Editorials

సీనియర్ మహిళా IPSతో పెళ్లి పీటలెక్కనున్న మంత్రి..

సీనియర్ మహిళా IPSతో పెళ్లి పీటలెక్కనున్న మంత్రి..

పోలీసులకు, పాలిటీషియన్లకు దాదాపు పడదు. టామ్ అండ్ జెర్రీ ఆటలా ఉంటుంది ఈ ఇద్దరి నడవడిక. అలాంటిది సిన్సియర్ గా ఉండే పోలీస్ ని ఒక పొలిటీషియన్ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఒక మంత్రి ఒక ఐపీఎస్ అధికారిణితో నిశ్చితార్ధం చేసుకున్నారు.

సాధారణంగా పోలీసులకు, పొలిటీషియన్స్ కి పడదని అంటారు. నిజ జీవితంలోనూ, సినిమాల్లోనూ ఈ రెండు రంగాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. పైకి నవ్వుతూ కనిపించిన లోపల పోలీసులకు పొలిటీషియన్స్ మీద కోపం అనేది ఉంటుంది. తమ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో పోలీసులపై ప్రెజర్ పెడతారని, పోలీసులను డ్యూటీ సరిగా చేయనివ్వరన్న అసంతృప్తితో పోలీసులు ఉంటారన్న ప్రచారం అయితే ఉంది. మరి ఇలాంటి బద్ధ శత్రువులైన పోలీసు, పొలిటీషియన్ ఒక ఇంటి వారైతే ఇంకేమైనా ఉందా? పాత సినిమాల్లో పోలీస్, లాయర్ భార్యాభర్తలు ఉండడం, వారిద్దరూ గొడవ పడడం వంటి సన్నివేశాలు చూస్తాం. కానీ ఒక పోలీస్, పొలిటీషియన్ పెళ్లి చేసుకోబోతుండడం ఇదేనేమో తొలిసారి. పోలీస్ పోలీస్ ని, డాక్టర్ డాక్టర్ ని పెళ్లి చేసుకోవడం కామన్. బట్ ఫర్ ఏ ఛేంజ్.. ఒక పోలీస్ ని పొలిటీషియన్ పెళ్లి చేసుకోబోతున్నారు.

సీనియర్ ఐపీఎస్ అధికారిణితో పంజాబ్ మంత్రికి వివాహం నిశ్చయమైంది. మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హరజోత్ సింగ్ బెయిన్స్, ఐపీఎస్ అధికారిని జ్యోతి యాదవ్ లు త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. నిశ్చితార్ధం కూడా చేసుకున్నారని తెలిపాయి. గత ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆనంద్ పూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన హరజోత్ సింగ్.. ప్రస్తుతం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ క్యాబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. 32 ఏళ్ల హరజోత్ సింగ్ స్వస్థలం ఆనంద్ పూర్ సాహిబ్ లోని గంభీర్ పూర్. వృత్తి రీత్యా న్యాయవాది. 2014లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 2018లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లా సర్టిఫికెట్ ను పొందారు.

ఇక పంజాబ్ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ జ్యోతి యాదవ్ ప్రస్తుతం మన్సా ఎస్పీగా పని చేస్తున్నారు. హర్యానాలో గురుగ్రామ్ కి చెందిన జ్యోతి యాదవ్ గత ఏడాది ఆప్ ఎమ్మెల్యే రాజేందర్ పాల్ కౌర్ చిన్నాతో పబ్లిక్ లోనే గొడవకు దిగి వార్తల్లో నిలిచారు. అయితే అదే ఆప్ పార్టీకి చెందిన మంత్రిని ఆమె పెళ్లి చేసుకోబోతున్నారు. త్వరలో ఐపీఎస్ ఆఫీసర్ జ్యోతి యాదవ్, మంత్రి హరజోత్ సింగ్ పెళ్లి చేసుకోబోతుండడంతో పంజాబ్ స్పీకర్ శుభాకాంక్షలు తెలిపారు. మరి మహిళా పోలీస్ ని పెళ్లి చేసుబోతున్న మంత్రిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.