Sports

రామ్ చరణ్ బర్తే సందర్భంగా రేపు స్పెషల్ సీడీపీ రిలీజ్

రామ్ చరణ్ బర్తే సందర్భంగా రేపు స్పెషల్ సీడీపీ రిలీజ్

ఈ నెల 27వ తేదీన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) బర్త్డే . ఆయన ఆస్కార్ వేదిక వరకూ వెళ్లి వచ్చిన తరువాత జరుపుకుంటున్న పుట్టినరోజు(birthday) ఇది. అందువలన ఈ సారి ఆయన బర్త్డే మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. అందువలన రేపటి నుంచే ఈ సందడి మొదలు కానుంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, రేపు స్పెషల్ CDP ని రిలీజ్ చేయనున్నారు.

ఈ నెల 27వ తేదీన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) బర్త్డే . ఆయన ఆస్కార్ వేదిక వరకూ వెళ్లి వచ్చిన తరువాత జరుపుకుంటున్న పుట్టినరోజు(birthday) ఇది. అందువలన ఈ సారి ఆయన బర్త్డే మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. అందువలన రేపటి నుంచే ఈ సందడి మొదలు కానుంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, రేపు స్పెషల్ CDP ని రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితమే వదిలారు.రేపు సాయంత్రం 6 గంటలకి స్పెషల్ సీడీపీ రిలీజ్ (CDP release) ఉంటుందని స్పష్టం చేశారు. ఇక 26 .. 27వ తేదీల్లో చరణ్ మూవీ ‘ఆరెంజ్’ స్పెషల్ షోస్ వేస్తున్నారు. ప్రస్తుతం చరణ్ .. శంకర్ (Shankar) సినిమా ‘ఆర్ సి 15’ ‘(RC 15’) చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. కియారా (Kiara) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా, పాన్ ఇండియా(Pan India) స్థాయిలో ప్రేక్షకులను పలకరించనుంది. ఆ తరువాత సినిమాను గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ చేయనున్నట్టు తెలుస్తోంది.త్వరలో హాలీవుడ్ లో (Hollywood) కూడా చరణ్ ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.