NRI-NRT

ఫ్రెంచ్ ఎంబసీలో వీసా స్కాం .. ఫేక్ | డాక్యుమెంట్లతో దందా, భారత్ నుంచి | పారిపోయిన సూత్రధారి

ఫ్రెంచ్ ఎంబసీలో వీసా స్కాం .. ఫేక్  | డాక్యుమెంట్లతో దందా, భారత్ నుంచి | పారిపోయిన సూత్రధారి

భారత్‌లోని ఫ్రెంచ్ ఎంబసీకి చెందిన మాజీ ఉద్యోగి నకిలీ పత్రాలతో వందలాది మందికి వీసా జారీ చేసి భారీ మోసానికి పాల్పడిన వ్యవహారం కలకలం రేపింది.అయితే ఈ కుంభకోణం వెనుకున్న ప్రధాన సూత్రధారి భారత్( India ) నుంచి పారిపోయినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

అతను వీసాలు మంజూరు చేసినవారిలో సొంత తల్లిదండ్రులు కూడా వున్నారు.ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ఫిర్యాదు మేరకు ఈ కేసులో శుభమ్ షోకీన్( Shubham Shokeen ), మరో మాజీ ఉద్యోగి ఆర్తీ మండల్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని అధికారులు పేర్కొన్నారు.

శుభమ్.జనవరి 1, 2022 నుంచి మే 6, 2022 వరకు ఎంబీసీ వీసా విభాగాధిపతికి తెలియకుండా ప్రతి దరఖాస్తుకు రూ.50,000 తీసుకుని నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా వీసాలు జారీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.అలా మొత్తం 324 ఫైళ్లను డీల్ చేశారని అధికారులు ఆరోపించారు.

ఎఫ్ఐఆర్( FIR ) నమోదు తర్వాత సీబీఐ అధికారు షోకీన్‌పై నిఘా పెట్టారు.అయితే అతను గతేడాది డిసెంబర్‌లో కేసు నమోదు చేయడానికి ముందే భారత్‌ను విడిచివెళ్లినట్లు అధికారులు గుర్తించారు.సోదాల సందర్భంగా షోకీన్ తల్లిదండ్రుల పాస్‌పోర్టులను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.అతని తండ్రి సముందర్ సింగ్‌( Samunder Singh ), తల్లి అనితా షోకీన్‌( Anita Shokeen )ల పాస్‌పోర్టులపై స్కెంజెన్ వీసా స్టిక్కర్లు అతికించారు.

స్కెంజెన్ వీసాల ద్వారా ఒక వ్యక్తి యూరప్‌లోని 27 దేశాల మీదుగా సులభంగా ప్రయాణించవచ్చు.ఫ్రెంచ్ రాయబార కార్యాలయం జారీ చేసిన వీసా జనవరి 3, 2022 నుంచి జనవరి 2, 2027 వరకు ఐదేళ్ల పాటు చెల్లుబాటులో వుంటుంది.

దీనితో సాయంతో ఫ్రాన్స్‌లో 90 రోజుల వరకు వుండొచ్చు.

అయితే షోకీన్ తల్లిదండ్రుల పాస్‌పోర్టులపై వున్న వీసా స్టిక్కర్లు నిజమైనవేనని ఫిబ్రవరి 10న ఇక్కడి ఫ్రెంచ్ రాయబార కార్యాలయం సీబీఐకి తెలియజేసింది.కానీ ఎంబసీ అధికారి యోహాన్ ఫన్హాన్( John Fanhan ) సంతకాలు మాత్రం నకిలీవిగా తేలింది.షోకీన్ తల్లిదండ్రులు వీసా కోసం పర్సనల్ ఇంటర్వ్యూకు హాజరుకాలేదని, ఆ స్టిక్కర్లను అతనే బయటకు తీసి ఇంట్లో అతికించినట్లు ఎంబసీ తెలిపిందని సీబీఐ అధికారులు వెల్లడించారు.

అంతేకాకుండా ఆర్తీ మండల్, షోకీన్‌లు ఎంబసీలోని వీసా డిపార్ట్‌మెంట్ నుంచి డాక్యుమెంట్లు, ఫైల్‌లను ధ్వంసం చేసి .తమ అక్రమాల గురించిన జాడ తెలియకుండా చేసినట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు.ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఢిల్లీ, పాటియాలా, గురుదాస్‌పూర్, జమ్మూలో సీబీఐ సోదాలు నిర్వహించగా ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్, అనుమానాస్పద పాస్‌పోర్ట్‌లు, ఎలక్ట్రానిక్ ఆధారాలు లభించాయి.