Business

ఎలాంటి టెన్షన్స్ లేకుండా దూసుకెళ్తున్న స్టాక్.. నష్టాల్లోనూ ఎంత శాతం పెరిగిందంటే?

ఎలాంటి టెన్షన్స్ లేకుండా దూసుకెళ్తున్న స్టాక్.. నష్టాల్లోనూ  ఎంత శాతం పెరిగిందంటే?

అమెరికా మార్కెట్లు క్రితం సెషన్‌లో పుంజుకున్నా.. దేశీయ సూచీలు ఇవాళ కాస్త ఒత్తిడిలో ఉన్నాయి. అక్కడి బ్యాంకుల పతనం ఎఫెక్ట్ ఇంకా ఇన్వెస్టర్లపై కనిపిస్తోంది. మార్కెట్లు ఒడుదొడుకుల్లో ఉన్నా.. ఒక స్టాక్ దూసుకెళ్తోంది. టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.

భారత్ స్టాక్ మార్కెట్ సూచీలు అవే ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. అమెరికాలో సిలికాన్ వ్యాలీ, సిగ్నేచర్ బ్యాంక్ దివాలా తీయడం సహా మూతపడ్డాయి. ఇక ఇతర బ్యాంకుల్లోనూ ఇలాంటి సమస్యలు బయటపడుతున్నాయి. దీంతో కొద్దిరోజులుగా ప్రపంచ దేశాల్లో బ్యాంకింగ్, ఆర్థిక రంగం షేర్లు పతనమయ్యాయి. క్రితం సెషన్‌లో అమెరికా మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయి. ఆర్థిక షేర్లు పుంజుకున్నాయి. దీంతో ఆసియా సూచీలు ఇవాళ చాలా వరకు లాభాల్లోకి వచ్చినప్పటికీ భారత స్టాక్ మార్కెట్లు మాత్రం ఇంకా ఒడుదొడుకుల్లోనే ఉన్నాయి. సెన్సెక్స్ ఈ వార్త రాసే సమయంలో ఫ్లాట్‌గా 57 వేల 630 మార్కు వద్ద ఉంది. నిఫ్టీ 17 వేల మార్కు కింద ట్రేడవుతోంది.

మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్నప్పటికీ.. ఒక స్టాక్ ట్రెండింగ్‌లో నిలిచింది. అదే కేపీఐటీ టెక్నాలజీస్ (KPIT Technologies). NSE Code: KPITTECH. ఈ స్టాక్ పట్ల ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారు. దీంతో కొనుగోళ్ల వెల్లువ కొనసాగుతోంది. శుక్రవారం సెషన్ ఆరంభంలో 7 శాతానికిపైగా పెరిగింది. ప్రస్తుతం 6 శాతం లాభంతో రూ.866 వద్ద కొనసాగుతోంది. మిడ్ క్యాప్ సెక్టార్‌కు చెందిన ఈ ఐటీ స్టాక్ షార్ట్ టర్మ్‌లో మంచి లాభాలు ఇస్తుందని చెబుతున్నారు నిపుణులు.

ఈ కేపీఐటీ టెక్నాలజీస్ స్టాక్ టెక్నికల్ పారామీటర్ల పరంగా చూస్తే ప్రైస్ వాల్యూమ్ బ్రేకవుట్‌ను నమోదు చేస్తూ వెళ్తోంది. 14 డే RSI 58.91తో గుడ్ స్ట్రెంత్‌ను సూచిస్తోంది. MACD బుల్లిష్ క్రాసోవర్‌ను సూచిస్తోంది. ఓవరాల్‌గా చూస్తే ఈ స్టాక్ భవిష్యత్తులో విలువ పెరుగుతుందని తెలుస్తోంది. మూమెంటమ్ ట్రేడర్లు ముఖ్యంగా ఈ స్టాక్‌పై దృష్టి సారించాలని చెబుతున్నారు.