Politics

అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు…

అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు…

సోమవారం మరోసారి విచారణ చేపడతామన్న సుప్రీంకోర్టు

viveka murder case : అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. తెలంగాణ హైకోర్టు మధ్యంతర inఉత్తర్వులు ఆమోద యోగ్యం కావని పేర్కొంది. తెలంగాణ హైకోర్టు విచారణపైనా సుప్రీం స్టే విధించింది. హైకోర్టు ఉత్తర్వులు పేలవమైనవన్న సుప్రీంకోర్టు.. సోమవారం మరోసారి విచారణ చేపడతామని తెలిపింది. అప్పటి వరకు అవినాష్రెడ్డిని అరెస్టు చేయవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. అవినాష్క బెయిల్ ఇస్తే విచారణపై ప్రభావం పడుతుందని వాదించిన సీబీఐ న్యాయవాది.. వివేకా హత్య కేసులో ప్రలోభాలు కూడా పని చేశాయని సుప్రీం కోర్టుకు నివేదించారు.

సుప్రీంలో సవాల్ చేసిన సునీత.. వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డిని ఈ నెల 25వ తేదీ వరకు అరెస్టు చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఆమె తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథా… ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ముందు ఈ అంశాన్ని మెన్షన్ చేశారు. ఈ సందర్భంగా వివేకా హత్య కేసు దర్యాప్తును ఏప్రిల్ 30వ తేదీలోపు పూర్తిచేయాలని గతంలో సుప్రీం ఆదేశించిన విషయాన్ని ఉటంకించారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ కావాల్సి ఉందని వాదించిన సునీత తరఫు న్యాయవాది… కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్ సీఎం సంరక్షణలో అవినాష్రెడ్డి ఉన్నారని పేర్కొన్నారు. తనపై కేసు కొట్టివేయాలన్న అవినాష్రెడ్డి పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చిందని తెలిపారు. సీబీఐ అరెస్ట్ చేస్తుందనే ఉద్దేశంతో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ పిటిషన్ను విచారణ చేసిన హైకోర్టు….. ఆయనకు మధ్యంతర ఉపశమనం కల్పించిందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. అందువల్ల తాము దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం విచారణకు స్వీకరించాలని కోరడంతో.. బెయిల్ పై సుప్రీం కోర్టు స్టే విధించింది.

మూడోరోజూ కొనసాగుతున్న సీబీఐ విచారణ.. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో వరుసగా మూడోరోజూ అవినాష్రెడ్డి విచారణ కొనసాగుతోంది. ఉదయం 10 చాటిన తర్వాత ఆయన సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఈనెల 25 వరకు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. అదే సమయంలో భాస్కర్రెడ్డి, ఉదయ్ను మూడోరోజు కస్టడీలోకి తీసుకున్న సీబీఐ… చంచల్గూడ జైలు నుంచి సీబీఐ కార్యాలయానికి తరలించారు. ఇద్దరినీ సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.