర్ బ్రోకర్. బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు (15 రోజుల వ్యవధిలో) లోన్లు తీసుకోవడం.. దాన్ని స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతుండేవాడు. అదే 15 రోజుల్లో స్టాక్ మార్కెట్లో లాభాలు గడించి బ్యాంకులకు చెల్లించేవాడు. ఒక్క బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు, అలా ఒక్కో బ్యాంకులో లోన్లు మీద లోన్లు తీసుకుంటూ మనీ రోటేట్ చేస్తుండేవాడు. RF deal, (రెడీ ఫార్వడ్ డీల్, బ్యాంకు రీసిప్ట్).. పలు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటూ మెహతా బురిడి కొట్టించాడు. స్టాక్ మార్కెట్ ను తెలివిగా ఉపయోగించుకుని తన మార్కెట్ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. ఆ విషయం గుర్తించిన బ్యాంకులు అతని దగ్గర నుంచి డబ్బులు విత్ డ్రా చేయడం మొదలుపెట్టాయి. ఆ తరువాత హర్షద్ పై బ్యాంకులు 72 క్రిమినల్ కేసులను నమోదు చేశాయి.

ఇందులో అన్నీ సివిల్ కేసులే ఫైల్ చేశాయి. ఈ కేసులను విచారించిన సుప్రీంకోర్టు హర్షద్ ను దోషిగా తేలుస్తూ 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.25వేలు జరిమానా విధించింది. మెహతాను థానె జైలుకు తరలించారు. డిసెంబర్ 31, 2001 రోజు ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకులు జరుపుకుంటోంది. ఆ రాత్రి ఉన్నట్టుండి మెహతా తన కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే థానె సివిల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి 12.30 గంటలకు హర్షద్ తుదిశ్వాస విడిచారు. తన 47ఏళ్ల వయస్సులోనే మెహతా మరణించాడు. అప్పటికే ఆయనపై 27 కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
రూ.4 కోట్లు ట్యాక్స్ ఎగవేత:-
1992, ఫిబ్రవరి 28 నుంచి మెహతా కుటుంబంపై ఆదాయ శాఖ చర్యలు చేపట్టింది. అప్పటినుంచి వరసగా వారి సంబంధిత ఆస్తులపై తనిఖీలు చేపట్టింది. సోదాల్లో ఎన్నో డాక్యుమెంట్లు, షేర్ మార్కెట్ కు సంబంధించిన సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకుంది. 1992, జూన్ 4న సీబీఐ మెహతా కుటుంబానికి సంబంధించిన ఆస్తులపై సెర్చ్ ఆపరేషన్ జరిపింది. అనంతరం హర్షద్ మెహతా తన 1992-93 ఏడాది ఆదాయంపై ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేశాడు. ట్యాక్స్ డిపార్ట్ మెంట్ దాన్ని తిరస్కరించింది. మెహతా ఫ్యామిలీ రూ.4 కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు 1995లో ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. చివరికి ఈ వ్యవహారం కాస్తా ఇన్ కం ట్యాక్స్ ట్రిబ్యునల్ కు చేరింది. 23ఏళ్ళ తరువాత ట్రిబ్యునల్.. మెహతా కుటుంబ పన్ను కట్టాలనే ఐటీ శాఖ డిమాండ్ ను తోసిపుచ్చింది. క్లీన్ చిట్ ఇచ్చింది. పన్ను కట్టాల్సిన అవసరం లేదని తేల్చింది.
నాడు హర్షద్ మెహతా
నేడు హిండెన్ బర్గ్ మన దేశంలో ఆర్థిక వ్యవస్థ ను చిన్నా భిన్నం చేసాయనడంలో ఎటువంటి సందేహాలు లేవు.