Politics

పోలీసులను కొట్టిన వైఎస్ షర్మిల..

పోలీసులను కొట్టిన వైఎస్ షర్మిల..

విధుల్లో ఉన్న పోలీసులపై షర్మిల దురుసుగా ప్రవర్తించారు, చేయి చేసుకున్నారు. కేసు నమోదు చేసాం, YS షర్మిలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సిట్ ఆఫీసుకు వెళ్లడానికి పర్మిషన్ లేదని చెప్పాం, పోలీసుల విజ్ఞప్తిని పట్టించుకోలేదు. విజయమ్మ కూడా పోలీసులపై చేయి చేసుకున్నారు – CP CV ఆనంద్.

షర్మిలను పరామర్శించిన ఆమె భర్త అనిల్ కుమార్

TS: లోటస్ పాండ్ వద్ద పోలీసులపై దాడికి పాల్పడి అరెస్ట్, జూబ్లిహిల్స్ పోలీస్స్టేషన్లో ఉన్న వైఎస్ షర్మిలను ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు షర్మిలను కలిసేందుకు వచ్చిన విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. అయితే అనిల్ కుమార్ కు మాత్రం పోలీసులు అనుమతి ఇచ్చారు. షర్మిలపై IPC 353, 330 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అప్రమత్తతతో అరెస్టు చేశాం: CV ఆనంద్

TS: YS షర్మిల ఇవాళ సెక్రటేరియట్ ముట్టడికి వెళ్తారనే సమాచారం ఉందని నగర CP ఆనంద్ తెలిపారు. అక్కడ పరిస్థితి అదుపు తప్పుతుందని భావించి, ముందస్తుగా అప్రమత్తమై ఆమెను ఇంటివద్ద పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. అటు హౌజ్ అరెస్టుకు ప్రయత్నించిన పోలీసులపై ఆమె దాడికి పాల్పడ్డారని వెస్ట్ జోన్ DCP జోయల్ డేవిస్ ప్రకటించారు. ఆమె దాడి చేసిన SI, మహిళా PC ఫిర్యాదుతో కేసు పెడతామని పేర్కొన్నారు.