Health

లక్షల కోట్లకు వారసుడు.. ఆరోగ్యం మాత్రం అతడి చేతుల్లో లేదు..!

లక్షల కోట్లకు వారసుడు.. ఆరోగ్యం మాత్రం అతడి చేతుల్లో లేదు..!

ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి స్థూలకాయం సమస్య..

ఆస్థమా సమస్యకు స్టెరాయిడ్స్ తీసుకోవడం కారణంగా ఒబెసిటీ..

కష్టపడి బరువు తగ్గినా.. మళ్లీ అధిక బరువు సమస్య..!

రిలయన్స్ సామ్రాజ్యానికి ముగ్గురు వారసుల్లో అనంత్ అంబానీ ఒకరు. రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ నెట్ వర్త్ సుమారు రూ.7.20 లక్షల కోట్లు. ఈ సంపదకు ముకేశ్ కుమార్తె ఇషా, పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, చిన్న కుమారుడు అనంత్ అంబానీయే వారసులు. ఇప్పటికే ఇషా, ఆకాశ్ వివాహాలు పూర్తి కాగా, త్వరలోనే అనంత్ అంబానీ పెళ్లి కూడా జరగనుంది. రాధికా మర్చంట్ ను ఆయన వివాహం చేసుకోబోతున్నాడు. ఇటీవలే వీరి వివాహ ఎంగేజ్ మెంట్ కార్యక్రమం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా విడుదలయ్యాయి.

అనంత్ ను గమనిస్తే భారీ కాయంతో కనిపిస్తున్నాడు. రూ.లక్షల కోట్ల సంపదకు వారసుడు అయిన అనంత్ అంబానీని ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి..

అతడు అంత బరువు పెరగడానికి అవే కారణం. దీన్ని అతడి తల్లి నీతా అంబానీ ఓ వార్తా సంస్థతో ఇంటర్వ్యూ సందర్భంగా పంచుకున్నారు. అనంత్ కు తీవ్రమైన ఆస్థమా సమస్య ఉండేదని ఆమె చెప్పారు. దాంతో అతడికి