NRI-NRT

భద్రాచలం డిగ్రీ కళాశాలకు బెంచీలు బహూకరించిన తాళ్లూరి ట్రస్ట్..

భద్రాచలం డిగ్రీ కళాశాలకు బెంచీలు బహూకరించిన తాళ్లూరి ట్రస్ట్..

భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరుబయట విద్యార్థులు అధ్యాపకులు పట్టణ ప్రజలు సేద తీరటం కోసం పెద్ద ఎత్తున సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. ట్రస్టు తరుపున తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశంకర్ వీటిని కళాశాల ప్రిన్సిపాల్ కు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు విద్యార్థులు అధ్యాపకులు తాళ్లూరి పంచాక్షరయ్య ట్రస్ట్ కు కృతజ్ఞతలు తెలిపారు..