Politics

ముఖ్యమంత్రి నివాసంలో ఘనంగా ఉగాది వేడుకలు

ముఖ్యమంత్రి నివాసంలో ఘనంగా ఉగాది వేడుకలు

ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddy గారు త‌న నివాసంలోని గోశాలలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టి పడే విధంగా ఉగాది సంబరాలు జరుపున్నారు. వేడుకలకు ముందు శ్రీవెంకటేశ్వర ఆలయంలో సీఎం దంపతులు పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని స్వీకరించారు.

ఈ సందర్భంగా పంచాంగాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం పంచాంగ శ్రవణంలో సీఎం జగన్‌ దంపతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సీఎం జగన్‌ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంలో అన్ని శుభాలు జరగాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. ‘‘రైతులకు మేలు జరగాలి. అక్క చెల్లెమ్మలు, సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్‌ అన్నారు.

శ్రీ కప్పగంతు సుబ్బరామ సోమయాజి గారు పంచాంగ పఠనం చేశారు. శ్రీశోభకృత్‌ నామ సంవత్సర పంచాంగ పఠనం చేసిన సుబ్బరామ సోమయాజిని సీఎం జగన్‌ సన్మానించారు. తిరుమల ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయం నుంచి వచ్చిన పండితులు.. సీఎం జగన్‌ దంపతులకు వేద ఆశీర్వచనం ఇచ్చారు.

సీఎం జగన్‌ దంపతులకు పండుగ సందర్భంగా మెమెంటో అందజేయడం జరిగింది. సాంస్కృతిక శాఖ రూపొందించిన క్యాలెండర్‌ను అధికారులతో కలిసి సీఎం ఆవిష్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం జగన్‌ దంపతులు వీక్షించారు.