Editorials

ఇంటి పై గుడినీడ పడకూడదా ? పడితే ఏమవుతుంది ?

ఇంటి పై గుడినీడ పడకూడదా ? పడితే ఏమవుతుంది ?

🌾హోమ గుండానికి దగ్గరలో మనం ఉండము ? ఆ అగ్ని వేడిని మనం తట్టుకోలేము కాబట్టి. అలాగే ఆలయం దగ్గరలో ఉండకపోవడం అనేది కూడా అలాంటిదే.

🌾 దేవాలయం ఒక పవిత్రమైన స్థలం అయినా శాస్త్ర బద్దంగా స్థాపించిన ఒక శక్తి కేంద్రకం. ఆలయాలలో హోమం, యాగాదులు ఎల్లవేళలా జరుగుతుంటాయి. అందువల్ల ఆలయం ఉన్న చోట అలాగే గుడినీడ ఇంటిపై పడేచోట ఇల్లు కట్టుకోకూడదు అంటుంటారు.

🌾మరి పూజారులు ఉంటారు కదా? వారు పూజ చేయడానికి అర్హులు అలాగే వారు చాలా పవిత్రం గా ఉంటారు.

🌾ఇప్పటివరకు ఉన్న వారు బాగానే ఉన్నారు కదా అని మీరు అనుకుంటే కొంతమంది చాలా భక్తి శ్రద్దలతో ఇంటిని పవిత్రం గా నీటిగా ఉంచుతారు.

🌾అసలు గుడికి ఎంత దూరం లో ఉండాలి ? ఏ గుడి నీడ పడితే ఎలా ఉంటుంది ?

🌾వాస్తు ప్రకారం
వాస్తు ప్రకారం గుడికి కొన్ని వైపులు మాత్రం ఉండకూడదట.

🌾దేవాలయానికి ఇంటికి ఉండవలసిన దూరం గర్భ గుడిలోని మూల విరాట్టు విగ్రహం నుండి కొలవాలట.

🌾ఎటువైపు ఇల్లు ఉండకూడదు?
వాస్తు శాస్త్రం ప్రకారం శివాలయాలకు వెనుక వైపు ఇల్లు ఉండవచ్చు, వైష్ణవ ఆలయాలకు ముందు ఉండవచ్చు అని శాస్త్రం చెబుతుంది.

🌾గుడికి ఆనుకొని ఏ ఇల్లు ఉండకూడదు.

🌾అందువల్ల అలాకాకుండా రివర్స్ లో ఉంటే కనుక ఆ కుటుంబంలో వివాదాలు, కలహాలు ఎక్కువగా కలిగే ప్రమాదం ఉంటుందట.

🌾ఎంత దూరం లో ఉండాలి ?
శివాలయాలకు, వైష్ణవ ఆలయాలకు, అలాగే శక్తి ఆలయాలకు 200 అడుగుల దూరం లోపు ఇల్లులను నిర్మించుకోకూడదు.

🌾ముందు చెప్పినట్టుగా ఇంటికి గుడికి దూరాన్ని గర్భ గుడిలోని మూల విరాట్టు విగ్రహం నుండే పరిగణలోకి తీసుకోవాలంట.

🌾అంతేకాదు ఇక్కడ చెప్పబడిన ఆలయాలకు దగ్గరలో నివసించడం వల్ల ఆ ఇంట్లో వారిని దారిద్య్రం వెంటాడుతుందట.

🌾డబ్బు నిలవదట.శివాలయానికి దగ్గరలో ఇల్లు ఉంటే మాత్రం శత్రువుల భయం ఎక్కువగా ఉంటుందట.

🌾వైష్ణవాలయానికి దగ్గరలో
వైష్ణవాలయానికి దగ్గరలో కనుక ఇల్లు ఉండినట్లయితే ఆ ఇంటినుండి అమ్మవారు విడిచి స్వామివారి సన్నిదిలోకి వెళ్ళిపోతారంట. ఆ ఇంటిలో కూడా లక్ష్మీదేవి నిలవదట. డబ్బు సమస్య ఎల్లవేళలా పీడిస్తుంది అంట.

🌾శక్తి ఆలయానికి దగ్గరలో
శక్తి ఆలయానికి ఆనుకుని ఇల్లు ఉంటే కనుక ఆ ఇంట్లోని వారు ఎవ్వరూ వృద్ది చెందరు. అంతేకాదు ఏ కార్యక్రమంలోని పురోగతి ఉండరట. ఏ కార్యక్రమ్మాన్ని చేపట్టినా ఫలితం శూన్యం.

🌾వినాయకుని ఆలయానికి దగ్గరలో
ఇంటికి 200 అడుగుల లోపు ఉత్తరాన, వాయువ్యంలో వినాయకుని ఆలయం ఉన్నవారికి ధన నష్టం, అవమానాలు జరుగుతాయట. వృధా ఖర్చులు పెడతారట.

🌾 మీరు ఒకవేళ ఇప్పటికీ ఆలయాల నీడపడే చోట మీ ఇల్లు ఉంటే కనుక వెంటనే వాస్తు శాస్త్రజ్ఞుడిని సంప్రదించండి.