Sports

ఐపిల్ క్రికెట్ మ్యాచ్ లు కొందరికి వినోదం అయితే..మరి కొందరికి చావు మీదకు తెస్తున్నాయి….

ఐపిల్ క్రికెట్ మ్యాచ్ లు కొందరికి వినోదం అయితే..మరి కొందరికి చావు మీదకు తెస్తున్నాయి….

ఐపీఎల్‌లో బెట్టింగ్‌లు పెట్టి అప్పులపాలు.. అప్పు తీర్చలేక చివరికి…..ఎలుకల మందు తిని మృతి…

ఐపీఎల్ వచ్చిందంటే కేవలం క్రికెట్ వినోదం మాత్రమే కాదు.. బెట్టింగులు కూడా జోరుగా సాగుతాయి. ఎక్కువగా యువతే ఈ బెట్టింగులకు పాల్పడుతుంటారు. ఇందులో కొంతమందికి లాభలొస్తే మరికొందరూ తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలవుతారు. చాలామంది అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతుంటారు.

కొందరైతే తమ బంగారం, బైక్ లను కూడా అమ్మేసి అప్పులు చెల్లిస్తారు. అయితే తాజాగా ఓ విద్యార్థి ఐపీఎల్ లో బెట్టింగులు పెట్టి అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది

అనకాపల్లి జిల్లా
దిబ్బపాలెం గ్రామానికి చెందిన పెంటకోట నర్సింగ రావు, జయ దంపతులు కుమారుడు మధుకుమార్ (20).

మధుకుమార్ అనకాపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ కోసం వాళ్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద అప్పు చేశాడు. అయితే మధు బెట్టింగ్ లో నష్టపోవడంతో అప్పు తీర్చలేకపోయాడు. అప్పు తీర్చాలని మధుపై ఒత్తిడి వచ్చింది ఇక చేసేదేమి లేక ఈనెల 23న రాత్రి మధు ఎలుకల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం మధు మృతి చెందాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యా్ప్తు చేస్తున్నారు.