Business

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఆ మూడు రంగాలపైనే ఫోకస్..

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఆ మూడు రంగాలపైనే ఫోకస్..

దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి నష్టాల నుంచి తేరుకున్నాయి. ఈ క్రమంలో పుంజుకున్న మార్కెట్లు సూచీలను బుల్ జోరుతో ముందుకు నడిపిస్తున్నాయి. అయితే మార్కెట్లు ఈ రోజు చాలా ఒత్తిడికి లోనవుతాయని.. కరెక్షన్ జరగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఉదయం 9.34 గంటల సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 241 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. నిఫ్టీ సూచీ 57 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 186 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 59 పాయింట్ల లాభంలో ట్రేడవుతోంది.

ఈ రోజు ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, సయ్యంట్ వంటి సంస్థల క్యూ4 ఫలితాలు విడుదల కానున్నాయి. ప్రధానంగా మార్కెట్లలో ఐటీ, ఆటో, బ్యాంకింగ్ రంగాల్లోని అనేక కంపెనీలు ఫోకస్ లో ఉన్నాయి. ఆర్థిక అనిశ్చితుల కారణంగా ఆయిల్ డిమాండ్ తగ్గవచ్చనే ఆందోళనలు మార్కెట్లో కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా నడవటంతో డాలర్ విలువ తగ్గింది.

NSE సూచీలో టైటాన్, ఆదానీ పోర్ట్స్, ఎల్ టి, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, టీసీఎస్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, విప్రో, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఆటో, హిందాల్కొ, మహీంద్రా అండ్ మహీంద్రా, బ్రిటానియా కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

ఇదే క్రమంలో దివీస్ ల్యాబ్, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, ఎస్బీఐ లైఫ్, గ్రాసిమ్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, ఓఎన్జీసీ, హిందుస్థాన్ యూనీలివర్, టాటా కన్జూమర్, రిలయన్స్, యూపీఎల్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడవుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.