Devotional

22 న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

22 న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 22న శ్రీశోభకృత్‌ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు ధరింపజేస్తారు. అనంతరం పంచాంగ పఠనం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు నిర్వహిస్తారు. ఆ రోజు ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని తితిదే రద్దు చేసింది. 21, 22వ తేదీల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసింది. సోమవారం, మంగళవారం వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించరు.