NRI-NRT

అమెరికా తెలుగు సంబరాలకు శరవేగంగా సన్నాహాలు

అమెరికా తెలుగు సంబరాలకు శరవేగంగా సన్నాహాలు

సంబరాల వెబ్‌సైట్ ప్రారంభించిన నాట్స్

అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలకు నాట్స్ శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్‌ను నాట్స్ టీం ప్రారంభించింది. దీని ద్వారా సంబరాలకు హాజరయ్యే వారు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ సంబరాలకు విచ్చేసే తెలుగు అతిరథ మహారథుల గురించి ఈ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. పద్మ భూషణ్ గాన కోకిల సుశీల, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ సంగీత దర్శకులు థమన్, మణిశర్మ, ఇలిజియం బ్యాండ్ తో పాటు ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల, సహజనటి జయసుధ, ఆది సాయి కుమార్, జగపతిబాబు, ఆలీ ఇలా ఎందరో సినీ స్టార్లు, కళకారులు, వివిధ రంగాల ప్రముఖులు నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో పాల్గొననున్నారు. సంబరాలకు వచ్చే అతిథులపై ఇప్పటికే దాదాపు స్పష్టత వచ్చిందని సంబరాల కమిటీ సమావేశంలో కమిటీ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని తెలిపారు.. సంబరాల్లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలపై కూడా సంబరాల కమిటీ చర్చించింది. సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు తయారుచేసింది. నాట్స్ బోర్డ్ ఛైర్ విమెన్ అరుణగంటి సంబరాల్లో మహిళలకు సంబంధించిన కార్యక్రమాలపై చేయాల్సిన కృషిని వివరించారు. నాట్స్ ముఖ్య నాయకులు, తెలుగు సంబరాల కమిటీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సంబరాలకు వేసిన కమిటీలు ఇప్పటి వరకు తమ అప్పగించిన బాధ్యతల్లో జరిగిన పురోగతి ఈ సందర్భంగా వివరించాయి. మేలో నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు వేలాది మంది హాజరవుతారు కాబట్టి దానికి తగ్గట్టుగా చేయాల్సిన ఏర్పాట్లపై నాట్స్ సంబరాల టీం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. మార్చి 4 వ తేదీన భీమవరం ఎస్.ఆర్.కె.ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్ధుల సమ్మేళనం కూడా నాట్స్ సహకారంతో నిర్వహించటంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.
శ్రీ దోశ వారు అందించిన అల్పాహారం అందరి మెప్పు పొందింది.