Movies

విజయ వాహినీ స్టూడియోస్: ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో గొప్ప క్లాసిక్ చిత్రాలు నిర్మించిన ఈ స్టూడియో కథ ఏంటి?

విజయ వాహినీ స్టూడియోస్: ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో గొప్ప క్లాసిక్ చిత్రాలు నిర్మించిన ఈ స్టూడియో కథ ఏంటి?

మాయాబజార్, గుండమ్మ కథ సినిమాలను తెలుగులో క్లాసిక్స్‌గా భావిస్తుంటారు.

ఈ సినిమాలను నిర్మించిన సంస్థే విజయ వాహినీ స్టూడియోస్.

విజయా వారి సినిమాల ప్రారంభంలో ‘క్రియా సిద్ధి, సత్వే భవతి’ అని దేవనాగరి లిపిలోని అక్షరాలు… మధ్యలో గదతో ఆంజనేయుడు ఉన్న పతాకం రెపరెపలాడడం చాలామందికి గుర్తుండే ఉంటుంది.

‘మహాత్ముల కార్యసిద్ధి వారి స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది’ అని ఆ మాటకు అర్థం. అదే నినాదాన్నే నమ్ముకున్న విజయా ప్రొడక్షన్స్ నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి ఆ బ్యానర్‌పై అందమైన చందమామ కథల్లాంటి ఎన్నో సినిమాలను అందించారు.

ఇంట్లో అందరూ చూసేలా అచ్చమైన కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించారు.

విజయా ప్రొడక్షన్స్ తీసిన ఆనాటి క్లాసిక్స్ అన్నీ విజయ వాహినీ స్టూడియోస్‌లోనే తెరకెక్కాయి. నాగిరెడ్డి, చక్రపాణిల ద్వయం 1950లో షావుకారు సినిమాతో మొదలుపెట్టిన ఈ బ్యానర్… 1994లో సింగీతం శ్రీనివాసరావు, బాలకృష్ణల భైరవద్వీపం వరకూ ఎన్నో అద్భుతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.

తమిళంలోఈ బ్యానర్ మీద 2019 వరకూ కొత్త తరం కథనాయకులతో కూడా సినిమాలు తీశారు.

చార్లీ చాప్లిన్ శవపేటిక‌ను దొంగతనం చేసి, అతడి భార్యను బ్లాక్ మెయిల్ చేసిన దొంగల కథ మీకు తెలుసా..?
కైకాల సత్యనారాయణ: ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్ వంటి హీరోలతో పోరాడిన విలన్

విజయ, వాహిని కలయిక
తెలుగు నిర్మాత మూలా నారాయణ స్వామి ప్రారంభించినట్లుగా చెప్పే వాహినీ స్టూడియోను, విజయా ప్రొడక్షన్స్ అధినేతలు బి.నాగిరెడ్డి, చక్రపాణిలు 1948లో తీసుకున్నారు.

అలా విజయా ప్రొడక్షన్స్, వాహినీ స్టూడియోస్ రెండూ కలిసిపోయి నాడు దక్షిణాసియాలోనే అతిపెద్ద స్టూడియోగా చెప్పే విజయ వాహిని స్టూడియోస్‌గా మారింది.

విజయవాహినీ స్టూడియోస్ ఎలా మొదలయ్యిందో విజయా ప్రొడక్షన్స్‌ వ్యవస్థాపకుడు బొమ్మిరెడ్డి నాగిరెడ్డి కుమారుడు బొమ్మిరెడ్డి విశ్వనాథరెడ్డి బీబీసీకి చెప్పారు.

‘‘వాహిని స్టూడియోస్ ప్రారంభించినపుడు ఒక ఫ్లోర్ మాత్రమే ఉండేది. దానిపైన టెంపరరీ షెడ్‌లా ఉండేది. అక్కడ మ్యూజిక్ థియేటర్, బ్లాక్ అండ్ వైట్ ల్యాబ్ ఉండేది. అలా వాహిని స్టూడియోస్ ప్రారంభమైంది.

వాహిని స్టూడియోస్‌ను మా పెదనాన్న నరసింహా రెడ్డి తీసుకున్నారు. అది రన్నింగ్‌లోకి వచ్చేటప్పటికి కొన్ని సమస్యల వల్ల మా నాన్న చేతికి వచ్చింది.

ఆ తర్వాత దానిలో ఫ్లోర్లు పెంచారు. అందులో మొత్తం 14 ఫ్లోర్లు ఉండేవి. దాదాపు అది ఒక చిన్న గ్రామంలా ఉండేది. అప్పట్లో లార్జెస్ట్ స్టూడియో ఇన్ సౌత్ ఏసియాగా అది నిలిచింది’’ అని విశ్వనాథ రెడ్డి చెప్పారు.

విజయ వాహిని స్టూడియోలో ఒకేసారి 12 సినిమాల షూటింగ్ చేసుకోగలిగినంత ఎక్విప్‌మెంట్, కెమెరాలు, సౌండ్ సిస్టమ్స్ ఉండేవని ఆయన తెలిపారు.

ఆయన్ను చూశాకే కృష్ణ హీరో కావాలనుకున్నారు.. అనుకున్నట్లే అయ్యారు
కాంతారా సినిమాలోని ‘భూత కోల’ హిందూ సంస్కృతి కాదా? ఏమిటి ఈ వివాదం

సత్య హరిశ్చంద్ర సినిమాలో..

అప్పట్లో అన్ని సన్నివేశాలూ సెట్‌లోనే చిత్రీకరించేవారని, వాహిని స్టూడియోస్ పక్కనే ఉన్న రేవతి స్టూడియో అధినేతలు దానిని నిర్వహించలేక ఆ స్టూడియోను కూడా బీఎన్‌రెడ్డికి అప్పగించారని విశ్వనాథ రెడ్డి తెలిపారు.

అలా ఆ రెండూ కలిసి మొత్తం 14 ఫ్లోర్లతో విజయ వాహిని స్టూడియో మద్రాస్‌కు ల్యాండ్ మార్క్‌గా నిలిచిందని, అప్పట్లో మద్రాసుకు ప్రముఖులు ఎవరు వచ్చినా విజయ వాహిని స్టూడియోస్‌కు వచ్చి దానిని చూసి వెళ్లేవారని ఆయన చెప్పారు.

‘‘విజయ సంస్థ చేసిన అన్ని సినిమాలూ మంచి సినిమాలే. కుటుంబ సమేతంగా, వినోద ప్రధానంగా అందరూ చూడదగినట్టు అవి ఉండేవి.

నాగిరెడ్డి, చక్రపాణిలతోపాటూ కేవీ రెడ్డి, ఎల్‌వి ప్రసాద్ అందరూ ఒక జట్టుగా ఏర్పడి విజయ వాహినీ బ్యానర్ మీద సినిమాలు చేసేవారు.

విజయ ప్రొడక్షన్స్ తీసే సినిమాల్లో ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావు, సావిత్రి, పద్మనాభం లాంటి ఎంతోమంది నటులు నెలవారీ వేతనాలు తీసుకుంటూ ఒక టీం వర్క్‌లా సినిమాలకు పనిచేసేవారు.

వీళ్లంతా ఎప్పుడు ఫ్రీగా ఉన్నా విజయా స్టూడియోలోనే ఉండేవారు. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగిన చిత్రాలు చేశారు’’ అని విశ్వనాథ రెడ్డి వివరించారు.

అమితాబ్-రేఖ: వీరిది ‘అందమైన మలుపులున్న ముగింపు లేని ప్రేమ కథ’
PS-1: ఆదిత్య కరికాలన్‌ను హత్య చేసిందెవరు, చరిత్ర ఏం చెబుతోంది?

చందమామ కథలే ప్రేరణ
విజయావారి సినిమాలకు ప్రేరణ అప్పట్లో ప్రచురించిన చందమామ కథలే అంటారు విశ్వనాథరెడ్డి.

“విజయా సినిమాలకు ప్రేరణ ఏంటంటే చందమామ కథలు. చందమామ కథల్లాగే తమ సినిమాలను చక్కగా, చల్లగా వారు చూపించేవారు. పాతాళభైరవి బ్రహ్మాండంగా ఆడింది. మాయాబజార్, పెళ్లి చేసి చూడు ఇలా ఒక్కొక్కటిగా సినిమాలన్నీ బాగా ఆడడంతో దానికి తగ్గట్టు ప్రొడక్షన్ విలువలు కూడా పెరగాయి.

చంద్రహారానికి పెట్టినంత ఖర్చు వేరే ఏ సినిమాకు పెట్టలేదు. కానీ అది సరిగా ఆడలేదు. చాలా కష్టపడి రెండున్నర సంవత్సరాలు దాని కోసం పనిచేశారు. ఆ షూటింగ్ మధ్యలోనే పెళ్లి చేసి చూడు, మిస్సమ్మ వచ్చాయి” అని అన్నారాయన.

విజయ వాహిని స్టూడియోస్ తీసిన సినిమాల్లో మాయాబజార్, గుండమ్మకథ ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా మిగిలిపోయాయని ఆయన చెప్పారు.

‘‘విజయ స్టూడియోస్‌ పిక్చర్ అంటే మాయాబజార్, గుండమ్మ కథ సినిమాలే. ఇప్పటికీ 60 ఏళ్లయినా కూడా ఈ సినిమాలకు అంత ఆదరణ ఉంది.

నా వరకు నేను రేటింగ్ ఇవ్వాలంటే ఈ రెండు సినిమాలకే ఇస్తాను. ఈ రెండింటినీ చాలా పెద్దయెత్తున తీశారు. అలాగే అవి విజయవంతం కూడా అయ్యాయి. అప్పట్లో నేను చిన్నవాడిని. సినిమా షూటింగ్ జరుగుతుంటే వెళ్లి చూసేవాడిని. అంతా ఒక టీం వర్క్‌లా ఉండటం వల్ల అది సాఫీగా జరిగిపోయేది’’ అని ఆయన చెప్పారు.

అమితాబ్ బచ్చన్‌కు 80 ఏళ్లు: మీరు ఇంతకు ముందెన్నడూ చూడని సూపర్ స్టార్ అరుదైన ఫొటోలు
ఆదిపురుష్ రామాయణాన్ని వక్రీకరిస్తోందా? బాలీవుడ్ ‘రావణ బ్రహ్మను రావణ్ ఖిల్జీ’గా మార్చేసిందా? – సోషల్ మీడియాలో ట్రోలింగ్

ఎంజీఆర్‌ రాజకీయ ప్రవేశం
అసలు ఎంజీఆర్ అన్నాడీఎంకే పార్టీ పెట్టే ముందు ఆయనకు పాపులారిటీ తీసుకొచ్చింది కూడా విజయా వారి సినిమానే అని చెప్పారు విశ్వనాథరెడ్డి.

“నాన్న తీసిన సినిమాల్లో నమ్మనాడు అని ఎంజీఆర్ హీరోగా తీసిన తమిళ సినిమా ఉంది. అది తమిళ్లో పెద్ద హిట్. ఆ తర్వాతే ఆయన ఏడిఎంకే పార్టీని ప్రారంభించారు. దానికి ఆ సినిమా చాలా ఉపయోగపడింది.

ఆ సినిమా తర్వాతే ఆయన రాజకీయ జీవితం మొదలైంది. దానిని కథానాయకుడు బేస్‌గా తమిళ్లో తీశారు’’ అని ఆయన చెప్పారు.

సినిమాను ఎన్ని రోజులు తీశారు అనేది కాదు, ఎంత క్వాలిటీగా తీశారు అనేది ముఖ్యం అంటారు విశ్వనాథరెడ్డి.

“ఈ రోజుల్లో సినిమాలకు రెండేళ్లు కూడా పడుతోంది. స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నీ పెడుతున్నారు. ఆ రోజుల్లో స్పెషల్ ఎఫెక్ట్స్ ఏవీ లేకుండానే కేవలం కెమెరా పనితనంతోనే తెరపై అద్భుతం చేసేవారు.

మాయాబజార్‌లో స్పెషల్ ఎఫెక్ట్స్ మొత్తం కెమెరా వర్క్‌తో మార్కస్ బాట్లే వాళ్లే చేసారు. ఆ రోజుల్లో అది లేటేస్ట్. అప్పట్లోనే టీం వర్క్‌తో అదంతా చేశారు. ఆ రోజుల్లో ఆరోగ్యకర పోటీతో తమ టాలెంట్ నిరూపించుకునేవారు” అని ఆయన చెప్పారు.

టైటానిక్: నాజీలు 80 ఏళ్ల కింద తీసిన సినిమా అంతా కట్టుకథలు, కుట్ర సిద్ధాంతాలేనా?
దేవికా రాణి: బాలీవుడ్‌లో చరిత్ర సృష్టించిన ఈ ‘ముద్దు సీన్’ చుట్టూ అల్లుకున్న కథలేంటి?

చెన్నైకే ఎందుకు పరిమితం అయ్యారు?
హైదరాబాద్‌కు వచ్చి స్టూడియో నిర్మించాలని నాగిరెడ్డిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానించిందని, కానీ ఆయనకు అది ఇష్టం లేకపోయినా మిగతా వారిని ప్రోత్సహించారని నాగిరెడ్డి తనయుడు చెప్పారు.

“ఆ రోజుల్లో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి హైదరాబాద్‌లో స్టూడియో ప్రారంభించమని నాన్నను కోరారు.

కానీ ఆయన ఇక్కడి నుంచి వెళ్లడానికి ఇష్టపడలేదు. పేరు ప్రతిష్టలు, అన్నీ ఇచ్చింది వడపళని చెన్నై కాబట్టి, దీన్ని వదిలి ఎక్కడికి పోకూడదని నాన్న ఒప్పుకోలేదు.

కానీ అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభించినపుడు, అక్కడకు వెళ్లి అక్కినేని నాగేశ్వరావుకు సలహాలు ఇచ్చారు. కాస్ట్యూమ్స్ అన్నీ ఎన్టీఆర్ అక్కడకు తీసుకెళ్లారు. నాన్న అందర్నీ ప్రోత్సహించారు. కానీ తను మాత్రం ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు” అని ఆయన వివరించారు.

టెక్నాలజీ లాంటివి ఏవీ లేని రోజుల్లోనే తెరపై అద్భుతమైన నాణ్యతతో సినిమాలు తీసేవారని, ఇప్పుడు అది అభివృద్ధి కావడం సినీ రంగానికి కలిసొచ్చిందని విశ్వనాథరెడ్డి అన్నారు.

“సాంకేతికంగా ఎంతో అభివృద్ధి వచ్చింది. ఆ రోజుల్లో టెలిఫోన్లు ఉంటే, ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి. తర్వాత ఏం వస్తాయో తెలీదు.

బేసిక్ ఎక్విప్‌మెంట్స్ నుంచి ఇప్పుడు బెస్ట్ ఎక్విప్‌మెంట్స్ వరకూ వచ్చాయి. కెమెరాలు లాంటివన్నీ మారిపోయాయి. ఆ రోజుల్లో లాగా సెట్లో పెద్ద పెద్ద లైట్లు ఉండాల్సిన అవసరం లేకుండాపోయింది.

ఇప్పుడు నేరుగా లొకేషన్స్‌కే వెళ్తున్నారు. ఆ రోజుల్లా ఉన్నట్లు ఎలాంటి ఇబ్బందులూ లేవు. ప్రభుత్వం బాగా ప్రోత్సహిస్తోంది.

బాహుబలి లాంటి సినిమాలకు పెద్ద పెద్ద సెట్స్ వేశారు. కానీ ఇక్కడ విజయా గార్డెన్స్‌లో ప్రతి ఆరు నెలలకూ లొకేషన్ మార్చేవారు. సరస్సులు, పడవలు లాంటివన్నీ ఉండడంతో అన్నీ ఇక్కడే తీసుకునేవిధంగా షూటింగ్ కోసం విజయా గార్డెన్స్‌కు వచ్చేవారు” అని ఆయన వివరించారు.

Naatu Naatu Song: తెలుగు సినీ సంగీత ప్రపంచానికి ‘పెద్దన్న’ ఎంఎం కీరవాణి
ఆర్‌ఆర్‌ఆర్: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కించుకున్న ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల ‘నాటు నాటు’ పాట ఎలా పుట్టింది?

విజయా హాస్పిటల్‌ ఆలోచనఎలా వచ్చింది?

వాహినీ స్టూడియోస్‌ ప్రారంభానికి ముందే నాగిరెడ్డికి ఒక మంచి హాస్పిటల్ నిర్మించాలనే ఆలోచన ఉండేదని ఆయన కొడుకు విశ్వనాథరెడ్డి చెప్పారు.

పరిశ్రమ మొత్తం హైదరాబాద్‌కు తరలివెళ్లడం, షూటింగ్స్ అన్నీ నేరుగా లొకేషన్లకు వెళ్లి చేస్తుండడంతో స్టూడియోలోనే ముందున్న ఐదు ఎకరాలలో ఒక ఆస్పత్రి పెట్టాలనుకున్నారని తెలిపారు.

“నాన్న స్టూడియో ముందున్న 5 ఎకరాలు తీసుకొని అందులో హాస్పిటల్ పెట్టారు. ఇక్కడ 40పడకలతో ఒక ఆస్పత్రి ప్రారంభించారు. ఇప్పుడు అది 700పడకల ఆస్పత్రిగా ఉంది. దేశంలో ఈ ప్రాంతంలో ఉన్న మొట్టమొదటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే అది విజయ హాస్పిటలే.

నాన్న ఏది ప్రారంభించినా అందులో నంబర్ వన్‌గానే ఉండేవారు. సినిమాలన్నీ హిట్ కావడంతో, ఆ డబ్బు మొత్తం ఆస్పత్రి మీద పెట్టి దీన్ని అభివృద్ధి చేశారు. 1972లో ఆస్పత్రి ప్రారంభమయ్యింది. 1974లో దానిని చారిటబుల్ ట్రస్ట్ కింద మార్చి, నో ప్రాఫిట్ కింద డెవలప్ చేశారు.

అక్కడ వచ్చే ఆదాయం మొత్తాన్నీ మళ్లీ ఆస్పత్రి అభివృద్ధికే ఖర్చు చేశారు. చెన్నైలో విజయా హాస్పిటల్ అత్యుత్తమ ఆస్పత్రిల్లో ఒకటి కావడంతోపాటూ, కార్పొరేట్ ఆస్పత్రుల కంటే చాలా తక్కువకే వైద్య సేవలు అందిస్తోంది” అని ఆయన చెప్పారు.

‘అక్కినేని, తొక్కినేని’ అన్న నందమూరి బాలకృష్ణ… రగులుతోన్న వివాదం
నాటు నాటు సాంగ్‌కు దక్కిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ప్రత్యేకలేంటి ?

విజయ బ్యానర్‌పై మళ్లీ సినిమాలు వస్తాయా?

ఎంతో చరిత్రతో పాటూ, సినీ రంగంలో ఎంతోమంది అడుగుజాడలకు గుర్తుగా మిగిలిన విజయా సంస్థపై మళ్లీ సినిమాలు చేయాలనే కోరిక ఉందన్నారు విశ్వనాథరెడ్డి. కానీ తనకు కుదరలేదని, తర్వాత తరం అయినా ఆ పని చేయగలరేమో తనకు తెలీదని చెప్పారు.

“మా గ్రాండ్ డాటర్ (మనవరాలు), వాళ్ల ఫ్రెండ్స్‌తో కలిసి ఒక షార్ట్ మూవీ తీసింది. తనకు అవార్డు కూడా వచ్చింది.

ఆ అమ్మాయి పూర్తి స్థాయి తమిళ సినిమా తీయాలనుకుంటోంది. మా చిన్నాన్న కొడుకు అప్పట్లో కెమెరామెన్. కెమెరామెన్ అవార్డు కూడా అందుకున్నాడు.

రెండో తరంలో వీళ్లిద్దరే ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరూ సినిమా పరిశ్రమలో కొనసాగలేదు. మా కుటుంబంలో ఎవరు విజయ వాహినీ బ్యానర్ స్టార్ట్ చేస్తారా అనే ఆశ ఉంది. విజయ వాళ్ళు మంచి సినిమాలు తీశారు. ఆ స్ఫూర్తితో ఎవరు అడుగు ముందుకు వేస్తారో నాకు తెలీదు.

మా తమ్ముడు విజయా బ్యానర్ మీద తమిళంలో కొన్ని సినిమాలు తీశాడు. ఇప్పుడు అవి కూడా ఆగిపోయాయి” అని ఆయన తెలిపారు.