Politics

TNI నేటి తాజా వార్తలు. పార్టీ మారను. ఎంపీ. లావు

TNI నేటి తాజా వార్తలు. పార్టీ మారను. ఎంపీ. లావు

– చంద్రబాబును కలిసానని.. పార్టీ మారుతారని చెప్పటం అనేవి పూర్తిగా అవాస్తవాలు..

– నేను వైస్సార్సీపీ, జగనన్న తోనే ఉన్నాను..

– మీడియా వాళ్ళు అసత్య ప్రచారాలు చేయటం వల్ల.. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, మీడియా వాళ్ళకి అందరికీ కూడా టైమ్ వేస్ట్..

– మీడియా వాళ్లు ప్రశ్నించాలి…. రాష్ట్రానికి రావాల్సిన అంశాలపైనో, అభివృద్ధి విషయాలపైన మమ్మల్ని ప్రశ్నించాలి..అంతేగానీ అసత్య ప్రచారాలతో సమయం వృధా..

– ఆ ఫోటోల్లో లేరు.. వీడియోల్లో లేరు అంటూ హడావుడి చేస్తే ఎం వస్తుంది..

– ఫోటోలతోనో, వీడియోలతోనో సోషల్ మీడియాల్లో ప్రచారం చేసుకుంటే ఎం వస్తుంది..

– ప్రచారం కోసం నేను.. ఎంపీ కాలేదు.. ప్రజలకు మేలు చేయటానికి ఎంపీ అయ్యాను.

– మీడియా ప్రచారాలు ప్రజలు నమ్మొద్దు..

– నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు

*కందుకూరు తొక్కిసలాట ఘటనపై విచారణ

జస్టిస్ శేషసాయనా రెడ్డి కమిషన్ ఎదుట హాజరైన టీడీపీ నేతలు.

* శ్రీశైలం వెళ్ళే భక్తుల కోసం APSRTC ప్రత్యేకమైన ప్యాకేజి
•ప్రతి రోజూ 1075 దర్శనం టిక్కెట్లు
•స్పర్శ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనాలు
•ఫిబ్రవరి 9 నుండి అమలులోకి రానున్న విధానం
•ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించిన APSRTC
•పుణ్యక్షేత్రాలకు అవాంతరం లేని దర్శనానికి శ్రీకారం చుట్టిన ఆర్టీసీ
•దేవాదాయశాఖ సమన్వయంతో ఆర్టీసీ ప్రయాణికులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపిన ఎం.డి. శ్రీ ద్వారకా తిరుమల రావు,
ఐ.పి.ఎస్

*టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య – చంద్రబాబు సమక్షంలో చేరిన మునిరామయ్య, ఆయన కుమారుడు ప్రవీణ్ – టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ అధినేత చంద్రబాబు

*ప్రభత్వం పరిపాలనను అమరావతి నుంచే కొనసాగించాలి

విశాఖ నుంచి పాలిస్తానంటే… తింగరి చేష్ట గా ప్రజలు భావించే ప్రమాదం

గత ప్రభుత్వ హయాంలో 77% పోలవరం పనులు పూర్తి

ఈ ప్రభుత్వ నాలుగేళ్లలో పూర్తికాని ఒకటిన్నర శాతం పనులు

పోలవరం ద్వారా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు మేలు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

ఆంధ్ర ప్రదేశ్ ( ఏ పీ )ని అమరావతి, పోలవరంగానే కొనసాగించాలని, విశాఖపట్నం (వీ పీ ) గా మార్చవద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు హితవు పలికారు. రాష్ట్రానికి వరంగా మారాల్సిన పోలవరం , ఈ ప్రభుత్వానికి, తమ పార్టీకి శాపంగా పరిణమించేలా ఉంది. 2024 ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ, 2025 వరకు కూడా పోలవరం పూర్తయ్యేలా కనిపించడం లేదు. అలాగే పోలవరం కోసం చేసిన పనులకు సంబంధించిన రెండు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చినట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు.
అమరావతిని జగన్ ప్రభుత్వం సర్వనాశనం చేసింది . పోలవరం పనులను నత్త నడక నడుస్తున్నాయి . అమరావతి, పోలవరం ను బ్రష్టు పట్టించిన ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని రఘురామకృష్ణం రాజు కోరారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 77% పూర్తి కాగా, గత నాలుగేళ్లలో ఈ ప్రభుత్వ హయాంలో ఒకటి, ఒకటిన్నర శాతం పనులు కూడా పూర్తి కాలేదు. కాంట్రాక్టర్లను మార్చి ప్రాజెక్టు పురోగతిని దెబ్బతీశారు . పోలవరం ప్రాజెక్టును బ్యారేజ్ లాగా మార్చే ప్రయత్నం చేశారు . గతంలో స్వార్థ బుద్ధితో తమ పార్టీ నేతలు రాసిన లేఖలు, ఇప్పుడు శాపంగా పరిణమించాయి. పోలవరం నీటిని కృష్ణా డెల్టాకు మళ్ళించి, పైనుంచి వచ్చే నీటిని శ్రీశైలం వద్ద నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు తీసుకువెళ్లి, రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయవచ్చు. గోదావరి ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు, ఏలేరు వద్ద పంపింగ్ స్కీంను ఏర్పాటు చేసి విశాఖపట్టణానికి నీటిని తరలించే అవకాశం ఉన్నదని రఘురామకృష్ణంరాజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చిల్లి గవ్వ సహాయం చేయకపోయినా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
1.20 లక్షల కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టగా, కేవలం 55 వేల కోట్లతో పోలవరం ప్రాజెక్టు ను పూర్తి చేయడానికి జగన్ సర్కార్ ప్రతిరోజు ఏడుపులు, పెడబొబ్బలను పెట్టిందని విమర్శించారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి వరంగా మారాల్సిన పోలవరం ప్రాజెక్టును అంగుళం కూడా ముందుకు కదల్చలేకపోయినా, ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారని సంబంధిత శాఖ మంత్రిని ప్రశ్నిస్తే, జాతకాలు చెప్పలేమని… అవ్వాల్సిన సమయంలోనే పూర్తవుతుందంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక ముఖ్యమంత్రి కి ఈ ప్రాజెక్టు గురించి అసలు తెలుసో, లేదో కూడా అనుమానమేనని ఎద్దేవా చేశారు .

వివేక హత్య కేసు విచారణ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే తెర పైకి విశాఖ రాజధాని అంశం

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అధికారులు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారించిన అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను విశాఖకు తరలి వెళ్లనున్నట్టు పేర్కొన్నారని ప్రజలు భావిస్తున్నట్లుగా రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో అన్యమనస్కంగా కనిపించిన జగన్ , తాను అపాయింట్మెంట్లు అడిగితే కేంద్ర ప్రభుత్వ పెద్దలు తిరస్కరించడం తో, చేసేది లేక తాను త్వరలోనే విశాఖకు మకాం మార్చనున్నట్లుగా పేర్కొని, వివేక హత్య కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేసినట్లుగా స్పష్టమవుతుందన్నారు. గత మూడేళ్లుగా మంత్రులు, తమ పార్టీ నాయకులు మాత్రమే ముఖ్యమంత్రి విశాఖపట్నం కి తరలి వెళ్లనున్నారని పేర్కొనేవారని గుర్తు చేశారు. ప్రజా పరిపాలన చేసే ఏ పరిపాలకుడైన కూడా ఆ ప్రాంత రాజధాని లోనే నివసిస్తూ, తమ కార్యకలాపాలను కొనసాగిస్తారన్నారు. రాజధాని ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాలలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న దాఖలాలు లేవు. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మాత్రం వేసవి విడిది కోసం ఊటీలో కేవలం రెండు మాసాలు మాత్రమే ఉండేవారు. రాజు ఎక్కడ ఉంటే అదే రాజధాని అని తమ పార్టీకి చెందిన కొంతమంది జగన్ వంది మాగాదులు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. రాజు ఎక్కడ ఉంటే అదే రాజధాని కాదు. మానసిక రుగ్మతతో బాధపడే కొంతమంది నాయకులు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణమేనని అనిపించినప్పటికీ, ముఖ్యమంత్రి కూడా తాను విశాఖకు తరలి వెళ్తానని పేర్కొనడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈనెల 23వ తేదీన రాజధాని వ్యవహారం పై సుప్రీంకోర్టులో కేసు విచారణకు రానున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి విశాఖకు తరలి వెళ్తానని చెప్పడం దేనికి సంకేతమని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

వివేక హత్య కేసులో త్వరలో మరికొంతమందికి నోటీసులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే సిబిఐ పోలీసుల కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసి విచారించగా, ఆయన ఇచ్చిన సమాచారంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సతీమణి వైయస్ భారతి రెడ్డి అటెండర్ నవీన్ లను విచారించిన విషయం తెలిసిందేనని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. ఈ కేసులో త్వరలోనే మరి కొంత మందికి సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిచే అవకాశం ఉందన్నారు. అరెస్టులు కూడా జరగవచ్చునని వెల్లడించారు.

ధర్మాన వ్యాఖ్యల వెనుక సీఎం జగన్ హస్తం?

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నం ను ప్రకటించాలని, లేనిపక్షంలో విశాఖ రాజధానిగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నా మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందేమోనన్న అనుమానాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు. ధర్మాన వ్యాఖ్యలపై, ముఖ్యమంత్రి స్పందించకపోవడం పరిశీలిస్తే, ఆయనే మంత్రి ధర్మాన చేత ఈ తరహా వ్యాఖ్యలు చేయించి ఉంటారన్న అనుమానం కలుగుతుంది. ప్రాంతీయవాదం మళ్లీ తెరపైకి వస్తోందని చెప్పి ప్రాంతీయవాదాన్ని రూపుమాపడానికి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం తరలి వెళ్తున్నారని చెప్పుకోవడానికి ఈ తరహా వ్యాఖ్యలు చేయించి ఉంటారన్న అనుమానాలు ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి. నేర విచారణ కల్పించిన విస్పోటనాన్ని కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రయత్నం ద్వారా, మరో విస్పోటనం తలెత్తే ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. విశాఖ రాజధానిగా పేర్కొంటే రాయలసీమ ప్రాంత ప్రజల్లో అలజడి మొదలు కానుంది . అమరావతి రైతులు, విశాఖవాసులు సైతం భయాందోళనలకు గురవుతారు. వైఎస్ వివేక హత్య కేసును కప్పిపుచ్చడానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఈ తరహా వాతావరణాన్ని సృష్టిస్తున్నారని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని రఘు రామకృష్ణంరాజు అన్నారు.

రైతులతో ఒప్పందం కుదుర్చుకొని పారిపోతానంటే కుదరదు

రాజధాని ప్రాంత రైతులతో ఒప్పందాన్ని కుదుర్చుకొని ఇప్పుడు పారిపోతానంటే కుదరదని, ఇది పెద్ద నేరమే అవుతుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. జగన్మోహన్ రెడ్డి తగుదునమ్మా అని విశాఖపట్నం వెళితే… రాజధాని నుంచి అధికారులు అక్కడికి వెళ్లాలన్న, ఆయన రాజధాని కి రావాలన్నా కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ముఖ్యమంత్రి రాజధాని లో ఉంటూ పరిపాలన సాగించాలి. అంతేకానీ తన ఇష్టానికి నడుచుకుంటానంటే కుదరదు. రాజధాని వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఊహిస్తున్నట్లుగా కోర్టు తీర్పు వచ్చే అవకాశం లేదు. అమరావతి లోని ఇల్లే జగన్మోహన్ రెడ్డి కి బాగా కలిసి వచ్చింది. ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు విశ్వసించారు. తాడేపల్లిలోని ప్యాలెస్ ను వదులుకొని, విశాఖపట్నంలో అద్దె ఇంటికి జగన్ మారుతానని చెబుతుంటే ఆశ్చర్యం కలిగిస్తోంది. దుర్గమ్మ సన్నిధిలో, కృష్ణానది ఒడ్డున ఉన్న తాడేపల్లి ఇంటిలో ఉంటేనే జగన్మోహన్ రెడ్డికి అన్ని విధాలుగా మంచిదని క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా సూచిస్తున్నట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కేదారినాథ్, వారణాసి అంటే ఇష్టమని, అలాగని ఆయన వారణాసి నుంచి పరిపాలన సాగిస్తానంటే కుదురుతుందా?. మన ముఖ్యమంత్రి తరహాలోనే ఇంకొకరు తనకి ఇష్టం ఉన్నచోట ఉంటూ పరిపాలన సాగిస్తానంటే ప్రజలు హర్షిస్తారా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

అర్థం కాని ధర్మాన లాజికులు

వాలంటీర్లు, పౌరులుగా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన సూచన విస్మయాన్ని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఇతర పార్టీల తరఫున పౌరులుగా ఓట్లు అడిగితే, వాలంటీర్లు ఉద్యోగాలను కోల్పోతారని హెచ్చరించడం హాస్యాస్పదంగా ఉంది. ఇక చంద్రబాబు అధికారంలోకి వస్తే, వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తారంటూ చెప్పడం విడ్డూరం. ధర్మాన ప్రసాదరావు తమ పార్టీలో శకుని, శల్యుడు పాత్రను పోషిస్తున్నట్లుగా రఘురామ కృష్ణంరాజు అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడు లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని, రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి అభ్యర్థుల కొదవేమీ ఉండదన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు కి చెందిన ఒక వాలంటీర్ తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని పేర్కొంటూ విడుదల చేసిన వీడియో పై స్పందిస్తూ రఘురామకృష్ణం రాజు ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఇక రాజ్యసభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్న పై సెటైర్లు వేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద ఏపీ జెన్కో నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందని కేంద్రాన్ని అడగడం ఏమిటంటూ అపహాస్యం చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విశాఖ నే రాజధాని అని చెప్పి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. అమరావతి రాజధాని అని చెప్పి ఓట్లు అడిగి, ఇప్పుడు విశాఖపట్నం రాజధాని అంటే ప్రజలను తడిగుడ్డతో గొంతు కోసినట్లు అవుతుందన్నారు. గతంలో తన టెలిఫోన్ ట్యాప్ చేశారని తాను ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, పీవీ సునీల్ కుమార్ లపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసినట్లుగా గుర్తు చేశారు. ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే
నాలుగు లేఖలు రాసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కనిపించడం లేదు. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనుమతితోనే తన ఫోన్ ను ట్యాప్ చేసి ఉంటారు. తాను
జగన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఉత్తర దక్షిణ ధ్రువాలైన అమెరికా అధ్యక్షుడు జో బై డన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ లతో చర్చలు జరిపినట్లుగా చెప్పండి అంటూ రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

*తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది.

మే 7 నుంచి 14 వరకు ఎంసెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు.

7 నుంచి 11 వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, 12 నుంచి 14 వరకు ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్ష జరగనుంది.

మే 18న ఎడ్‌సెట్‌, మే 20న ఈసెట్‌, మే 25న లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌, మే 26న ఐసెట్‌, మే 29 నుంచి జూన్‌1 వరకు పీజీఈసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది.

*దిల్లీ: అదానీ గ్రూప్‌ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తున్న వేళ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రధాని మోదీతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే గౌతమ్‌అదానీ అనతికాలంలో ప్రపంచ అవతరించారంటూ విమర్శించారు.

2014లో బిజెపి అధికారంలోకి వచ్చాక అదానీ 600వ స్థానం నుండి రెండో ర్యాంక్‌కు చేరుకున్నారని అన్నారు.
అదానీ కోసం ఏకంగా నిబంధనలనే మార్చేశారని దుయ్యబట్టారు.

బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్‌ గాంధీ మంగళవారం మాట్లాడారు.

ఈ సందర్భంగా గౌతమ్‌ అదానీ వ్యవహారంపై సుదీర్ఘంగా మాట్లాడారు.

‘‘ఎయిర్‌పోర్టుల నిర్వహణలో పూర్వ అనుభవం లేనివారికి వాటి నిర్వహణ బాధ్యతలను అప్పగించకూడదని నిబంధనలు ఉన్నాయి. కానీ, ఆ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మార్చివేసింది.

ఏకంగా దేశంలోని ఆరు ఎయిర్‌పోర్టులను అదానీకి కట్టబెట్టింది.

అత్యంత లాభదాయకమైన విమానాశ్రయాల్లో ఒకటైన ముంబయి ఎయిర్‌పోర్టును అదానీకి అప్పగించింది. ఇందుకోసం జీవీకే గ్రూప్‌పై సీబీఐ, ఈడీలను ప్రయోగించింది’’ అంటూ ప్రభుత్వంపై రాహుల్‌ గాంధీ ఆరోపణలు చేశారు.

‘‘2014లో 8 బిలియన్‌ డాలర్లుగా ఉన్న అదానీ సంపద 2022 నాటికి 140 బిలియన్‌ డాలర్లకు ఎలా పెరిగిందని యువత అడుగుతున్నారు.

భారత్‌ జోడో యాత్రలో భాగంగా తమిళనాడు, కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌.. ఇలా పాదయాత్ర చేపట్టిన ప్రతి చోటా అదానీ పేరు వినిపించింది. ఆయన అడుగు పెట్టిన ప్రతి వ్యాపారంలోనూ ఎలా సక్సెస్‌ అవుతున్నారంటూ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు’’ అని రాహుల్‌ ఎద్దేవాచేశారు.

‘‘ప్రధాని మోదీ ఆస్ట్రేలియాకు వెళితే అదానీ గ్రూప్‌నకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 1 బిలియన్‌ డాలర్లు రుణం ఇచ్చింది.

ప్రధాని బంగ్లాదేశ్‌ వెళితే అక్కడి పవర్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు అదానీకి 25 ఏళ్ల కాంట్రాక్టు అప్పగించింది. ఇదేం మ్యాజిక్‌’’ అని రాహుల్‌ ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

ఇప్పటి వరకు అదానీతో కలిసి ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారు? విదేశాల్ల్లో ఎన్నిసార్లు అదానీని కలిశారు? భాజపాకు గడిచిన 20 ఏళ్లలో అదానీ ఎంతిచ్చారు? అంటూ రాహుల్‌ ప్రశ్నల వర్షం కురిపించారు.

అగ్నిపథ్‌ స్కీమ్‌నూ ఈ సందర్భంగా తప్పుబట్టారు. ఆర్మీని ఈ పథకం బలహీన పరుస్తుందని సీనియర్‌ అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారని రాహుల్‌ గాంధీ అన్నారు.

అధికార పక్షం అభ్యంతరం
లోక్‌సభలో రాహుల్‌ ప్రసంగం సమయంలో అధికార పక్షం నుంచి పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నిరాధారమైన ఆరోపణలు చేయొద్దంటూ కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు రాహుల్‌కు సూచించారు. ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. తన ప్రసంగం మధ్యలో అదానీతో మోదీ సంబంధాలకు సంబంధించి వారు ఇద్దరూ కలిసి ఉన్న చిత్రాలను లోక్‌సభలో రాహుల్‌ గాంధీ ప్రదర్శించారు.

దీనిపై స్పీకర్‌ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తంచేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై మాత్రమే మాట్లాడాలన్నారు.

*💥నెల్లూరు లోని ఆదాల ప్రభాకర్ రెడ్డి కార్యాలయం లో నెల్లూరు రూరల్ నియోజక వర్గ ఇంఛార్జి,నెల్లూరుMP ఆదాల ప్రభాకర్ రెడ్డి,నెల్లూరు నగరానికి చెందిన 18 మంది కార్పోరేటర్లు, ఆనం విజయ్ కుమార్ రెడ్డి, తనకు మద్దత్తు తెలిపే వైకాపా పార్టీ నేతలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు 💥

ఈ సందర్బంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ …

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో మాట్లాడి రూరల్ నియోజక వర్గం అభివృద్ధికి ఫండ్స్ కూడా తీసుకు వస్తాము ..

మేము మా వద్దకు రమ్మని ఎవరితోనూ మంతనాలు చేయము వస్తె స్వాగతిస్తాము,

నెల్లూరు ప్రజల ప్రధాన కోరిక ల్లో ఒకటైన రింగ్ రోడ్ ను కూడా తొందర్లో పని మొదలయ్యే లా చూస్తాను

ఇంకో వారం లో ముఖ్య మంత్రి ని కలిసి నెల్లూరు రూరల్ నియోజక వర్గం సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా…

కార్పొరేటర్ లు అందరూ ఎలాంటి విభేదాలు లెంకుండా కలిసి పనిచేస్తాము…

నాకు మద్దత్తు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు ..

తొందర్లో కార్పొరేషన్ కార్యాలయం లో నే మీటింగ్ పెట్టుకుని మీ సమస్యలు అన్నీ పరిష్కరిస్తాము..

ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…

జగన్మోహన్ రెడ్డి ఎంతో నమ్మకం తో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తే నమ్మక ద్రోహనికి పాల్పడిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఆరాచకాలు కు అంతే లేకుండా పోయిందని…

స్మగ్లర్లు,తీవ్రవాదులు లాంటి వారే ఎక్కువ సిమ్ కార్డులు వాడతారని,

పెద్ద పెద్ద కోటీశ్వరులు వ్యాపారస్తులే ఒకటి రెండు సిమ్ కార్డులు వాడుతారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాను 12 సిమ్ కార్డు వాడుతానని చెప్పడం వెనక ఉద్దేశ్యం ఏమిటని…

రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుపు కోసం ఎంతో కష్టపడి పనిచేసిన వారిని పక్కనపెట్టారని….

రూరల్ నియోజకవర్గం ఆదాల ప్రభాకర్ రెడ్డికి పూర్తి సహకారం అందిస్తామని , ప్రజలంతా కూడా ఆధార వైపే ఉన్నారని ఆనం విజయ్ కుమార్ రెడ్డి తెలియచేశారు…

ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు కూడా మాట్లాడి తమ పూర్తి మద్దతు ఆదాల ప్రభాకర్ రెడ్డి కి అందిస్తామని తమ డివిజన్ ల పరిధిలో అభివృద్ధికి ఆదాల సహకరిస్తారని అలాగే తాము అందరం త్వరలోనే ముఖ్యమంత్రితో కూడా కలిసే ఏర్పాట్లు చేయాలని ఆదాల ప్రభాకర్ రెడ్డిని కోరగా ఆయన దానికి సమ్మత్నించారు…

*సీఎం జగన్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన పవన్..

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేక శుభాకాంక్షలు (Special Greetings) చెప్పారు..

ఈ మేరకు సెటైరికల్‌గా ట్వీట్ (Tweet) చేశారు. అప్పులతో ‘ఆంధ్ర (Andhra)’ పేరు మారుమోగిస్తున్నందుకు… సీఎం జగన్‌కు ‘నా ప్రత్యేక శుభకాంక్షలు .. keep it up’ అంటూ వ్యంగంగా అభినందనలు తెలిపారు. ”మీ వ్యక్తిగత సంపదను పెంచుకోవడం మర్చిపోవద్దు.. రాష్ట్ర సంపద, ప్రగతి ‘కుక్కల’కి వెళ్లనివ్వండి.. కానీ మీ వ్యక్తిగత సంపద, ఆస్తులు.. ఎప్పటికీ అవే స్పూర్తి.. సీఎం అప్పు రత్నా” అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై కొంత కాలంగా విమర్శల వేడి పెంచారు. సోషల్ మీడియా (Social Media), ట్వీట్ల (Tweets) ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం గత తొమ్మిది నెలల కాలంలో చేసిన అప్పు అంటూ పవన్ తన ట్వీట్‌లో జగన్ ప్రభుత్వంపైన కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా సీఎం జగన్ ఎక్కడా ఏ సభలోనైనా ప్రసంగించినప్పుడు పవన్‌ పేరును ప్రస్తావించకుండా చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ విమర్ళలు చేస్తారు. అలాగే పవన్ సోషల మీడియా వేదికగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తారు. అందులో భాగంగానే ఇవాళ పై విధంగా ట్వీట్ చేశారు. అయితే పవన్ ట్వీట్‌పై వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

* ఆంధ్రప్రదేశ్ అప్పులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైర్

పెరిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ అప్పులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు.
మంగళవారం మధ్యాహ్నం ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందించారు. ఒక కార్టూన్‌తో కూడిన ట్వీట్ చేశారు.

”అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారు మోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. కీప్ ఇట్ అప్! మీ సంపదను పెంచుకోవడం మాత్రం మర్చిపోకండి. రాష్ట్ర అభివృద్ధి, సంపదను కుక్కలపాలు చేయండి. కానీ, మీ సంపద, ఆస్తుల్ని మాత్రం పెంచుకోండి. అదే ముఖ్యమంత్రి స్ఫూర్తి” అని పవన్ ట్వీట్ చేశారు. దీనికి ఒక కార్టూన్ కూడా జత చేశారు. అందులో సీఎంకు ‘అప్పురత్న’ అవార్డు ఇస్తున్నట్లుగా ఉంది. ఈ కార్టూన్‌లోనే తొమ్మిది నెలల్లో ఏపీ రూ.55,555 కోట్లు అప్పు చేసినట్లు పేర్కొన్నారు.

ఇది వైసీపీ సర్కారు రికార్డుగా పవన్ అభివర్ణించారు. తాజా నివేదిక ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఏపీ అప్పు రూ.55 వేల కోట్లు దాటింది. అంటే సగటున రోజుకు రూ.205 కోట్ల చొప్పున ఏపీ అప్పు చేస్తోంది. నెలకు రూ.6,172 కోట్లను అప్పుగా తీసుకుంటోంది. దీంతో ఏపీ అప్పుల భారం పెరిగిపోతోంది. దీనిపైనే పవన్ కల్యాణ్ తాజాగా ట్వీట్ చేశారు.

* ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ రేషన్ పంపిణీ

అమరావతి : రేషన్‌ బియ్యం దారి మళ్ళిం పునకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మాఫి యా ఆగడాలకు కళ్లెం వేసేందుకు పక్క స్కెచ్‌ వేసింది.

ఇందులో భాగంగా డిజిటల్‌ సాంకేతికతను తెరపైకి తేనుం ది. ప్రతి బస్తాకు క్యూఆర్‌ కోడ్‌ సీల్‌ వేయడం ద్వారా అక్రమా లకు చెక్‌ పెట్టాలని భావిస్తోంది. చెలరేగిపోతున్న రేషన్‌ మాఫియాను అడ్డుకోవడంలో భాగంగా క్యూ ఆర్‌ కోడ్‌ విధానంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రతి బస్తాను ట్రాకింగ్‌ చేసేందుకు వీలుగా అన్ని బియ్యం బస్తాలపై సెక్యూరిటీ సీల్‌ ముద్రించనున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల ఏ బస్తాను ఎక్కడికి పంపిస్తున్నారనేది స్పష్టంగా తెలియనుంది. పైలెట్‌ ప్రాజెక్ట్‌ గా త్వరలోఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అమలు చేసేందుకు సివిల్‌ సప్లైస్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సత్ఫలితాలు వచ్చినట్లైతే రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఇదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తుట్లు తెలుస్తోంది. పేదల కడుపు నింపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో 1 కోటి 46 లక్షల కుటుంబాలకు రేషన్‌ అందిస్తోంది. పలువురు రేషన్‌ కార్డుదారులు ఆ బియ్యాన్ని తిరిగి ఎండీయూ ఆపరేటర్లకు కేజీ రూ.7 నుంచి రూ.9 చొప్పున విక్రయిస్తున్నారనేది బహిరంగ రహస్యం. కార్డుదారుల నుంచి కొనుగోలు చేస్తున్న బియ్యాన్ని ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు కల్సి రాష్ట్రాలు దాటించి అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారు.

ఈక్రమంలో ప్రతి బియ్యం బస్తాపైన క్యూ ఆర్‌ కోడ్‌ సెక్యూరిటీ సీల్‌ను వేసి క్షేత్రస్థాయిలో పేదలకు పంపిణీ చేసే వరకు ట్రాకింగ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా బియ్యం అక్రమ రవాణాకు చెక్‌ పెట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా తెలుస్తోంది.

* నాయిబ్రహ్మాణులకు జగన్ సర్కార్ శుభవార్త

నాయిబ్రహ్మాణులకు జగన్ సర్కార్ శుభవార్త. ఆలయ పాలకవర్గాల్లో ఓ ధర్మకర్తగా నాయి బ్రాహ్మణులను నియమించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 610 ఆలయాలకు పాలకవర్గాలను నియమించాల్సి ఉండగా, వీటన్నింటిలో నాయి బ్రాహ్మణుల నుంచి ఒకరు చొప్పున సభ్యుడిగా చేర్చాలని పేర్కొంది.

దేవాదాయ శాఖకు చెందిన 97 ఆలయాల్లో 1,121 మంది నాయి బ్రాహ్మణులు క్షురకులుగా ఉన్నారని, 1,169 ఆలయాల్లో భజంత్రీలుగా పనిచేస్తున్నారని, 100 మంది చెవులు కొట్టేవారు, 500 మంది పల్లకి మోసే విధులు నిర్వహిస్తున్నట్లు వివరించింది. దేవాలయ సాంప్రదాయాలతో వీరికి అనుబంధం ఉండడంతో, నిర్వాహణలో వీరికి భాగస్వామ్యం కల్పించేలా ప్రతి ట్రస్ట్ బోర్డులో ఒకరికి సభ్యుడుగా అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 3న జారీ అయిన ఈ ఆర్డినెన్స్ సోమవారం బయటకు వచ్చింది.

*కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపు?

దిల్లీ:* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు చెల్లించే కరవు భత్యాన్ని నాలుగు శాతం మేర పెంచే అవకాశం ఉంది. దీంతో మూల వేతనంలో డీఏ ప్రస్తుతం ఉన్న 38 శాతం నుంచి 42 శాతానికి పెరగనుంది. ఈ విషయమై అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి శివగోపాల్‌ మిశ్ర ఓ వార్తాసంస్థతో మాట్లాడారు. గతేడాది డిసెంబరుకు సంబంధించిన ‘పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచీ’ ఆధారంగా డీఏ నాలుగు శాతం పెరిగి 42 శాతానికి చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. ఆర్థికశాఖ ఈ మేర డీఏ పెంపు ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌ ముందు పెట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనను కేంద్రం ఆమోదిస్తే.. తాజా డీఏ పెంపు జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 38 శాతం కరవు భత్యం పొందుతున్నారు. డీఏలో చివరి సవరణ 2022 సెప్టెంబరు 28న జరిగింది. ఇది 2022 జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం ఏటా రెండుసార్లు సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ అందజేస్తారు.