Uncategorized

TNI. నేటి నేర వార్తలు..ACB కి చిక్కిన బేగంపేట ఎస్సై

TNI. నేటి నేర వార్తలు..ACB కి చిక్కిన బేగంపేట ఎస్సై

◾ బేగంపేట పోలీస్ స్టేషన్‌లో ఎసిబి అధికారుల సోదాలు

▪️12 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ నరేష్.

▪️ఒక కేసులో లంచం డిమాండ్ చేయడంతో ఎసిబిని ఆశ్రయించిన రాఘవేంద్ర అనే వ్యక్తి.

▪️లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఎసిబి అధికారులు.

* సెక్రటేరియట్ లో జరిగిన అగ్నిప్రమాదం పై హైకోర్టు లో పిల్

సెక్రెటేరియట్ లో జరిగిన ప్రమాదం పై సీబీఐ తో విచారణ జరపాలని కోరిన KA పాల్

తాను దాఖలు చేసిన పిల్స్ ను విచారణ కు రాకుండా అడ్డుకుంటున్నారని నేడు మరోసారి చీఫ్ జస్టిస్ బెంచ్ లో మెన్షన్ చేసిన పాల్

సెక్రటేరియట్ ను క్రైమ్ జోన్ గా గుర్తించాలి, నూతన సెక్రటేరియట్ ను సీజ్ చేసి విచారణ జరపాలి

జరిగిన సంఘటన ప్రమాదవశాత్తు , లేక నరబలి ఏమైనా జరిగిందా అనేది విచారణ చేయాలని కోరిన పాల్

పాల్ దాఖలు చేసిన పిల్ కి నెంబరింగ్ ఇవ్వాలని రిజిస్టార్ కి ఆదేశం

సెక్రెటేరియట్ ప్రారంభోత్సవం కేసీఆర్ పుట్టిన రోజు కాకుండా, అంబేద్కర్ పుట్టిన రోజు ప్రారంభోత్సవం చేయాలని మరో పిల్ వేసిన పాల్

KA పాల్ వేసిన రెండు పిల్స్ పై గురువారం విచారణకు వచ్చే అవకాశం

* తెలంగాణ రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు.

వెయిటింగ్‌లో అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సీఐడీ ఎస్పీగా ఆర్‌ వెంకటేశ్వర్లు, సైబరాబాద్‌ పరిపాలన డీసీపీగా యోగేశ్‌ గౌతమ్‌, పీసీఎస్‌ ఎస్పీగా రంగారెడ్డి, జీఆర్పీ అడ్మిన్‌ డీసీపీగా రాఘవేందర్‌రెడ్డి, వరంగల్‌ పోలీస్‌ శిక్షణా కేంద్రం ఎస్పీగా పూజ, డీజీపీ కార్యాలయం న్యాయవిభాగం ఎస్పీగా సతీశ్‌, వరంగల్‌ నేర విభాగం డీసీపీగా మురళీధర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గత జనవరిలోనూ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే.

జనవరి 25న రాష్ట్రవ్యాప్తంగా 91 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది

* డెల్ ఉద్యోగులకు షాక్

వేల మందికి లేఆఫ్​.. ఇన్ఫోసిస్​లోనూ

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో మరో సంస్థ ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్ టటెక్నాలజీస్ 6,650 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు, ఇన్ఫోసిస్ కూడా 600 ఫ్రెషర్ ఉద్యోగులపై వేటు వేసింది.

* ఆంధ్రప్రదేశ్ అప్పులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైర్

పెరిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ అప్పులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు.
మంగళవారం మధ్యాహ్నం ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందించారు. ఒక కార్టూన్‌తో కూడిన ట్వీట్ చేశారు.

”అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారు మోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. కీప్ ఇట్ అప్! మీ సంపదను పెంచుకోవడం మాత్రం మర్చిపోకండి. రాష్ట్ర అభివృద్ధి, సంపదను కుక్కలపాలు చేయండి. కానీ, మీ సంపద, ఆస్తుల్ని మాత్రం పెంచుకోండి. అదే ముఖ్యమంత్రి స్ఫూర్తి” అని పవన్ ట్వీట్ చేశారు. దీనికి ఒక కార్టూన్ కూడా జత చేశారు. అందులో సీఎంకు ‘అప్పురత్న’ అవార్డు ఇస్తున్నట్లుగా ఉంది. ఈ కార్టూన్‌లోనే తొమ్మిది నెలల్లో ఏపీ రూ.55,555 కోట్లు అప్పు చేసినట్లు పేర్కొన్నారు.

ఇది వైసీపీ సర్కారు రికార్డుగా పవన్ అభివర్ణించారు. తాజా నివేదిక ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఏపీ అప్పు రూ.55 వేల కోట్లు దాటింది. అంటే సగటున రోజుకు రూ.205 కోట్ల చొప్పున ఏపీ అప్పు చేస్తోంది. నెలకు రూ.6,172 కోట్లను అప్పుగా తీసుకుంటోంది. దీంతో ఏపీ అప్పుల భారం పెరిగిపోతోంది. దీనిపైనే పవన్ కల్యాణ్ తాజాగా ట్వీట్ చేశారు.