Devotional

నేటి మీ రాశి ఫలితాలు

నేటి మీ రాశి ఫలితాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
*✍🏻 *06.02.2023 ✍🏻**
*🗓 *నేటి రాశి ఫలాలు 🗓**

🐐 మేషం
ఈరోజు (06-02-2023)

చేపట్టిన పనుల్లో చిన్నపాటి సమస్యలు ఎదురైనా అనుకున్నది పూర్తిచేయగలుగుతున్నారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని విషయాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తున్నారు. విష్ణు నామస్మరణ ఉత్తమం
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (06-02-2023)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (06-02-2023)

చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఆపదలు తొలగడానికై వేంకటేశ్వరుణ్ణి పూజించాలి.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (06-02-2023)

ఎక్కువ సమయాన్ని అభివృద్ధికై కేటాయించి. మరుపురాని విజయాలు సొంతమవుతాయి. మీ పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. శుభవార్త ఆనందాన్నిస్తుంది. దుర్గ ధ్యాన శ్లోకం చదవండి
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (06-02-2023)

చేపట్టే పనుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేస్తారు. వాటిని ప్రారంభించడంలో చిన్నచిన్న ఆటంకాలను ఎదుర్కొంటారు. కీలక వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (06-02-2023)

మీ ప్రతిభకు, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదైవారాధన మంచిది.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (06-02-2023)

గొప్పకార్యాలు శుభఫలితాలున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే బాగుంటుంది.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (06-02-2023)

కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఓ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆత్మీయుల సలహాలు మేలు
చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. విష్ణుసహస్రనామం చదవడం లేదా వినడం చేస్తే
మంచిది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (06-02-2023)

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. శత్రువుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. సౌమ్యంగా ముందుకుసాగాలి. చేయని పొరపాటుకు నింద పడాల్సి రావచ్చు. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. ఇష్టదేవత స్తోత్రం పఠించడం మంచిది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (06-02-2023)

కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. పెద్దలతో కాస్త సంయమనంతో ఆచితూచి వ్యవహరించాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం మంచిది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (06-02-2023)

ధర్మసిద్ధి ఉంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను
కలుస్తారు. గతంలో ఆగిన పనులు పూర్తవుతాయి. మహాలక్ష్మీ అష్టోత్తరం చదివితే మంచిది.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (06-02-2023)

మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో
సత్పాంగతం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది.
ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
🦈🦈🦈🦈🦈🦈🦈