Fashion

మా ఆవిడ.. ఏమన్నా అనుకుంటుందేమో..

మా ఆవిడ.. ఏమన్నా అనుకుంటుందేమో..

కుక్కని తప్పించ బోయి బైక్ కంట్రోల్ తప్పి సైడు ఉన్న కాలువలో పడ్డాడు శ్రీనివాస్…

కష్టపడి బైటికి చేరాడు
అటుగా వస్తున్న ఓ అందమైన అమ్మాయి కారుఆపి దగ్గర కొచ్చింది.

బాగానే వుందా? ఏదైనా ప్రోబ్లమా? అని అడిగింది.

లేదు…లేదు…నేను బాగానే వున్నట్టున్నాను. అన్నాడు శ్రీనివాస్.

పరవా లేదు!!! రండి.. చెక్ చే‌స్తా!!! మా ఇల్లుఇక్కడికి చాలా దగ్గర,..” అందామె.

” థేంక్యూ!!! కానీ మా ఆవిడ ఏమనుకుంటుందో….” అన్నాడతను.

“మరోలా అనుకోకండి. నేను నర్స్ ను. ఏవైనా దెబ్బలు తగిలి వుంటే చూసి ట్రీట్ చేస్తాను. అనుకోడానికేముంది.?” అందామె.

ఆమె చాలా అందంగా వుంది.
శ్రీనివాస్ ‘నో ‘ అనలేక పోయేడు. అయినా అన్నాడు…మా ఆవిడ అస్సలు ఇష్టపడదు…నేనిలా చెయ్యడం.!

అయినా ఆమెను చూస్తూ ఏమీ అనలేక, ఆమె ఇంటికి ఇద్దరు వెళ్లారు. చెక్ చేసి పెద్ద ప్రోబ్లమ్స్ యేమీ లేవని కన్ఫర్మ్ చేసిందామె.

ఆమె ఇచ్చిన డ్రింక్ తాగాడు. కొద్దిసేపయ్యాక ” మా ఆవిడ ఖచ్చితంగా ఫీలవుతుంది. నేను వెళ్తా..!!!” అన్నాడతను.

సిల్లీగా వుంది మీరుచెప్పేది…అసలు ఆవిడ కెలా తెలుస్తుంది ? ఆవిడ ఇంటి దగ్గర వుంటుంది కదా అందామే

కాదు. ఆవిడింకా కాలువలోనే వుంది అన్నాడు శ్రీనివాస్.

నవ్వించే వాడు యోగి…

నవ్వే వాడు భోగి…

నవ్వని వాడు రోగి…”

అన్నారు పెద్దలు

మానసిక ఒత్తిడి తగ్గించి, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నవ్వు దోహదపడుతుంది… అందుకే మనస్పూర్తిగా నవ్వుకుందామ్.

🤪🤪🤪🤪🤪🤪