Devotional

నేటి మీ రాశి ఫలితాలు

Auto Draft

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
*✍🏻 *04.02.2023 ✍🏻**
*🗓 *నేటి రాశి ఫలాలు 🗓**

🐐 మేషం
ఈరోజు (04-02-2023)

మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ధర్మసిద్ధి ఉంది. చతుర్ధ స్థానంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమయానికి విశ్రాంతి అవసరం. చంద్రశ్లోకం చదువుకోవాలి.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (04-02-2023)

మిశ్రమ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఇష్టమైనవారితో కాలాన్ని గడుపుతారు. శివారాధన శుభప్రదం.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (04-02-2023)

తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రారంభించిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా
వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అవసరానికి మించిన ఖర్చులు ఉంటాయి. అనవసర విషయాలలో తలదూర్చకండి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (04-02-2023)

శుభకాలం. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా
ఉంటారు. ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
.ఈరోజు (04-02-2023)

ప్రారంభించిన కార్యక్రమాలు ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. గోసే చేస్తే బాగుంటుంది. నవగ్రహ ధ్యానశ్లోకం
చదువుకోవాలి.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (04-02-2023)

చక్కటి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. ధర్మసిద్ధి ఉంది. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. శ్రీలక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (04-02-2023)

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. హనుమాన్ చాలీసా చదవడం
వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (04-02-2023)

పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (04-02-2023)

ధర్మసిద్ధి ఉంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం
చదవాలి.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (04-02-2023)

దైవబలంతో పనులను పూర్తిచేస్తారు. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రులు
సహకారం ఉంటుంది. ఈశ్వర ధ్యానం శుభదాయకం.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (04-02-2023)

దైవబలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా
ముందుకు సాగితే అనుకున్నది త్వరగా సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. సాయిబాబ సందర్శనం శుభప్రదం.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (04-02-2023)

ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. కుటుంబ సహకారం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
🦈🦈🦈🦈🦈🦈🦈