Movies

శరత్ బాబు ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరం!

శరత్ బాబు ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరం!

ప్రముఖ నటుడు శరత్ బాబు అనారోగ్యం కారణంగా ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు శుక్రవారం హైదరాబాద్ కి తరలించారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని సమాచారం.ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. కొన్ని గంటలు గడిస్తే తప్ప ఆయన పరిస్థితి ఎలా ఉందన్నది అంచనా వేయలేమని డాక్టర్లు చెబుతున్నట్లు కుటుంబ సభ్యుల నుంచి వస్తోన్న సమచారం. ఈ రోజు సాయంత్రానికి డాక్టర్లు హెల్డ్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహితుల నుంచి తెలిసింది.

నటుడిగా శరత్ బాబు ఎన్నో చిత్రాల్లో నటించారు. నటనలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం శరత్బాబు నటిస్తోన్న `మళ్లీ పెళ్లి` చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఇంతలోనే ఆయన అనారోగ్యం బారిన పడటంతో చిత్ర యూనిట్ విచారం వ్యక్తం చేస్తోంది. ఆయన అభిమానులు సన్నిహితు లు..స్నేహితుల సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్ధనలు చేస్తున్నారు.

శరత్ బాబు చెన్నైతో పాటు హైదరాబాద్ లోనూ ఉంటుంటారు. తనకున్న సినిమా షూటింగ్ లను బట్టి అక్కడికి..ఇక్కడికి తిరుగుతుంటారు. హైదరాబాద్ లో సొంతంగా ఇల్లు ఉంది. అయితే కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకప్పటిలా ఇప్పుడంతా యాక్టివ్ గా సినిమాలు చేయడం లేదు. `మళ్లీ పెళ్లి` సినిమాలో కూడా నరేష్ కోరిక మేరకు కాదనలేక నటించినట్లు తెలుస్తోంది.