Kids

అయ్యో.. మీ పిల్లలు ఎత్తు పెరగట్లేదా? ఇదిగో టిప్స్

అయ్యో.. మీ పిల్లలు ఎత్తు పెరగట్లేదా? ఇదిగో టిప్స్

పిల్లల వయస్సు ప్రకారం ఎత్తు పెరగకపోతే తల్లిదండ్రులు ఆందోళన చెందడం సహజం. బరువు కూడా ఎత్తుకు తగ్గట్టుగా ఉండాలి. అయితే, కొంతమంది పిల్లలలో పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది.

హైట్ అనేది.. తప్పనిసరి. వయసుకు తగ్గట్టుగా ఎత్తులేకుంటే.. భవిష్యత్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. పొట్టిగా ఉంటే.. అందరూ ఏడిపిస్తారు. పిల్లలు ఎత్తు పెరగడం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు హైట్ పెరగరు. దీంతో తల్లిదండ్రుల్లో ఓ ఆందోళన ఉంటుంది. సరైన ఎత్తు పెరిగేలా ఫుడ్(Food) పెట్టాలి. పిల్లలు ఎత్తుగా ఎదగాలంటే వారికి అవసరమైన పోషకాలను అందించాలి. నిజానికి, ఎత్తు పెరగడం అనేది తక్షణ పని కాదు. ఇది కూడా కృత్రిమమైనది కాదు. అందుకోసం కొన్ని చర్యలు తీసుకోవాలి. అవి ఏంటో తెలుసుకోవడానికి ఇక్కడ చదవండి.

పిల్లల ఎత్తు(Children’s Height)పెరుగుదలకు క్యారెట్, బీన్స్, బెండకాయ, బచ్చలికూర, బఠానీలు, అరటి, సోయాబీన్, పాలు ఇవ్వాలి. అటువంటి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల మంచి ఎదుగుదల ఉంటుంది.

ఆహారంతో పాటు తేలికపాటి వ్యాయామాలు కూడా చేయాలి. వయసు పెరిగే కొద్దీ ఎత్తు పెరిగే కొద్దీ వెన్నెముక ఫ్లెక్సిబిలిటీని హ్యాంగింగ్ వ్యాయామాలు సులభంగా పెంచుతాయి. ఈ వ్యాయామాల వల్ల వెన్ను, భుజాల కండరాలు దృఢంగా మారుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

పిల్లలకు స్కిప్పింగ్ కూడా మంచి వ్యాయామం. స్కిప్పింగ్(Skipping) వెన్నెముక, భుజాలు, కాళ్ళ కండరాలకు ఉపయోగపడుతుంది. దీనివల్ల ఎత్తు పెరగడానికి ఉపయోగపడుతుంది. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ ఎత్తు సులభంగా పెరుగుతారు.

ఎదిగే పిల్లల ఆరోగ్యానికి గుడ్లు(Eggs), పాలు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ప్రొటీన్లతో పాటు క్యాల్షియం, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పెరుగుతున్న బిడ్డ ఎత్తు పెరగడానికి ఇవి చాలా మేలు చేస్తాయి. అందుకే పిల్లలు ఎత్తు పెరగాలంటే రోజూ గుడ్లు తినాలి.

తల్లిదండ్రులు(Parents) తమ పిల్లల ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు, ఐస్ క్రీములు కాకుండా మంచి పోషకాహారం ఇవ్వాలి. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. ఇక పొడవుగా లేని పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. పైన పేర్కొన్న అన్ని ఆహారాలు మీ పిల్లలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

మన శరీరం(Body)లో పెరుగుదలను ప్రేరేపించే హార్మోన్లు కూడా ఉంటాయి. పిల్లలు నిద్రించినప్పుడే విడుదలవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే పిల్లలు ఎంత నిద్రపోతే అంత పెరుగుతారని అంటారు