Politics

కాశీలో రోప్ వేకు మోడీ శంకుస్థాపన..

కాశీలో  రోప్ వేకు మోడీ శంకుస్థాపన..

ఇక నుంచి వారణాసిలో ఇరుకైన వీధులు భక్తులకు ఇబ్బంది కలిగించవు. అక్కడ రోప్వే ప్రాజెక్టు భక్తులకు అందుబాటులోకి రానుంది. రూ.644 కోట్ల ఈ ప్రాజెక్టుకు ప్రధాని, వారణాసి ఎంపీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా వారణాసి కాంట్ నుండి కాశీ విద్యాపీఠం, రథయాత్ర, చర్చి గుండా గొదాలియా కూడలి వరకు మొత్తం 5 స్టేషన్లు నిర్మిస్తామని వారణాసి డెవలప్ మెంట్ అథారిటీ వైస్-ఛైర్మన్ అభిషేక్ గోయల్ తెలిపారు.