Business

GTA.. మరొక నూతన తెలంగాణ సంస్థ ఆవిర్భావం..

GTA.. మరొక నూతన తెలంగాణ సంస్థ ఆవిర్భావం..

గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ పేరుతో మరొక తెలుగు సంస్థ ఆవిర్భవించింది. విసు కలవాలా వ్యవస్థాపక చైర్మన్ గా GTA రూపుదిద్దుకొంది. ఇటీవల హైదరాబాదులో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ సంస్థ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. జులై ఆఖరి వారంలో హైదరాబాదులో ప్రపంచ స్థాయిలో ఒక సమ్మేళనం నిర్వహించడానికి ఈ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు లు చేస్తున్నట్లు విసు కలవాల తెలిపారు.

విశ్వ వ్యాప్తమైన తెలంగాణ సమాజాన్నీ ఏకం చేయాలనే మహోన్నత ఆశయం , బలమైన సంకల్పంతో మనమంతా ఏకతాటి పై నడవాలనే ఎన్నారైల ఆకాంక్షల నుంచి మొదలై అందరూ ఏకమై కలసిమెలిసేలా విశ్వవేదిక కు అంకురార్పణ జరుగుతుంది.

తెలంగాణ గడ్డపై పుట్టి మహోన్నత ప్రతిభ పాటవాలతో ప్రపంచం లోని వివిధ దేశాల్లో తమ ప్రజ్న ని చాటుతున్న తెలంగాణ సోదరి సోదరులని ఒకే తాటిపైకి తీసుకువచ్చే ఉన్నత ఆలోచనలకు ప్రతిరూపంగా పురుడుపోసుకుంటుంది గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్.

నిస్పాక్షిక సేవే లక్ష్యంగా , తెలంగాణ బిడ్డల కష్ట సుఖాల్లో మేము సైతం అంటూ భరోసా కల్పించడమే ద్యేయంగా తొలి అడుగు వేస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలని ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి తెలంగాణ సమాజాన్ని ప్రోత్సహించడానికి, సంరక్షించడానికి, శాశ్వతంగా సేవలు కొనసాగించడానికి ఏర్పాటవుతుంది గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్.

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబింప చేస్తూ ప్రతి ఒక్కరికి సహాయపడటమే ద్యేయంగా తొలి అడుగు వేస్తుంది. అరవై ఏండ్ల కాంక్షని నిజం చేస్తూ వీరులు చల్లిన కాంతులకి సరికొత్త సొబగులు అద్దుతూ మాతృభూమి ఋణం తీర్చడమే లక్ష్యంగా తెలంగాణ ఎన్నారైలని ఒక్కటి చేసి సేవా పధంలో సరికొత్తగా ప్రయాణం మొదలు పెడుతుంది.

తల్లిపాల రుణం కొంతైనా తీర్చటమే ప్రధాన లక్ష్యంగా సేవే పరమావధిగా తమని కన్న భూమికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని, ఎందరికో స్ఫూర్తిగ నిలవాలనే సత్సంకల్పం, దృఢమైన ఆలోచనతో ఊపిరులూదుకుంటుంది.

ఇడుపు ఇడుపున జానపదములు ఇంపుగా పూసిన కవనవనంబులు అనే తెలంగాణ చరిత్రని నిజం చేస్తూ సాహిత్య కళాకారులు, సంప్రదాయ జానపద కళలలని ప్రోత్సహిస్తూ తెలంగాణ సంస్కృతిని భవిష్యత్తు తరాలకి అందించాలనే సమున్నత ఆశయాన్ని విశ్వ వేదికగా సాక్షత్కరించేలా తొలి ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది.

ఏ దేశమేగినా ఎందు కాలిడినా తెలంగాణ గౌరవాన్ని పెంపొందించేలా తెలంగాణ బిడ్డల ఐక్యతని చాటేలా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ప్రయాణం మొదలవుతుంది.

వాసిగా చరితల వెలుగొందిన గత వైభవాల కోన మన తెలంగాణ అనే మాటని నిజం చేస్తూ తెలంగాణ వైభవాన్ని నలుదిశలా చాటి చెప్పేలా బృహత్తర బాధ్యతతో తెలంగాణ సమాజాన్ని ఏకం చేయడమే లక్ష్యంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ రూపుదిదుకుంటుంది.

తెలంగాణ సమాజం పట్ల ప్రేమని, సేవల పట్ల తమ బాధ్యతను సమోన్నత ఆశయంతో నెరవేర్చేలా ఘన ప్రస్థానాన్ని మొదలు పెడుతుంది.

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం , తెలంగాణ కోసం తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి అనునిత్యం పాటు పడే దిశగా ఎలాంటి కష్టం వచ్చిన తెలంగాణ ప్రజలకి మేము తోడుగా ఉన్నామన్న భరోసా ఇస్తూ విద్య , ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సంక్షేమం, సాయం ఇలా ఒకటేమిటి అన్ని రంగాల్లో తెలంగాణ బిడ్డలందరికి సేవలు అందించాలని, తెలంగాణ సమాజాన్ని ఇందులో మమేకం చేయాలనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైల కలకి కార్యరూపంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆవిష్కృతమవుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో ఉన్న తెలంగాణ సంఘాలని ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి సేవ పరిధిని , అవకాశాల పరిమితులని విస్తృత పరచడమే ప్రధాన కర్తవ్యంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అడుగులు వేయనుంది.

సంజీవిని కార్యక్రమం ద్వారా ఆరోగ్య సేవలు, భారతి ద్వారా విద్యకు చేయూత, అన్నదాతలకు భరోసా ఇచ్చేలా జై కిసాన్ కార్యక్రం బతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లి భారంగా బతుకీడిస్తున్న సోదరులకు ఆత్మస్థయిర్యం కలిగించేలా పరదేశి , దేశ అవసరాలని తీర్చగల సత్తా యువతకు ఉందని, భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని బలంగా నమ్ముతూ యువతకి చేయూత ఇవ్వాలనే ఆలోచనతో యువతీ యువకులకు ఉపాధి , విద్య రంగంలో సాయం చేకూర్చేలా యువత, మహిళల సాధికారతే లక్ష్యంగా వారికి అన్ని రంగాల్లో అవకాశాలు పెరిగేలా నారీమణి , కష్టనష్టాలు ఎదురైనా మగ్గాన్ని మరువని నేత కార్మికుల కోసం సంకల్పం, వికలాంగులకి చేయూత అందించేలా సహాయత ఇలా ఒకటేమిటి తెలంగాణ బిడ్డలకు అవసరమైన అన్ని విధాలా సాయం అందించేలా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఘనమైన ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది.

ప్రపంచంలో తెలంగాణ బిడ్డ ఏ చోట ఉన్న వారు ఉన్నత అవకాశాలని ఎక్కడ పొందగలరో ఒక మార్గదర్శికి సంస్థ నిలవనుంది.

విద్య , వైద్య , వ్యాపార , న్యాయ , పరోశోధన , సామాజిక అవకాశాలకు వేదికగా , విశ్వ వ్యాప్తంగా ఉన్న తెలంగాణా బిడ్డలకు సంధానకర్తగా గురుతర బాధ్యతలని తమ కర్తవ్యంగా భావిస్తూ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ముందుకు సాగనుంది.