Devotional

ఈ వారం మీ రాశి ఫలితాలు

ఈ వారం మీ రాశి ఫలితాలు

హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 (23-04-2023 నుండి 29-04-2023) ✍🏻
🗓 ఈ వారం మీ రాశి ఫలితాలు

🐐 మేషం(24-04-2023 నుండి 29-04-2023)

ఆస్తిని వృద్ధి చేసే విధంగా సఫలీకృతులు అవుతారు. ఆత్మీయుల వల్ల మంచి జరుగుతుంది. ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుపుతారు. ఇబ్బందిగా అనిపించిన సంఘటనలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. దుర్గాధ్యానం శుభప్రదం.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం (24-04-2023 నుండి 29-04-2023)

మనోబలంతో పనులను పూర్తిచేస్తారు. సకాలంలో పనులను పూర్తిచేస్తారు. ముఖ్య విషయాలలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. బంధు, మిత్రుల సహకారంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. | సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు వరిస్తాయి. అప్పులు లేకుండా పెరగాలి. అనవసర భయాందోళనలకు చూపిస్తున్నారు. దత్త నామాన్ని స్మరించాలి.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం (24-04-2023 నుండి 29-04-2023)

దైవబలం రక్షిస్తుంది. చేపట్టబోయే పనుల్లో ఎన్ని ఆటలు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. ముఖ్యమైన విషయాల్లో బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు దరిచేరవు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలవు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. విరోధులకు దూరంగా ఉండాలి. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శుభప్రదం.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం (24-04-2023 నుండి 29-04-2023)

లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు. మీ పనితీరుతో పెద్దలు సంతృప్తి చెందుతారు. ఒక కీలక విషయంలో మీ ఆలోచనా ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబసభ్యులకు శుభకాలం. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. మనఃస్సౌఖ్యం ఉంటుంది. సుబ్రహ్మణ్య ధ్యానం శుభకరం.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం (24-04-2023 నుండి 29-04-2023)

చేపట్టే పనుల్లో పురోగతి ఉంటుంది. శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. శుభకార్యక్రమాలలో ఆనందంగా గడుపుతారు. మీ మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష. ఓర్పు చాలా అవసరం. కొన్ని వార్తలు బాధను కలిగిస్తాయి. ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలుగజేస్తుంది. సమయానుకూలంగా వ్యవహరించండి. నూతన వస్తువులను కొంటారు. అనారోగ్య సమస్యలు. సమయానికి విశ్రాంతి అవసరం. లక్ష్మీ ధ్యానం మంచిది.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య (24-04-2023 నుండి 29-04-2023)

పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగితే తప్పక విజయం సిద్ధిస్తుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయండి. ఆర్థికాంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి. ఉత్సాహంతో |పనిచేయాల్సిన సమయమిది. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అధికారులతో వినమ్రంగా
వ్యవహరించాలి. వారాంతంలో మేలు చేకూరుతుంది. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
💃💃💃💃💃💃💃

⚖ తుల (24-04-2023 నుండి 29-04-2023)

ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. అభీష్టాలు నెరవేరుతాయి. ఉత్సాహంగా పనిచేయాలి. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పెద్దల సూచనలు మేలు చేస్తాయి. కొత్తకోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. మన పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కొన్ని సందర్భాల్లో ముక్కుసూటితనంతో వ్యవహరించడం మేలు. ఖర్చు లేకుండా చూసుకోవాలి. నవగ్రహారాధన శుభప్రదం.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం (24-04-2023 నుండి 29-04-2023)

శుభకాలం. సుఖసౌఖ్యాలు ఉన్నాయి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. తోటివారి వల్ల మేలు జరుగుతుంది. పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోరి చేసే పనులు విజయవంతం అవుతాయి. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. ధనయోగం ఉంది. ప్రయాణాలు సఫలం అవుతాయి. విష్ణు నామస్మరణ శక్తిని ఇస్తుంది
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు (24-04-2023 నుండి 29-04-2023)

చేసిన పనులలో ఆటంకములు ఎదురవుతాయి. ముందుచూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ రంగాల్లో ఓర్పు, సహనం అవసరం. ఒక అందిస్తాయి. ఖర్చులు లేకుండా పెరగాలి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి తగిన సాయం అందుతుంది. బంధు, మిత్రులను కలుపుకొనిపోవాలి. ముఖ్య విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. దుర్గాస్తుతి మంచిది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం (24-04-2023 నుండి 29-04-2023)

మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి. పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఎన్ని ఆటంకాలు ఉన్నా ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. మానసికంగా దృఢంగా ఉండి, ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోయారు. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు శ్రమ పెరుగుతుంది. మిత్రుల సహకారం మేలు చేస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. సూర్యారాధన శుభప్రదం.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం (24-04-2023 నుండి 29-04-2023)

చేసిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. బంధు,మిత్రులతో కలుపుకొనిపోవడం వల్ల సమస్యలను అధిగమించగలుగుతున్నారు. సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్లడం మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. స్థానచలన సూచనలు ఉన్నాయి. అనవసరంగా ఆందోళన పడటం తగ్గించుకుంటే మంచిది. విష్ణుఆరాధన శుభప్రదం.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం (24-04-2023 నుండి 29-04-2023)

చేపట్టబోయే పనుల్లో కార్యానుకూలత ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తి గడిస్తారు. మీరు కోరుకున్నది అప్రయత్నంగా లభ్యం అవుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఒక శుభవార్త వింటారు. శత్రువులు దూరం అవుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారులు సహాయ సహకారాలు ఉంటాయి. బంధుమిత్రులతో అనుకూలత ఉంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి. విష్ణుఆరాధన శుభప్రదం.
🦈🦈🦈🦈🦈🦈🦈