DailyDose

TNI. నేటి నేర వార్తలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంచలనం

TNI. నేటి నేర వార్తలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంచలనం

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరో సంచలనం చోటుచేసుకుంది. లిక్కర్‌ కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) రెండో చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఢిల్లీలోని రోజ్‌ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో 17 మంది నిందితులపై అభియోగాలు మోపింది. మొత్తం 428 పేజీల చార్జ్‌షీట్‌లో మద్యం కుంభకోణం ఎక్కడ మొదలయింది? ఎవరెవరు పాత్రధారులన్నది వివరంగా తెలిపింది.

చార్జ్‌షీట్‌లో చేర్చిన 17 మంది వ్యక్తులు, సంస్థల పేర్లు:
A1 – సమీర్‌ మహేంద్రు
A2 – సమీర్‌కు చెందిన రెస్టారెంట్‌ ఖావోగాలి
A3 – సమీర్‌కు చెందిన బబ్లీ బేవరేజేస్‌
A4 – సమీర్‌కు చెందిన ఇండో స్పిరిట్‌
A5 – సమీర్‌కు చెందిన ఇండో స్పిరిట్‌ డిస్ట్రిబ్యూషన్‌
A6 – విజయ్‌ నాయర్‌
A7 – శరత్‌ చంద్ర
A8 – శరత్‌కు చెందిన ట్రైడెంట్‌ చెంపార్‌
A9 – శరత్‌కు చెందిన అవంతిక కాంట్రాక్టర్స్‌
A10 – శరత్‌కు చెందిన అర్గనామిక్స్‌ ఎకోసిస్టమ్స్‌
A11 – బినయ్‌ బాబు
A12 – రాజేశ్‌ మిశ్రాకు చెందిన పెర్నార్డ్‌ రికర్డ్‌
A13 – అభిషేక్‌ బోయిన్‌పల్లి
A14 – అమిత్‌ అరోరా
A15 – అమిత్‌కు చెందిన KSJM స్పిరిట్స్‌
A16 – అమిత్‌కు చెందిన బడ్డీ రిటైల్స్‌
A17 – అమిత్‌కు చెందిన పాపులర్‌ స్పిరిట్స్‌

ఆప్‌కు వంద కోట్ల ముడుపులు
కోర్టులో దాఖలు చేసిన రెండో చార్జ్‌షీట్‌లో కుట్ర జరిగిన తీరును ఈడీ సవివరంగా పేర్కొంది. మద్యం కుంభకోణానికి సంబంధించి వంద కోట్ల ముడుపులు ఆమ్‌ అద్మీ పార్టీకి చేరాయని తెలిపింది. పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేరును కూడా ఇందులో పేర్కొంది. లంచంగా వచ్చిన వంద కోట్లను గోవా ఎన్నికల్లో ఆమ్‌ అద్మీ పార్టీ ఉపయోగించిందని ఆరోపించింది. గోవాలో పార్టీ వాలంటీర్లుగా పని చేసిన వారి కోసం ఈ డబ్బు ఖర్చు చేసినట్టు పేర్కొంది.

చార్జ్‌షీట్‌లో సీఎం కేజ్రీవాల్‌, ఎమ్మెల్సీ కవిత పేర్లు
ఇక ఇదే ఛార్జ్ షీట్‌లో కుట్ర గురించి వివరించిన ఈడీ ఓ చోట ఎమ్మెల్సీ కవిత గురించి ప్రస్తావించింది. నవంబర్‌ 12, 2022న అరుణ్‌పిళ్లైని విచారించినప్పుడు కవిత గురించి తెలిసిందని పేర్కొంది. అరుణ్‌ పిళ్లై.. కవితకు సంబంధించిన వ్యక్తిగా ఇండో స్పిరిట్స్‌లో పార్ట్‌నర్‌గా చేరారని తెలిపింది. ఈ సమయంలో కవిత వాడిన రెండు ఫోన్ నెంబర్లను ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ నెంబర్లను ఏ ఏ సమయంలో వాడారో కూడా తేదీల వారీగా ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. సాక్ష్యాలు ధ్వంసం చేసిన వారి పేర్లలో ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించింది ఈడీ.

అలాగే ఎంపీ మాగుంట పేరు కూడా ఈడీ చార్జ్‌షీట్‌లో ఉంది. ఒబెరాయ్‌ హోటళ్లో కుట్రకు సంబంధించిన వ్యవహారమంతా జరిగిందని తెలిపింది. ఆమ్‌ అద్మీ పార్టీతో కవితకు పూర్తి సమన్వయం ఉందని, ఢిల్లీలో మద్యం షాపులకు ముఖ్యంగా L1 షాపులను దక్కించుకునేలా పావులు కదిపారని ఈడీ తెలిపింది. కవిత ప్రత్యేక విమానంలో పలు మార్లు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వచ్చారని ఈడీ తెలిపింది. ఈ సమయంలో కవిత వాడిన అన్ని ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ తెలిపింది. లంచం ఇచ్చే వ్యవహారాన్ని కవిత పర్యవేక్షించి పని పూర్తయ్యేలా చేశారని ఈడీ ఆరోపించింది.

* ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కప్పలబంధం ఎన్ఎస్పి కాలువలో, కప్పలభoదం గ్రామంలో ఇద్దరు గల్లంతు ఇద్దరు కూడా కప్పల బంధం గ్రామస్తులు గా గుర్తింపు మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు…..గాలింపు చర్యలు చేపడుతున్న కల్లూరు ఎస్సై

*విస్సన్నపేట తిరువూరు నియోజకవర్గ

సాగునీటి విడుదలపై బిజెపి ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటూ ఆరోపణ

లక్షలాది ఎకరాల పంటకు నిరంధించాలని డిమాండ్

మూడో జోన్ నీటి విడుదలపై విస్సన్నపేట ఎన్ఎస్పి కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేసిన బిజెపి

బిఆర్ఎస్ దుకాణం మూసేయాలని ఆగ్రహం

ఎన్ఎస్పి మూడో జోనుకు వెంటనే సాగునీటిని విడుదల చేయాలని బిజెపి ఆధ్వర్యంలో విసన్నపేట ఎన్ఎస్పి కార్యాలయం వద్ద ఆందోళన చేశారు

ఈ సందర్భంగా బిజెపి నాయకుడు పులగం వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు లక్షల ఎకరాల పత్తి మిరప మామిడి పంట లు సాగులో ఉన్నాయని అన్నారు వీటికి ఎన్ఎస్పి కాలువల ద్వారా మీరు అందించాల్సిన

తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని అన్నారు ప్రశ్నించాల్సిన ఏపీ ప్రభుత్వం కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని వాబోయారు

సకాలంలో నీరు అందువలన పంట నీరు లేకఎండిపోతుందన్నారు
తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టిన బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఏపీ నేతలు రైతులకు న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నందున దుకాణం మూసి వేసుకోవాలని సూచించారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇద్దరు సీఎంలు బాధ్యతని అన్నారు

*తుని:- కావలి నెల్లూరు మధ్య ( D C M ) సిమెంట్ లారీని ఢీకొని అంటుకున్న మంటలు డ్రైవర్ మృతి ఇంకొక డ్రైవర్ సురక్షితం

*హైదరాబాద్

చిక్కడపల్లి

వి ఎస్ టి లో సమీపంలోనీ ఓ గోదాం లో భారీ అగ్నప్రమాదం.

దట్టమైన పొగలతో ఎగిసిపడుతున్న మంటలు

టెంట్ హౌస్ హోల్ సేల్ సప్లై చేసే గోదాం లో ఘటన

చిక్కడపల్లి పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు

సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు

మంటలు వ్యాపించడంతో భయాందోళనకు గురైన స్థానికులు

మంటలు అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది.

*టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహరాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం

ట్యాపింగ్ కాదు…రికార్డింగ్ అంటోన్న మంత్రులు

నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ అధికారులు..

MLA.శ్రీధర్ రెడ్డి విడుదల చేసిన ఆడియో పై వివరాల సేకరణ

శ్రీధర్ రెడ్డి తో మాట్లాడిన రామ శివారెడ్డి ని విచారించే అవకాశం

రామ శివా రెడ్డి ఫోన్ డేటాను విశ్లేశిస్తున్న ఇంటెలిజెన్స్ అధికారులు