WorldWonders

“కాల మహిమ” నాయనా “కాల మహిమ”

“కాల మహిమ” నాయనా “కాల మహిమ”

ॐశ్రీవేంకటేశాయ నమః
💝 *కాలం చేతిలో మనమంతా కీలుబొమ్మలమే. “కాలం కలిసి రాకపోతే తాడు కూడా పామై కరుస్తుంది” అనడానికి  కొన్ని ఉదాహరణలు చూద్దాం.
💖 మహానటుడు,  ప్రజలు గర్వించే ఎన్టీఆర్ మీద, వైస్రాయ్ సాక్షిగా చెప్పులు పడ్డాయి. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎంత దారుణ పరిస్థితిలోకి పడిపోయారో చూసాం. పిల్లలు పట్టించుకోలేదు. ఆస్తులూ కలసి రాలేదు.
💖 2009 ఎలక్షన్ ప్రచారంలో  మెగాస్టార్ చిరంజీవి మీద కోడిగుడ్లతో దాడి చేశారు.ఆ తరవాత రాజకీయాల నుంచి నిష్క్రమణ.
💖 మహా మేధావి  మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 420 case లో  బోనులో  నిలబడవలసి వచ్చింది. చివరికి శవానికి దహన సంస్కారాలు కూడా సరిగా జరగలేదు.
💖 రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాణించలేకపోయిన అపర చాణక్యుడు పి. వి. నరసింహారావు గారు (వీరికి మా తాతగారు కీ.శే. శ్రీరామ్ చక్రపాణి గారు ఓనమాలు దిద్దించారని గర్వంగా చెప్పుకుంటాను) కేంద్ర ప్రభుత్వాన్ని ప్రథానమంత్రిగా నడిపారు. దక్షిణాది నుండి ప్రధానమంత్రిగా దేశాన్నేలిన ఏకైక నిరాడంబర జీవి ఆయన
💖 మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి అంత్యక్రియలు చేయడానికి కనీసం వారి భౌతికకాయం కూడా దొరకలేదు.
💖 ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  16 నెలలు జైలులో ఉన్నారు.
💖 ’ఆమె మంత్రివర్గంలో ఆమె తప్ప అందరూ ఆడవాళ్లే’ అనే ఛలోక్తి విస్తృత ప్రచారంలో ఉండేది ఇందిరాగాంధీ గారి విషయంలో. అలాంటి మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని 1978లో కంటెంప్ట్ ఆఫ్ హౌస్ కింద సాక్షాత్తు మన పార్లమెంటే జైలుకు పంపింది.
💖 తమిళ ప్రజలతో “అమ్మ” అని పిలిపించుకుని పలువురితో పాదాభివందనాలు చేయించుకున్న తిరుగులేని ఉక్కుమహిళ, మాజీ ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీ సాక్షిగా చీర లాగి వివస్త్రను చేశారు. టాన్సి కేస్ లో కోర్టుల చుట్టూ తిరిగింది. చివరికి ఏ స్థితిలో చనిపోయిందో చూసాం.
💖 ఆంధ్ర బిల్ గేట్స్ గా పేరుపొందిన సత్యం రామలింగరాజు నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు.
💖 ప్రపంచాన్ని గడగడలాడించిన అలెగ్జాండర్, చివరకు నిస్సహాయంగా చనిపోయాడు.
💖 జాత్యహంకారానికి  మారుపేరుగా నిలిచి, లక్షల మందిని ఊచకోత కోయించి,  రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన హిట్లర్ దిక్కులేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.
💖 గొప్ప విజన్ ఉన్న నాయకుడు గా చెప్పుకునే  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం వేచి చూసిన కేసీఆర్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాగే NDA అధికారంలో ఉన్నప్పుడు NDA కన్వీనర్  చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసి విఫలమైన నరేంద్ర మోడీ, దేశ ప్రధాని అయ్యాడు. ఒకప్పుడు చంద్రబాబు  అపాయింట్మెంట్ కోసం వేచి చూసిన నరేంద్ర మోడీ,  కెసిఆర్ లు 15 సంవత్సరాల తర్వాత PM, CM అవడం..చంద్రబాబుకి 2019 ఎలక్షన్స్ లో చరమగీతం పాడడం కాలమహిమ కాక మరి ఏమిటి! ఇప్పుడు అదే చంద్రబాబు భోరున ఏడ్చిన సంఘటనలూ చూస్తున్నాం.
💝 ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.
💝 ఈ సృష్టి అంతా కాలస్వరూపం. కాలమే దైవం. మనల్ని ఈ భూమి మీదకు తీసుకువచ్చేది కాలం, మనల్ని ఈ భూమి మీద నుంచి తీసుకు వెళ్ళి పోయేది కాలం.
💝 అందువల్ల “నేనే” అన్న అహంకారంతో విర్రవీగవలసిన అవసరం లేదు. ఈ భూమికి మనం ‘అరువు’గా వచ్చాం. కొన్నాళ్ళకు ఈ భూమికే ‘ఎరువు’ గా మారిపోతాం ఈ మధ్యలో ‘పరువు’గా బతికేద్దాం , ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. కాలం కంటే వేగంగా మనసులు మారుతున్న పైశాచిక మానవమృగాల మధ్య మనం బ్రతుకుతున్నాం. అందుకే ఎవరితో ఎంతవరకూ ఉండాలో అంతవరకే ఉండాలి మనం.
💝 జీవితంలో అన్నీ కోల్పోయినా ఒకటి మాత్రం మనకోసం ఎప్పుడూ సిద్దంగా ఉంటుంది. దాని పేరే భవిష్యత్తు. మనిషి జీవితం మేడిపండు లాంటిది. మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది. కానీ లోపల అన్ని పురుగులే ఉంటాయి. మనిషి జీవితం కూడా అంతే ఒకరి జీవితం మరోకరికి అందంగానే కనబడుతుంది. కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు కన్నీళ్ళు ఎవరికీ కనిపించవు.
💝 మనం మనిషిగా పుట్టడమే ఒక అద్భుతం. బతికి ఉండటం ఒక అదృష్టం. ముడి పడుతున్న బంధాలన్నీ వరాలు. ఎదురు పడుతున్న అడ్డంకులన్నీ మనకు విలువైన పాఠాలు. కష్టం గురించి చింతించక ఉన్నన్నాళ్లు ఆనందంగా గడిపేద్దాం.
💝  అహంకారాన్ని దాటాలంటే ప్రతి మనిషీ కొంత ఫిలాసఫీని అర్థం చేసుకోవడం  అవసరం.
💝 ఎవరి గతి ఏమిటో కాలమే నిర్ణయిస్తుoది. మనమందరం ధర్మమార్గంలో పయనిద్దాం.
💖 గమనిక:~ఇందులో పేర్కొన్న మహానుభావుల పేర్లను కేవలం కాలమహిమను తెలిపేందుకే ఉదాహరించడమైనది.వారి పట్ల పరిపూర్ణమైన గౌరవమున్నది.
❤️