Devotional

నేటి మీ రాశి ఫలితాలు

నేటి మీ రాశి ఫలితాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 *16.03.2023 ✍🏻*
🗓 *నేటి రాశి ఫలాలు 🗓*

🐐 మేషం
ఈరోజు (16-03-2023)

ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందొచ్చు. మరోవైపు మీ హక్కులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అవివాహితులకు వివాహం విషయంలో పురోగతి లభిస్తుంది. వైవాహిక జీవితంలో ఉండే వారికి ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపారులకు మంచి ఆదాయం లభిస్తుంది. ఈరోజు అకస్మాత్తుగా మంచి లాభాలను పొందొచ్చు.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (16-03-2023)

ఈ రాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీ కుటుంబంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాల గురించి చర్చించొచ్చు. ఈ సమయంలో పెద్దలతో ఏదో ఒక విషయంలో వాగ్వాదం జరగొచ్చు. భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మతపరమైన పనుల్లో పాల్గొనడం వల్ల మీ మనసు సంతోషంగా ఉంటుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (16-03-2023)

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. గతంలో కంటే మెరుగైన పరిస్థితులు ఏర్పడతాయి. దీంతో మీ మనసులో ఆనందంగా ఉంటుంది. ఎవరితోనైనా అప్పు తీసుకుంటే, దాన్ని తిరిగి ఇచ్చేయండి. వ్యాపారులు పిల్లల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. మీకు భార్య నుంచి మంచి సహకారం లభిస్తుంది. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొంటే, అందులో విజయం సాధిస్తారు.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (16-03-2023)

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరమైన విషయాల్లో గొప్ప ఫలితాలను పొందుతారు. ఈ సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యక్రమంలో ఉత్సాహంగా గడుపుతారు. రాజకీయ రంగాల్లో ఉండే వారు మంచి విజయం సాధిస్తారు. విదేశాల నుంచి వ్యాపారం చేసే వారు, కొన్ని కొత్త ఆలోచనలు చేస్తారు. మీ వ్యాపారాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తారు.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (16-03-2023)

ఈ రాశి వారిలో ఉద్యోగులు, వ్యాపారులు తీవ్రమైన సమస్యలకు తండ్రి సలహాతో మంచి పరిష్కారం పొందొచ్చు. మీ తోబుట్టువులతో సంబంధాలు చాలా బాగుంటాయి. ఇతరుల భావాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. అవివాహితులకు ఈరోజు మంచి వివాహ ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (16-03-2023)

ఈ రాశి వారు ఈరోజు శత్రువుల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు మీకు హాని కలిగించొచ్చు. మీరు చేసే పనిలో అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించొచ్చు. ఈరోజు మీరు ఎక్కువ ఖర్చులు చేయొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో మహిళా సహోద్యోగి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు సాంకేతిక రంగంలో విజయం సాధిస్తారు.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (16-03-2023)

ఈ రాశి వారు ఈరోజు చాలా ప్రశాంతంగా గడుపుతారు. మీ ఇంట్లో పెండింగ్ పనులన్నీ పూర్తి చేసే అవకాశాన్ని పొందుతారు. ఈరోజు మీరు కొందరు గొప్ప వ్యక్తులను కలిసే అవకాశాన్ని కూడా పొందుతారు. మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే, అందులోని అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. మీ మాటల్ని అదుపులో పెట్టుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈ కారణంగా మీరు భవిష్యత్తు గురించి తక్కువ ఆందోళన చెందుతారు.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (16-03-2023)

ఈ రాశి వారిలో వ్యాపారులు తమ వ్యాపారానికి సంబంధించి ఎవరి నుంచైనా సలహా తీసుకోవాల్సి రావొచ్చు. అయితే ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకండి. మీరు అన్ని బాధ్యతలను నెరవేర్చడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీరు ప్రతిచోటా ప్రశంసలు పొందుతారు. మీ ప్రేమ జీవితంలో ఆహ్లాదకరంగా ఉంటుంది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (16-03-2023)

ఈ రాశి వారు ఈరోజు ఇంటి కొనుగోలు విషయం గురించి ఎక్కువ సమయం గడుపుతారు. ఈ కారణంగా మీ ఖర్చులు పెరుగుతాయి. మీరు మీ బడ్జెట్‌ను ద్రుష్టిలో ఉంచుకుని పని చేయడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి ప్రేమను పొందుతారు. వ్యాపారులు కొత్త ప్రణాళికలు చేస్తారు.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (16-03-2023)

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరమైన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరికీ అప్పులు ఇవ్వకండి. ఎందుకంటే అవి తిరిగి మళ్లీ రాకపోవచ్చు. ఈరోజు మీ పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలను వింటారు. ఈ కారణంగా మీ పిల్లల గురించి గర్వపడతారు. మీ కుటుంబ జీవితంలో కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (16-03-2023)

ఈ రాశి వారిలో రాజకీయాలతో సంబంధం ఉన్న వారికి మంచి విజయం లభిస్తుంది. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈరోజు మంచి లాభాలొస్తాయి. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించొచ్చు. మతపరమైన పనులకు ఈరోజు డబ్బులు ఖర్చు చేయొచ్చు. విద్యార్థులు ఉపాధ్యాయుల మద్దతు పొందుతారు.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (16-03-2023)

ఈ రాశి వారికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే, మీరు విజయం సాధించొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని మంచి బాధ్యతలను పొందొచ్చు. వ్యాపారులు ఈరోజు కొంత దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఉద్యోగులు రహస్య శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ భార్య నుంచి పూర్తి మద్దతు పొందుతారు.
🦈🦈🦈🦈🦈🦈🦈