NRI-NRT

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను హేళన చేసిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను హేళన చేసిన ట్రంప్

బైడెన్ ను అనుకరిస్తు ఆయన ప్రసంగంలో కొన్ని విషయాలు మర్చిపోయిన సందర్భంగా ఎలా వ్యవహరించారో అలా ట్రంప్ బిహేవ్ చేస్తు హేళన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను అనుకరిస్తు హేళన చేశారు మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. జోబైడెన్ మతిమరుపు గురించి..ప్రసంగంలో కొన్ని పేర్లు మర్చిపోయిన విధానం గురించి ట్రంప్ హేళన చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డొనాల్డ్ ట్రంప్ న్యూహాంప్‌షైర్‌లో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బైడెన్ ను అనుకరిస్తు ఆయన ప్రసంగంలో కొన్ని కీలక విషయాలు మర్చిపోయిన సందర్భంగా ఎలా వ్యవహరించారో అలా ట్రంప్ బిహేవ్ చేస్తు హేళన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా బైడెన్ ప్రసంగం మధ్యలో మాట్లాడాల్సింది మర్చిపోయినట్టుగా ట్రంప్ నటించారు. అతని బైడెన్ లా అనుకరించటం చూసిన అక్కడివారంత ఒకటే నవ్వుకున్నారు. బైడెన్ మాట్లాడటం మర్చిపోవట..అలాగే స్టేజీ దిగేందుకు ఎటు వెళ్లాలో తెలీక తికమక పడ్డట్టు నటిస్తూ తన మద్దతుదారులను నవ్వించారు. చివరకు ఎడమవైపు చేయి చూపిస్తూ అటు వైపు మెల్లగా అడుగులోఅడుగు వేసుకుంటూ ట్రంప్ నడుస్తు అచ్చంగా బైడెన్‌గా ట్రంప్ అనుకరించారు. ట్రంప్ అనుకరణను చూసిన సభలో ఆయన మద్దతుదారులు విపరీతంగా నవ్వుకున్నారు.

అమెరికాలో త్వరలోనే అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. తాను మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో ఉంటానని బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఆ తరువాత కొన్ని రోజులకే బైడెన్ ను హేళన చేస్తూ అనుకరించడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ఏం చేసినా..ఏం మాట్లాడినా సంచలనంగా మారుతుంటుంది. అలా బైడెన్ ను అనుకరించిన విధానం కూడా అలాగే వైరల్ అవుతోంది. కాకపోతే ఒకసారి అధ్యక్షుడిగా పని చేసిన మరోసారి అధ్యక్ష రేసులో ఉన్న ట్రంప్ కాస్త హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా వెల్లడవుతున్నాయి.

కాగా..అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల గురించి వారి బాడీ లాంగ్వేజ్ గురించి వారి వారి వ్యహారశైలి గురించి ప్రత్యర్థులు అతి దారుణంగా వ్యాఖ్యలు చేయటం అమెరికాలో ఎన్నికల్లో సర్వసాధారణమే..కానీ ట్రంప్ తీరు మాత్రం కాస్త ఓవర్ అయిందని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.