Movies

శంషాబాద్ లో చరణ్ కు ఘనస్వాగతం

శంషాబాద్ లో చరణ్ కు ఘనస్వాగతం

దేశంలో ఎక్కడ చూసినా టాలీవుడ్ స్టార్ రాంచరణ్ పేరు మారుమోగుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో చరణ్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు. ఆస్కార్ అవార్డుల కార్యక్రమం కోసం అమెరికాకు వెళ్లిన చరణ్ నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. తన భార్య ఉపాసనతో కలిసి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న చరణ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. జై చరణ్… జై ఎన్టీఆర్ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. పూలు చల్లుతూ అభిమానాన్ని చాటారు. ఈ సందర్భంగా అభిమానులకు అభివాదం చేసిన చరణ్… తనపై ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత చరణ్ వాహనం వెనుకే అభిమానులు తమ వాహనాల్లో ర్యాలీగా వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నిన్న చరణ్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి చిరంజీవి కూడా హాజరయ్యారు.