Editorials

#శ్రీలక్ష్మీదేవిఅనుగ్రహం_కలగాలంటే

#శ్రీలక్ష్మీదేవిఅనుగ్రహం_కలగాలంటే

🌺మన ఇంట్లో డబ్బు ఎల్లప్పుడు ఉండాలంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉండాలి. ఆ తల్లి చల్లని కరుణ మనపై ఉంటే డబ్బుకు కొరత ఉండదు. మనం చేసే పనులు, మన ప్రవర్తన ను బట్టే భగవంతుని కృప మనకు కలుగుతుంది. మరి…. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ముఖ్యమైనవి కొన్ని పాటించాలి. అవేంటంటే🌺

🌺1. శ్రీ లక్ష్మీ కటాక్షం కోసం సూర్యోదయానికి ముందుగా లేచి ఇంటికి వెనుక వైపు గల తలుపును తీసిపెట్టాలి. వెనక గది తలుపులను తీశాకే ఇంటి సింహద్వార తలుపులు తెరవాలి.

🌺2.మంగళ, శుక్రవారాల్లో పంచముఖ దీపాలను వెలిగించాలి. ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాగేందుకు నీరు తప్పకుండా ఇవ్వాలి. పసుపు కొమ్ములను ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా పూర్వ జన్మల్లో చేసిన పాపాలు హరింపబడతాయని, కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని పురాణాల్లో వివరించబడింది.

🌺3. అలాగే పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసి సత్యనారాయణ స్వామిని తులసితో అర్చించి పాలతో చేసిన పాయసం, కలకండ, పండ్లతో నైవేద్యం సమర్పించాలి. ఈ పూజ అయిన తర్వాతే రాత్రి భోజనం తీసుకోవాలి.

🌺4. వజ్రం, వెండి పాత్రలు లక్ష్మీ కటాక్షం గలవారికే లభిస్తాయి. ముఖ్యంగా వెండి సామాన్లు, వెండి పాత్రలను ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదు. ఇంట్లో వున్న వెండి పాత్రలను తన సంతానానికి కూడా ఇవ్వకూడదని శాస్త్ర వచనం.

🌺5. అయితే ముఖ్యంగా అసత్యాలు పలికే వారి వద్ద, ఇతరుల మనస్సును గాయపరిచే వారివద్ద లక్ష్మీదేవి నివాసముండదు. 🌺

🌺ఇంట్లో వెంట్రుకలు గాలికి తిరగాడితే లక్ష్మీ కటాక్షం దక్కదు. బయటికి వెళ్ళి కాలును శుభ్రం చేసుకోకుండా ఇంటికి వచ్చే వాళ్ళ ఇంట లక్ష్మీదేవి నివాసముండదు.

తల్లిదండ్రులను లెక్కచేయని వారింట, గోళ్లు కొరికేవారింట శ్రీలక్ష్మీదేవి నిలువదు…🙏