NRI-NRT

TANA. కాశీలో రెండవ రోజు అన్నదానానికి అపూర్వ స్పందన.

TANA. కాశీలో రెండవ రోజు అన్నదానానికి అపూర్వ స్పందన.

తానా సభ్యులతో పాటు తానా ఫౌండేషన్ సహాయ సహకారాలతో గంగా పుష్కరాల సందర్భంగా వారణాసిలో నిర్వహిస్తున్న అన్నదానానికి అపూర్వ స్పందన లభిస్తోంది. రెండవ రోజు ఆదివారం నాడు శివాల ఘాట్లో నిర్వహిస్తున్న అన్నదానానికి పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలివచ్చారు. ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు దాదాపు 1000 మంది భక్తులు తానా అన్నదానాన్ని స్వీకరించారు.


స్వీటు పెరుగుతో పాటు దాదాపు పది రకాలు అన్నదానంలో వడ్డించారు. గుంటూరు జిల్లా పుల్లటి గుంట నుండి బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో వచ్చిన వంట బృందం రుచికరమైన ఆహార పదార్థాలను తయారుచేసి అన్నదానంలో వడ్డిస్తున్నారు. చక్కటి భోజనాన్ని అందిస్తున్న తానా సంస్థను యాత్రికులు అభినందిస్తున్నారు. మంచి ఆహారంతో పాటు చల్లటి మంచినీళ్లు సీసాలను కూడా అందిస్తున్నారు. సోమవారం నుండి ఎంతమంది యాత్రికులు వచ్చినప్పటికీ లేదనుకుంటా అన్నదానం చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

వారణాసి నుండి కిలారు ముద్దుకృష్ణ