Editorials

ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన పదహారు మంది మావోయిస్టులు..

ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన పదహారు మంది మావోయిస్టులు..

చింతూరు: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని సుక్మా జిల్లాలో ఐజీ సుందరరాజు ఎదుట శుక్రవారం పదహారు మంది మావోయిస్టులు లొంగిపోయారు..

వీరిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు (Maoists) ఉన్నారు. లొంగిపోయిన వారి నుంచి ఒక బర్మార్‌ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐజీ సుందరరాజు మాట్లాడుతూ సుక్మా జిల్లా చింతగుప్ప, పోలంపల్లి, తోంగపాల్‌ తదితర ప్రదేశాలలో విధులు నిర్వర్తిస్తున్న 74, 131 , 226 నెంబరు గల సీఆర్‌పీఎఫ్‌ బెటాలియన్ల (CRPF Battalions) నేతృత్వంలో ఆదివాసీల అభివృద్ధికి చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు మావోయిస్టులు ఆకర్షితులవుతున్నారన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు మావోయిస్టులు లొంగుబాట పడుతున్నారన్నారు..

ఈ క్రమంలోనే 16 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయినట్లు ఐజీ చెప్పారు. వీరిలో రూ. 8, 5 లక్షల రివార్డులతో పాటు రూ.1 లక్ష రివార్డు కలిగిన మావోయిస్టులు కూడా ఉన్నారన్నారు. వారంతా పలు విధ్వంసాలలో పాల్గొన్నట్లు చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామన్నారు..☝️🎥🎤👈👉 చంద్రశేఖర్ భార్గవ ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ విజయవాడ 🙏