Health

రంజాన్ ఉపవాసంతో స్కిన్ హెల్త్ బెనిఫిట్స్.. కారణం ఏంటో తెలుసా?

రంజాన్ ఉపవాసంతో స్కిన్ హెల్త్ బెనిఫిట్స్.. కారణం ఏంటో తెలుసా?

రంజాన్ నెలలో ఉపవాసం ఉండటంవల్ల తమకు పుణ్యం లభిస్తుందని దైవభక్తి కలిగిన ముస్లింలు భావిస్తుంటారు. అయితే దీనిని ఇంటెర్ మిట్టెన్ ఫాస్టింగ్గా (intermittent fasting) కూడా నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల పలు రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని, స్కిన్ హెల్త్ పై పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు.

ముఖ్యంగా సోరియాసిస్, చర్మంపై నొప్పిని కలిగించే గడ్డలు, మచ్చలు వంటి లక్షణాలు కలిగిన హైడ్రాడెనిటిస్(hidradenitis suppurativa) వ్యాధులకు చెక్ పెడుతుందని డెర్మటాలజిస్టులు అంటున్నారు.ఫాస్టింగ్ వల్ల శరీరంలో మంటను కలిగించే ఇన్ ఫ్లమేషన్
స్థాయిలు, వాపుకు కారణమయ్యే సైటోకిన్స్(cytokines) తగ్గుతాయని ఒక అధ్యయనంలో
తేలిందని చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ మునీబ్ షా పేర్కొన్నారు.

సోరియాసిస్ తగ్గుతుంది

అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ జర్నల్లో పబ్లిషైన ఒక అధ్యయనంలో రంజాన్ టైంలో ఫాస్టింగ్ వల్ల కొంతమందిలో సోరియాసిస్ సిస్టమ్స్ తగ్గాయని నిపుణులు కనుగొన్నారు. జర్నల్ ఆఫ్ కటానియస్ మెడిసిన్ అండ్ సర్జరీలో (Journal of Cutaneous Medicine and Surgery) పబ్లిషైన మరో స్టడీలో కూడా కొంతమంది పేషెంట్లలో ఉపవాసం అనేది చర్మంపై గడ్డలు, మచ్చలు వంటి హైడ్రాడెనిటిస్ సప్పురాటివా లక్షణాలను నివారించి స్కిన్ గ్లోయింగ్ ku కారణమవుతుంది.

రంజాన్ ఉపవాసం వాస్తవానికి రెగ్యలర్గా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉండే ఇంటెర్ మిట్టెన్ ఫాస్టింగ్. కొన్ని రోజులపాటు నిర్దిష్ట సమయంలో కొన్నిగంటలపాటు ఆహారం తీసుకోకుండా ఉంటారు. ఈ పరిస్థితి చర్మంపై మొటిమలను తగ్గించడమేగాక, స్కిన్ రూపమే మారేలా చేస్తుందని చెన్నయ్ లోని అపోలో కాస్మోటిక్ క్లినిక్ లో డెర్మటాలజిస్టు డాక్టర్ అన్ని ఫ్లోరా(Dr Annie Flora) వెల్లడించారు.

అంతేగాక ఈ ఉపవాసం ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని, శరీరంలోని పెయిన్ (మంట)ను తగ్గిస్తుందని చెప్పారు. అంతేగాక అందంగా, యవ్వనంగా కనిపించడానికి దోహదం చేసే కొల్లాజెన్ హార్మోన్ ఉత్పత్తిని ఈ ఫాస్టింగ్ ప్రేరేపిస్తుందన్నారు. ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ డెర్మటాలజిస్టు డా. మహాజన్ ప్రకారం.. రంజాన్ ఉపవాసం ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. చర్మం దెబ్బతినకుండా ఉండేందుకు అవసరమైన హార్మోన్ల
ఉప్పత్తికి రంజాన్ ఉపవాసం సహాయపడుతుంది.

ఎందుకలా జరుగుతుంది?

రంజాన్ ఫాస్టింగ్ అనేది స్కిన్ హెల్పై పాజిటివ్ ఎఫెక్ట్ చూపడానికి కారణం, అది రెగ్యులర్ గా కాకుండా కొన్ని రోజులపాటు పాటించే ఇంటెర్ మిట్టెన్ ప్రాసెస్ కావడమే అంటున్నారు డెర్మటాలజిస్టు డాక్టర్ మహాజన్. మరోకారణం ఏంటంటే.. ఉపవాసం లేని సమయాల్లో, ఇఫ్తార్ వేళల్లో ముస్లింలు తగినంత పోషకాలు కలిగిన ఆహారం, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు కలిగిన సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా ఇందుకు సహాయపడుతుందని చెప్తున్నారు. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలతోపాటు అదనంగా చర్మం ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని డాక్టర్ మహాజన్ సూచిస్తున్నారు.