Devotional

TNI. ఆధ్యాత్మికం.. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి చూచి వద్దాం రండి.

TNI. ఆధ్యాత్మికం.. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి చూచి వద్దాం రండి.

🚩🕉️🙏శ్రీకాళహస్తి🙏🕉️🚩

దక్షిణ భారతదేశంలోనే ప్రశస్తమైనది ఈ దేవాలయం అదే శ్రీ కాళహస్తి.
63 నయనారులలో ఒకడైన కన్నప్ప ఇక్కడే శివలింగం కళ్ళలోనుండి వస్తున్న రక్తాన్ని ఆపడానికి తన కళ్ళను పెరిగి శివలింగానికి అమర్చిన హృదయాన్ని ద్రవింపజేసే మహత్తర ఘట్టం చోటు చేసుకున్న పుణ్యస్ధలం ఈ శ్రీకాళహస్తి.
శ్రీకాళహస్తి తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది.
వాయుదేవునికై నిర్మించిన ఏకైక దేవాలయం శ్రీకాళహస్తిలో ఉంది.
వాయుదేవుడు ఇక్కడ శివుని రూపంలో శ్రీకాళహస్తీశ్వరునిగా పూజలందుకుంటాడు. చోళరాజు శ్రీ రాజేంద్ర చోళుని చే 12వ శతాబ్దంలో ఈ దేవాలయం నిర్మించబడింది.

భారతీయ ఖగోళశాస్త్రంలో ప్రముఖులైన రాహువు, కేతువు లకు కూడా ఇక్కడ గుడులు నిర్మించారు.
సువర్ణముఖి నది ఒడ్డున ఉంది.
శ్రీ కాళహస్తిని ‘దక్షిణ కైలాసం’ గా భావిస్తారు. మొదటి శతాభ్దానికి చెందిన శైవ సన్యాసులు ఈ దేవాలయం గూర్చి గానం చేశారు.

వాస్తుశిల్పకళ ప్రకారంగా కూడా శ్రీకాళహస్తి ఒక అధ్బుతమైన శివాలయం.
పురాతన సాంప్రదాయ రీతిలో నిర్మించబడిన 120 అడుగుల (36.5m) ఎత్తున్న పెద్ద గోపురం దేవాలయానికి ప్రత్యేక ఆకర్షణ.
పెద్ద రాతిగుట్ట ను తొలిచి ఈ దేవాలయాన్ని నిర్మించారు.
మెదట పల్లవ రాజులు ఈ దేవాలయ నిర్మాణం గావించారు. తమిళులైన చోళ రాజులతో పాటూ విజయనగర రాజులూ ఈ దేవాలయ అభివృద్దికి కృషి చేశారు.
ఐతే ఇతర దేవాలయాల్లాగే శ్రీకాళహస్తి నిర్మాణం కూడా శతాభ్దాలపాటూ జరిగింది.
పదో శతాబ్దంలో చోళరాజులు దేవాలయాన్ని పునరుద్దరించి ఒక రూపునిచ్చారు.
ప్రాకారపు గోడలు, నాలుగు గోపురాలు పన్నెండో శతాబ్దంలో వీరనరసింహరాయార్ చే నిర్మించబడ్డాయి.
120 అడుగుల ఎత్తున్న ప్రధాన గోపురాన్ని, వందకాళ్ళ మంటపాన్ని విజయనగర రాజు శ్రీ క్రిష్ణ దేవరాయలు క్రీ.శె. 1516లో నిర్మించారు.

దేవక్కొట్టకు చెందిన నట్టుక్కొట్ట చెట్టియార్ 1912లో ఒక మిలియన్ డాలర్లు వెచ్చించి ప్రస్తుతమున్న రూపు తెచ్చారు.
అప్పార్, సుందరార్, సంబందార్ మొదలైన నయనారులు శ్రీకాళహస్తీశ్వరున్న­ి తమ ‘తేవారం’ భక్తిగీతాల్లో కొనియాడారు.

పంచబూతాల రూపంలో శివుని ప్రార్దించడం శైవ సాంప్రదాయం.
శ్రీకాళహస్తిలో శివున్ని పంచబూతాల్లో ఒకటైన ‘వాయు’ రూపంలో పూజిస్తారు. (నీరు- తిరువనైకావల్, అగ్ని-అన్నామలైయార్, భూమి-ఏకాంబరేశ్వరార్ దేవాలయం, ఆకాశం (విశ్వం)-చిదంబరం దేవాలయం)
గర్బగుడిలో గాలి చలనం లేకున్నా, గర్బగుడి ప్రదాన ద్వారం మూసివేసినా అక్కడి దీపాలపై మంట కదులుతూ ఉండటం అద్బుతం.
శివుని ఉచ్వాసనిశ్చ్వాస లకు అనుగుణంగా ఆ దీపాలు కదులు తున్నాయని నమ్మకతప్పదు.

శ్రీకాళహస్తిలో కలదు అద్భుతమైన స్వయంభూ లింగం

దాన్ని మనుషులెవరూ ప్రతిష్టించలేదు.
శ్రీ కాళహస్తి చుట్టూ రెండు పవిత్రమైన గుట్టలు ఉన్నాయి.
దుర్గాంబ దేవాలయం ఉత్తరం వైపున ఉన్న గుట్టపై ఉంది.
దక్షిణం వైపున ఉన్న గుట్టపై శివునికి తన కళ్ళను అర్పించిన భక్త కన్నప్ప స్మృత్యర్దం నిర్మించిన ‘కన్నబేశ్వర’ కోవెల ఉంది. దగ్గరలో ఉన్న మరో గుట్టపై ‘సుబ్రమణ్య స్వామి ఆలయం’ ఉంది.

గర్భగుడిలోని లింగాన్ని ఇంతవరకూ మానవులెవరూ, ఆఖరికి పూజారులు కూడా తమ చేతులతో తాకలేదు.
నీరు, పాలు, కర్పూరం, పంచామృతం కలిపి లింగానికి అభిషేకం (స్నానం) చేయిస్తారు. చందనం, పూవులు, జంధ్యం ప్రదాన లింగానికి కాకుండా ఉత్సవ మూర్తికి అర్పిస్తారు.

శివ భక్తులైన సాలెపురుగు(శ్రీ), సర్పం (కాళ), ఏనుగు (హస్తి) పేరు మీదుగా శ్రీకాళహస్తికి ఆ పేరు వచ్చింది.
నిష్కల్మశమైన వాటి భక్తికి మెచ్చి వాటి పేర్లతో కలిపి వాయులింగం శ్రీ కాళహస్తీశ్వరునిగా పూజలందుకుంటుందని శివుడు వరం ఇచ్చాడు.

శ్రీకాళహస్తి క్షేత్రంలో మాత్రం అపసవ్య దిశలో ప్రదక్షిణం చేసి శివుని, జ్ఞానప్రసూనాంబను దర్శించుకోవడం ఇక్కడ ప్రత్యేకత.
అందుకే ఇక్కడ రాహు-కేతువులు శాంతిస్తున్నాయి.
శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖాన స్వామివారి ఆలయం ఉండటంతో ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందుతోంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి…

మొదట పాతాళ వినాయకస్వామిని దర్శించుకున్నాక శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుంటే మంచిది.
నక్కీరుడు అనే భక్తుడు కుష్ఠువ్యాధితో బాధపడుతూ చరమాంకంలో శివుని దర్శించుకుని మోక్షం పొందాలని భావించాడు. కైలాసానికి ఎలా చేరుకోవాలో తెలియలేదు. శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్లి శివుని దర్శించుకున్నాక శిఖరదర్శనం చేసుకోవాలని అదృశ్యశక్తి ఉపదేశం చేసింది.
అలా దర్శనం చేసుకోవడంతో నక్కీరుని కుష్ఠువ్యాధి నయమైంది.
పాతాళ గణపతి ఆలయం వద్ద నాలుగు పర్యాయాలు విఘ్నేశ్వరస్వామిని తలచుకుంటే భక్తులకు మోక్షం లభిస్తుంది.🌺

🔱హర హర మహాదేవ శంభో శంకరా🔱

🕉️🙏🏻ఓం నమశ్శివాయ 🙏🏻🕉️