Sports

జట్టు గెలిచినా.. విరాట్ కు వరుసగా రెండోసారి కలిసిరాని గ్రీన్ జెర్సీ

జట్టు గెలిచినా.. విరాట్ కు వరుసగా రెండోసారి కలిసిరాని గ్రీన్ జెర్సీ

సొంతమైదానంలో విరాట్ (Virat Kohli) నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రాజస్థాన్ న్ను మట్టికరిపించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ (8 పాయింట్లు) నాలుగో స్థానానికి చేరుకుంది.

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 16వ సీజన్లో (IPL 2023) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన సొంత మైదానం చిన్నస్వామి స్టేడియం వేదికగా మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. పచ్చదనంపై అవగాహన కల్పించేందుకు 2011 నుంచి ఆర్సీబీ తన లో జరిగే ఏదొక మ్యాచ్లో గ్రీన్ జెర్సీతో హోం గ్రౌండ్ బరిలోకి దిగడం ఆనవాయితీగా మార్చుకుంది. ఈ సీజన్లోనూ రాజస్థాన్ రాయల్స్లో గ్రీన్ జెర్సీలోనే విరాట్ కోహ్లి నాయకత్వంలో తలపడింది. ఆర్సీబీ ఏడు పరుగుల స్వల్ప తేడాతో రాజస్థాన్పై విజయం సాధించింది. అయితే, కెప్టెన్ విరాట్ మాత్రం మరోసారి ఈ గ్రీన్ జెర్సీలో విఫలం కావడం అభిమానులకు రుచించలేదు.

టాస్ ఓడిన బెంగళూరు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్గా వచ్చిన కెప్టెన్ విరాట్ (0) తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఎల్బీగా పెవిలియన్కు చేరాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన అద్భుతమైన ఇన్స్వింగరు ఊహించని రీతిలో ఔటయ్యాడు. గతేడాది కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లోనూ విరాట్ గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. ఎస్ఆర్చ్ బౌలర్ జగదీశా సుచిత్ బౌలింగ్ లో తొలి బంతికి కేన్ విలియమ్సన్ చేతికి చిక్కాడు. రెండు మ్యాచుల్లోనూ ఆర్సీబీ విజయం సాధించడం విశేషం.

గ్రీన్ జెర్సీ’ మ్యాచ్ విశేషాలు..

పన్నెండేళ్ల కిందట ‘గ్రీన్ జెర్సీ’ మ్యాచ్లను ప్రారంభించిన ఆర్సీబీకి పెద్దగా కలిసిరాలేదు. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్ వరకు మొత్తం 12సార్లు ఆర్సీబీ ఆడింది. అందులో కేవలం నాలుగు సార్లు మాత్రమే విజయం సాధించింది. ఆర్సీబీ గెలిచిన మ్యాచుల్లో రెండుసార్లు విరాట్ కోహ్లి డకౌట్ కాగా.. ఒక మ్యాచ్లో సెంచరీ కూడా నమోదు చేశాడు. మరో మ్యాచ్లో కీలకమైన 27 పరుగులు చేశాడు.

ఐపీఎల్ 2011లో కోచి టస్కర్స్తో మ్యాచ్లో ఆర్ సీబీ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోచి 125/9 స్కోరుకే పరిమితం కాగా.. ఆర్ సీబీ 13.1 ఓవర్లలోనే 128/1 స్కోరు చేసి గెలుపొందింది. విరాట్ (27 *) నాటౌట్గా నిలిచాడు.

* విరాట్ కోహ్లి అత్యుత్తమ ఫామ్ లో ఉన్న 2016 సీజన్లో గుజరాత్ లయన్స్పై 144 పరుగుల భారీ తేడాతో ఆర్సీబీ గెలిచింది. ఇందులో విరాట్ (109) సెంచరీ బాదాడు. విరాట్తో పాటు ఏబీ డివిలియర్స్ (129*) శతకం చేయడంతో ఆర్సీబీ 248/3 భారీ స్కోరు చేసింది. అనంతరం గుజరాత్ లయన్స్ 104 పరుగులకే ఆలౌటైంది.

సన్ రైజర్స్ హైదరాబాప్పై ఆర్సీబీ 2022 సీజన్లో 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇందులో విరాట్ కోహ్లి తొలి బంతికే డకౌట్గా పెవిలియన్కు చేరాడు. డుప్లెసిస్ (73*), రజత్ పటీదార్ (48) రాణించడంతో 192/3 స్కోరు చేసిన ఆర్సీబీ.. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ను 125 పరుగులకే ఆలౌట్ చేసి విజయం సాధించింది.