Movies

“ఆహా”లో సూపర్ అనిపిస్తున్న టి.మహీపాల్ రెడ్డి “పోస్టర్”

“ఆహా”లో సూపర్ అనిపిస్తున్న టి.మహీపాల్ రెడ్డి “పోస్టర్”

యువదర్శకుడు తీపిరెడ్డి మహిపాల్‌ రెడ్డి తొలి ప్రయత్నం ‘పోస్టర్‌’ సినిమా ప్రముఖ ఓటిటి “ఆహా”లో మంచి వ్యూస్ దక్కించుకునే దిశగా దూసుకుపోతోంది. ఏప్రిల్ 28 నుంచి ప్రసారమవుతున్న ఈ చిత్రానికి “ఆహా” ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమాల్లో “పోస్టర్‌” అనే పదానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి క్యాచి టైటిల్‌తో శ్రీసాయి పుష్ప క్రియేషన్స్ బ్యానర్ పై మహిపాల్ రెడ్డితో కలసి టి.శేఖర్ రెడ్డి – ఐ.జి.రెడ్డి – ఎ.గంగారెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో విజయ్‌ ధరన్‌, రాశిసింగ్‌, అక్షత సోనావానే హీరోహీరోయిన్లుగా నటించారు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఆద్యంతం ఆసక్తిగా సాగే ఈ చిత్రం మహిపాల్ రెడ్డి దర్శకత్వ ప్రతిభకు అద్దం పడుతుంది!!