Politics

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మరోసారి సంచలన విషయాలు

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మరోసారి సంచలన విషయాలు

కుంభకోణంలో పాత్రధారులు, సూత్రధారుల పాత్రకు సంబంధించి కీలక ఆధారాలు వున్నాయని పేర్కొన్న ఈడి

నిందితుల మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించిన వాట్సాప్ ఛాల్స్, ఈ మెయిల్స్ ను అభియోగ పత్రంలో జత చేసిన ఈడి అధికారులు

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన రెండో అదనపు ఛార్జిషీటును పరిగణనలోకి తీసుకున్న రౌజ్ అవెన్యూ కోర్టు

వైఎస్ ఆర్ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు రాఘవపై పై ఈడి సంచలన అభియోగాలు

ఛార్జిషీటులో మరోసారి బిఆర్ ఎస్ ఎంఎల్ సీ కవిత పేరు పలుమార్లు ప్రస్తావన

ఈ నెల ఆరున మాగుంట రాఘవ, ఆయన సంస్థలపై అభియోగపత్రం దాఖలు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్

ఢిల్లీ లిక్కర్ వ్యాపారం గురించి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలతో పలుమార్లు సమావేశమైన మాగుంట శ్రీనివాస్ రెడ్డి

ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలోకి మాగుంట రాకను స్వాగతించిన కేజ్రీవాల్

మద్యం విధానం రూపకల్పన, అమలు కు ముందు ,తరువాత పలుమార్లు విజయ్ నాయర్ తో కవిత సమావేశమయ్యారన్నఈడి

ఢిల్లీ లిక్కర్ హోల్ సేట్, రిటైల్ వ్యాపారం భారీ వాటా కోసం మాగుంట శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నాలు చేశారన్న ఈడి

పైకి రాఘవ పేరు వున్నా అన్నీ వ్యవహారాలు తెరవెనుక నుండి నడిపింది మాగుంట శ్రీనివాస్ రెడ్డే

రిటైల్ జోన్స్ లో వ్యాపారంతో పాటు బినామీల పేరుతో హోల్ సేల్ బిజినెస్ లోనూ వాటా దక్కించుకున్న మాగుంట

సమీర్ మహేంద్రు ఇండో స్పిరిట్ గ్రూపు లో ప్రేమ్ రాహుల్ ద్వారా 32.5 వాటాదారుడు రాఘవ అన్న ఈడి

ఢిల్లీలోని మాగుటం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో లిక్కర్ కుంభకోణం నిందితులు పలుమార్లు సమావేశమయ్యారు

హైదరాబాద్, ఢిల్లీ లోని పలు ప్రాంతాలు, హోటళ్ళలో జరిగిన సమావేశాల్లో మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ పాల్గొన్నారు

ఢిల్లీ లిక్కర్ వ్యాపారం గురించి మాగుంట శ్రీనివాస్ రెడ్డి, కవిత పలుమార్లు చర్చించినట్లు ఛార్జిషీటులో అభియోగాలు

మాగుంట అగ్రో ఫామ్మ్స్ పేరుతోనే కాకుండా పిక్చీ కంపెనీ పేరుతో ఎయిర్ పోర్టు జోన్ లో కూడా రాఘవ రిటైల్ వ్యాపారం చేశారు

ఫిక్చీ కంపెనీలో వై ఎస్ శశికళ ను ప్రధాన వాటాదారుగా చూపించిన రాఘవ

ఇండో స్పిరట్ కంపెనీలో రాఘవ తరఫున డమ్మీనని ప్రేమ్ రాహుల్ అంగీకరించార్న ఈడి