Editorials

నేడు ఉషశ్రీ జయంతి.. ప్రత్యేక కథనం..

నేడు ఉషశ్రీ జయంతి.. ప్రత్యేక కథనం..

Ushasri was a radio and literary personality in Telugu. The original name of Ushasri was Puranapanda Surya Prakasha Dikshithulu. He was from Andhra Pradesh in South India. He was famous for his radio programmes broadcast from the Vijayawada All India Radio station.

ధర్మసందేహాలు..
విజ్ఞాన సందోహాలు..!

✍️✍️✍️✍️✍️✍️✍️
ఉషశ్రీ జయంతి
16.03.1928
🙏🙏🙏🙏🙏🙏🙏
ఆకాశవాణిలో
ఆయన వాణి
నాటి రేడియోకే చూడామణి..
ఉషశ్రీ ధర్మసందేహాలు
వదిలిపోయే
కొన్ని వ్యామోహాలు..
తీరిపోతూ ఇంకొన్ని కలహాలు..
పరిశుద్ధం చేస్తూ
అంతఃకరణాలు..
వ్యాసుని వ్యాకరణాలు..,!

సమస్త సన్మంగళాని భవంతు..
ఈ పదంతో మొదలయ్యే
ఉషశ్రీ గొంతు..
అడిగిన ప్రశ్నకు
మత్తుగా..గమ్మత్తుగా..
బదులు..
సరిచేస్తూ
నీ అంతరంగ గదులు..!
అప్పుడేనా ‘స్వస్తి..’
రేడియో నీదైనా
కార్యక్రమం
ఆకాశవాణి ఆస్తి..
ఉషశ్రీది అంతే లేని పరిణితి..
అయినా తప్పదుగా
కాలపరిమితి..
మళ్లీ అదే అలవరసా..
అంతవరకు
వేచి ఉండడమే మనసా..!

పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు..ఉరఫ్ ఉషశ్రీ…
అసలు పేరు తెరమరుగున..
ఉషశ్రీ పేరు వింటేనే
రేడియో ముందుకు
పరుగుపరుగున..!

ఆ గొంతు ఆకాశవాణిలో
ప్రత్యక్ష ప్రసారాలనూ
చేసింది సుసంపన్నం..
వ్యాఖ్యానం చెబుతుంటే
అది షడ్రసోపేత అన్నం..
ఇప్పటికీ చెవుల్లో అలా మారుమ్రోగుతునే
ఉంటుంది గాని..
దానికో దన్నం…!
భద్రాద్రి రామయ్య కళ్యాణం
ఉషశ్రీ స్వరంలో
మరింత కమనీయం..
కృష్ణా పుష్కరాల
ప్రత్యక్ష ప్రసారం..
ఆ గళంలో రమణీయప్రవాహం..
అచట ఆ ముచ్చట
కనేందుకు..
దేవతలే ఆవాహం..!

సుందరకాండను
సుమనోహరంగా
అక్షరబద్ధం చేసిన
అపర వాల్మీకి..
నాలుగు సంపుటాలలో
భారతాన్ని రచించిన
మరో వ్యాసుడు..
శ్రీకృష్ణావతారాన్ని
కళ్లకు కట్టిన
ఉషశ్రీ..అయ్యాడు
పండితులకే మాన్యశ్రీ..!