NRI-NRT

ఆటా… హైదరాబాద్ లో వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

ఆటా… హైదరాబాద్ లో వైభవంగా  అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) అంతర్జతీయ మహిళా దినోత్సవ వేడుకలు హైదరాబాద్ హోటల్ గ్రీన్ పార్క్ లో 19 మార్చ్ 2023 న ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆటా ఇండియా టీం ఎంతో ఉత్సాహవంతంగా నిర్వహించిన ఈ కార్యక్రమం లో దాదాపు 150 మంది పాల్గొన్నారు. ముఖ్యఅతిధులుగా జస్టిస్ శ్రీమతి శ్రీసుధ , శాసనమండలి సభ్యురాలు శ్రీమతి సురభి వాణి పాల్గొన్నారు.
ఆటా ఉమెన్స్ కోఆర్డినేటర్ ఇందుకుమార్ స్వాగతంతో ప్రారంభమయిన ఈ కార్యక్రమంలో లైవ్ లింక్ ద్వారా ప్రారంభోపన్యాసం చేసారు. మహిళలు అన్ని రంగాలలో సాధికారత సాధించే విధంగా తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు చేసుకోవాలిసిందిగా ఆకాంక్షించారు. కాబోయే ప్రెసిడెంట్‌(2025-26) జయంత్ చల్లా మాట్లాడుతూ కిక్కిరిసిన హాల్ ను సంతోషం వ్యక్తపరుస్తూ ఆట సేవా కార్యక్రమాలను వివరించి భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకు వస్తాం అని తెలిపారు .

ముఖ్య అతిధి జస్టిస్ శ్రీ సుధ గారు మాట్లాడుతూ కుటుంబము ,విలువలు ,వివాహ వ్యవస్థ ఇవేవీ మనం మరవద్దని బాధ్యతలు వాటిని బట్టే మనకు జీవితంలో ప్రమోషన్ ఉంటుందని బిడ్డగా భార్యగా తల్లిగా అత్తగా అమ్మమ్మగా ఇవన్నీ కావాల్సిందేనని ముఖ్యంగా ఇప్పటి యువతీ యువకులు వారి ఆలోచన దృక్పథం లివింగ్ టుగెదర్ పిల్లలు వద్దు అనేది పూర్తిగా సమంజసము కాదని అన్ని బాధ్యతలు పరిపూర్ణంగా నిర్వహించినప్పుడే పరిపూర్ణమైన జీవితంగా భావించాలని అన్నారు. ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి ఆటా సేవలు గురించి ప్రసంగించారు. ఎన్సీడీ గ్రూప్ రాయల్ పెవిలియన్ మొకిల్ల చైర్మన్ శ్రీ శ్రీనివాస రావు గారు మాట్లాడుతూ ఆటా చేస్తున్న సేవా కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.


ఆటా ఇండియా రెస్ప్రెసెంటేటివ్ లోహిత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ కోఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి, ఇండియా అడ్వజర్ సురేందర్రెడ్డి తదితరులు తోడ్పాటు అందించారు. అవార్డులను ఎంపిక చేయడంలో సాకేత్ పూర్తి సహకారం అందించారు. ఇండియా మీడియా కోఆర్డినేటర్ వెంకట్రావు మీడియా బాధ్యతలు నిర్వహించారు. ఎంతో సమర్ధవంతంగా కార్యక్రమం నిర్వహించినందుకు ఆటా ఇండియా టీం సభ్యులను ఆటా ప్రెసిడెంట్ శ్రీమతి మధు బొమ్మినేని పేరు పేరున అభినందించారు.
https://www.youtube.com/watch?v=5-kzQS0U9RE&t=7480s