WorldWonders

కేరళ కలల ప్రాజెక్టు.. కొచ్చిన్ వాటర్ మెట్రో

కేరళ కలల ప్రాజెక్టు.. కొచ్చిన్ వాటర్ మెట్రో

దేశంలో తొలిసారిగా నీటిపై నడిచే మెట్రో సర్వీస్ అందుబాటులోకి రానుంది. కొచ్చిన్ వాటర్ మెట్రో సర్వీస్ పేరుతో కేరళ ప్రభుత్వం ఈ రవాణా సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది.

దేశంలో తొలిసారిగా నీటిపై నడిచే మెట్రో సర్వీస్ అందుబాటులోకి రానుంది. కొచ్చిన్ వాటర్ మెట్రో సర్వీస్ పేరుతో కేరళ ప్రభుత్వం ఈ రవాణా సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రధాని మోదీ ఏప్రిల్ 25న ఈ వాటర్ మెట్రోను జాతికి అంకితం చేయనున్నారు. దక్షిణాసియాలో తొలి వాటర్ మెట్రో ఇదేనని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. కొచ్చిన్ మెట్రో రైల్ లిమిటెడ్ దీని నిర్వహణ బాధ్యతలను చూస్తుంది. ఈ మెట్రో సర్వీస్ బ్యాటరీ సాయంతో నడిచే 78 ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్లు ఉంటాయి. వీటి కోసం 38 టెర్మినళ్లు నిర్మించారు. కొచ్చిన్ చుట్టుపక్కల ఉండే 10 ద్వీపాలను కలుపుతూ ఈ వాటర్ మెట్రో రాకపోకలు సాగిస్తుంది. 1,136.83 కోట్ల వ్యయంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం, జర్మనీకి చెందిన ఫండింగ్ సంస్థ కేఎఫ్ డబ్ల్యూ కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ను చేపట్టాయి. ఇందులో ఏసీ, వైఫై సౌకర్యం ఉంటాయి. ఒక్కో బోటులో 50 నుంచి 100 మంది ప్రయాణించవచ్చు. ఇవి గంటకు 15 నుంచి 22 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.